సంగీత::K.V.మహదేవన్ రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం,పద్మనాభం,అల్లురామలింగయ్య,శుభ, పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ This is nineteen seventy two..ou ou ou I am twenty two minus two I can’t stop loving you..uuu And I am happy to dance with you happy to dance with you..uuuuu
మిస్ మిస్ రాధదేవీ..ఇక్కడ మీ తెలుగు సంప్రదాయం ఉండుననీ మాచేత ఈ తెలుగు దుస్తులు ధరింపజేసి తీసుకొని వచ్చినావు ఇదేనా మీ సంప్రదాయం? ఇదేనా మీ సంస్కృతీ? కాదు ముమ్మాటికీ కాదు! పల్లవి:: ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ చరణం::1 ఉయ్యాలలూగే వయసులో..సయ్యాటలాడే మనసులో ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ఉయ్యాలలూగే వయసులో..సయ్యాటలాడే మనసులో వెచ్చని తలపులు..తొందరపడినా పచ్చని పందిటి..పిలుపు కోసము మంచున తడిసిన..మల్లెపువ్వులా వేచి యుండుటే వేడుక..ఒక కన్నెకు ఒకే కోరిక అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ చరణం::2 కుల సతిగా పతి నారాధించి..తొలి నోముల పంటలె పండించీ కుల సతిగా పతి నారాధించి..తొలి నోముల పంటలె పండించీ అతడుండే కారడవే నందనవనిగా..భావించీ అతడుండే కారడవే నందనవనిగా..భావించీ పతి దేవుని అనుసరించుటే..సతీమ తల్లికి పరమార్థం ఒక సీతకు..ఒకే రాముడు అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ చరణం::3 ఇల్లాలుగా ఇంటికి వెలుగై..కన్నతల్లిగ పాపల పెంచీ ఇల్లాలుగా ఇంటికి వెలుగై..కన్నతల్లిగ పాపల పెంచీ సత్యం ధర్మం శౌర్య గుణం..సత్యం ధర్మం శౌర్య గుణం నిత్య సూక్తులుగ భోధించి..జాతి రక్షణకు చిరంజీవులను తీర్చి దిద్దుటే ఆశయం..ఒక తల్లికి ఒకే ఆశయం అదే అదే మా సంస్కృతీ..అదే అదే మా ప్రగతీ ఇది కాదు మా సంస్కృతీ..ఇది కాదు మా ప్రగతీ