Saturday, October 13, 2012

అద్దాలమేడ--1981






సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::దాసరి నారాయణరావు
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తత్త ధీం త ఝణూ తఘిట తకిట తకిట
ధా ఆ అ ఆ ఆ ఆ ఆ 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో..లో..ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై..కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే..కావ్యనాయిక 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది

చరణం::1

నేను కవిని కాను..కవిత రాయలేను
శిల్పిని కాను..నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను
గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను..నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే..పూజారిని
నీ ప్రేమ....పూజారిని 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది

చరణం::2
ఆ ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ ఆ
నేను రాముణ్ని కాను..విల్లు విరచలేను
కృష్ణుణ్ని కాను..నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ని కానే కాను
ఇందురుణ్ని అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే..నిరుపేదను
అనురాగపు దివ్వెలు చమురును నింపే..ఒక పేదను
నే నిరుపేదను... 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై..కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే..కావ్యనాయిక 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది

శివ--1989




సంగీతం::ఇళయరాజా
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు, S.P.శైలజ, బృందం
Film Directed By::Raam Gopaal Varma 
తారాగణం::అక్కినేని నాగార్జున,మురళిమోహన్,రఘువరన్,కోటశ్రీనివాస్‌రావ్,
గొల్లపూడిమారుతిరావు,సాయ్‌చంద్,తనికెళ్ళభరణి,శుభలేకశుధాకర్,J.D.చక్రవర్తి,అక్కినేని అమల,నిర్మలమ్మ,బేబి సుష్మ,పద్మ,ప్రియ.  

పల్లవి::

బోటనీ పాఠముంది 
మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం

చరణం::1

దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే 
ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు 
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు 
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే వీడి బ్రాండు 
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం

చరణం::2

అయ్యో..మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె 
మార్గమే చెప్పు గురువా..
ఆ..ఛీ..తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా 
కొండలా కోర్సువుంది ఎంతకీ 
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిరా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా

చరణం::3 

మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు 
మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్
తందనా తందననన్ తందనా 
తందననన్ తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురో॥
అరె ఏం సార్..
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు 
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం

Siva--1989
Music::Ilayaraaja 
Lyrics::Sirivennels
Singer's::S.P.Baalu,S.P.Sailaja Brundam
Film Directed By::Raam Gopaal Varma 
Cast::Akkineni Naagaarjuna,Muralimohan,Raghuvaran,Tanikella Bharani,Kota SrinivasRao,Subhaleka Sushaakar,Gollapoodi MaarutiRao,Saichand,J.D.Chakravarti,Akkineni Amala,Nirmalamma,Padma,Priya,Baby Sushma.

:::::::::::::::::::::::::::::::::::

Botany patamundi myatanii aata vundi
Deniko votu chepparaa
History lectarundi mistery picturundi
Sodaraa yedi besturaa
Botany claasante boru boru
History rustu kanna restu melu
Patalu fightulunna film chudu
Breakulu discolu chuputaru
Jagada jagada jagada jagadajaam  
Jagada jagada jagada jagadajaam 
Jagada jagada jagada jagadajaam 
Jagada jagada jagada jagadajaam 

::::1

Duvvene kodijuttu navvene
Yedchinattu yevvare kotta navabu
Kannene chudanattu kannule telabettu
Yevvarii vinta gareebu
Jorugaa vachade jamesbandu
Geeragaa vestade eela soundu
Needalaa ventade veedi brandu
Phojule chustunte vollu mandu
Jagada jagada jagada jagadajaam  
Jagada jagada jagada jagadajaam 
Jagada jagada jagada jagadajaam 
Jagada jagada jagada jagadajaam 

::::2

Ayyo marchine taluchukunte
Murchale munchukoche
Margame cheppu guruvaa
Aa...chi...talam radu marchita marchi
Talamlo padu vedhavaa marchine
Kondalaa korsu vundi
Yentakee tagganandi yendiraa inta godava
Yendukee hairanaa verrinanna
Vellaraa suluvaina darilonaa
Undira september marchi paina
Hoy vayidaa paddatundi denikaina

::::3

Maximum markulichu
Mathslo dhyasa vunchu
Koddiga vollu vancharaa orey...
Tandanaa tandananan tandanaa
Tandananan tandanaa tandananannaa
Krapupai unna shradda grapupai pettukasta
First rank podavachuro tandana
Are yem sir
Lekkalu yekkalu telvanollu
Lakkutoni lachalalla munigipotaru
Puskalto kustilu pattetollu
Sarkari clerkulayyi murigipotaru
Jagada jagada jagada jagadajaam  
Jagada jagada jagada jagadajaam 
Jagada jagada jagada jagadajaam 

Jagada jagada jagada jagadajaam

కొండవీటి సింహం--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed by::K.Raghavendra Rao 
తారాగణం::N.T.రామారావు,జయంతి,శ్రీదేవి కపూర్,మోహన్‌బాబు,గీత,రావ్‌గోపాల్‌రావ్,
కైకాల.సత్యనారాయణ,అల్లురామలింగయ్య,నాగేష్,చలపతిరావ్,సుత్తివీరభద్రరావ్,జగ్గారావ్. 

:::::::::

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 
నీలో గోదారి పొంగే 
నీ పొంగులలో మునిగి  నీ కౌగిలిలో కరిగి 
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే 
నీలో నా ఈడు పొంగే 
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే

చరణం::1 

ఆకాశమంతా  పందిళ్ళు వేసి
భూలోకమంతా పీటల్లు వేసి
ఆకాశమంతా  పందిళ్ళు వేసి 
భూలోకమంతా పీటల్లు వేసి

కౌగిళ్ళలోనే నా ఇళ్లు చూసి 
నీ కళ్ళతోనే ఆ ముళ్ళు వేసి 

త్వరపడి మది  త్వరపడి నీ జత చేరితే
ఉరవడి నా చెలి వడిలో చెలరేగితే 
నాలో నీలో 
తొలి కోరిక చలి తీరక నిను చేరగా 
తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 
నీలో గోదారి పొంగే
నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 
కలలెన్నో పులకించి కౌగిళ్లు చేరే

చరణం::2

కార్తీక వేళ కన్నుల్లు కలిసే 
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే 
కార్తీక వేళ కన్నుల్లు కలిసే 
ఏకాంత వేళ ఎన్నెల్లు కురిసే

నీ చూపులోన సూరీడు మెరిసే 
నీ ఈడుతోనే నా ఈడు ఒరిసే
తడి అలజడి చలి ముడివడి నిను కోరితే
ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే 
నీవే....నేనై 
తొలి జంటగా చలిమంటలే ఎదనంటగా 
రగిలెను సెగలకు వగలీ చలిమంటలో  

వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే 
నీలో నా ఈడు పొంగే
నీ పొంగులలో మునిగి  నీ కౌగిలిలో కరిగి 
అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

ముద్దమందారం--1981::మాండ్::రాగం







సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి సుందర రామ  మూర్తి
గానం::S.P.బాలు

మాండ్ , దేశ్ రాగం 

పల్లవి::

నీలాలు కారేనా..కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ..జాబిల్లి వేళ
పూలడోల నేను కానా...
నీలాలు కారేనా..కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే..వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా...

చరణం::1

సూరీడు..నెలరేడు
సిరిగల దొరలే కారులే
పూరిగుడిసెల్లో..పేదమనస్సులో
వెలిగేటి దీపాలులే
ఆ నింగి..ఈ నేల
కొనగల సిరులే లేవులే
కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో
నిరుపేద లోగిళ్ళులే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా...

చరణం::2

ఈ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో
కలికి వెన్నెల్లో
కలల కన్నుల్లో కలతారిపోవాలిలే
ఆ తారలే తేరి తళతళ మెరిసే రేయిలో
ఒడిలో నీవుంటే..ఒదిగి పోతుంటే
కడతేరి పోవాలిలే

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా

నీలాలు కారేనా కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా..నీ లాలి నే పాడలేనా
జాజి పూసే  వేళ జాబిల్లి వేళ
పూలడోల నేను కానా