సంగీత::చక్రవర్తి రచన::ఆత్రేయ గానం::S.P.బాలు తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి పల్లవి:: మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ నీకూ నీవారు లేరూ..నాకూ నా వారు లేరూ..ఏవంటవ్ అహా అహా ఒహో ఓహో.ఆహా హా.. నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా నీకు నీవారు లేరు..నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా చరణం::1 చుక్కల్లా చీర కట్టి..సక్కంగా కొప్పు పెట్టి చుక్కల్లా చీర కట్టి..సక్కంగా కొప్పు పెట్టి టిక్కు టాకు టాకు టక్కు టిక్కు టిక్కని నడిసెల్తున్నావే పక్క సూపు సూడనంటావ్ లకనైనా పలకనంటావ్ పక్క సూపు సూడనంటావ్ లకనైనా పలకనంటావ్ చెప్పిపోవే చిన్నదానా ఎక్కడుంటావ్ నువ్వెక్కడుంటావ్ హా ఆ ఆ..నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా చరణం::2 ఒళ్ళేడా వాడలేదు..పెళ్ళైనా జాడలేదూ ఒళ్ళేడా వాడలేదు..పెళ్ళైనా జాడలేదూ కళ్ళు రెండూ సేపలల్లే తుళ్ళి తుళ్ళి పడుతునై కళ్ళు రెండూ సేపలల్లే తుళ్ళి తుళ్ళి పడుతునై చేపలాగే జారుకుంటావ్ చిక్కెం వేస్తే చిక్కనంటావ్ హే..చెప్పిపోవే మరదలు పిల్లా ఎప్పుడొస్తావ్ మళ్ళెప్పుడొస్తవ్ ఎప్పుడంటావ్ మళ్ళెప్పుడంటవ్..హా హా హా నీకు నీవారు లేరు నాకు నావారు లేరు నీకు నేను నాకు నువ్వై ఉందామా ఉందామా
సంగీత::చక్రవర్తి రచన::ఆత్రేయ గానం::S.జానకి తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,రాజబాబు, రమాప్రభ,చంద్రమోహన్,సత్యనారాయణ,శుభ,రమణారెడ్డి పల్లవి:: ఆఅ ఆఆఆఆఆఆఆఆఆ లేని దాన్నీ నేనూ లేదనేది లేని దాన్ని నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్ని నేనూ లేని దాన్ని నేనూ నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్ని నేనూ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చరణం::1 సందెవేళా అందగాడు..సరసమాడ వచ్చినాడు సందెవేళా అందగాడు..సరసమాడ వచ్చినాడు చెక్కిలంతా చిదిమి చిదిమి..అక్కున నన్నదిమి అదిమీ ఈఈఈఈ..హా..అప్పుడడిగాడూ ఇంతీ..ఎంతా..హ హ హ హ హ వయసెంతనీ..వహ్ వహ్ వహ్ లేని దాన్ని..వయసనేదే లేనిదాన్నీ లేని దాన్ని..వయసనేదే లేనిదాన్నీ నేనూ లేని దాన్నీ..నేనూ..నాదనేది లేని దాన్నీ లేదనేది లేని దాన్నినేనూ..లేనిదాన్ని నేనూ చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆకువక్క పంటనొక్కి..అందుకొమ్మని చెంతచేరీ ఆకువక్క పంటనొక్కి..అందుకొమ్మని చెంతచేరీ చుట్టుచేయి వేసి నన్ను పట్టబోయి దొరకకుంటే హహహహా..అప్పుడడిగాడూ అది ఎక్కడా..హ హ ఓ హ హ హ నడుమెక్కడనీ..వహ్ వహ్ వహ్ లేని దాన్ని నడుమనెదే లేనిదాన్నీ లేని దాన్ని నడుమనేదే లేనిదాన్నీ నేనూ
సంగీత::K.V.మహదేవన్ రచన::ఆత్రేయ గానం::ఘంటసాల తారాగణం::నాగేశ్వరరావు,వాణిశ్రీ,కాంచన,రాజబాబు,రమాప్రభ,హలాం,సత్యనారాయణ,పద్మనాభం. పల్లవి:: పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు ఎందరో నీ లాంటి పాపలు పుట్టి వుంటారు అందులో ఎందరమ్మా పండుగలకు నోచుకుంటారు వుండి చూచుకుంటారు పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు చరణం::1 కన్న వాళ్ళు చేసుకున్న..పూజాఫలమో నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో కన్న వాళ్ళు చేసుకున్న..పూజాఫలమో నువ్వే జన్మలోనో దాచుకున్న పూర్వపుణ్యమో నూరు పండుగ లీలాగే చేసుకుంటావు నూరు పండుగ లీలాగే చేసుకుంటావు కొందరేమో పండుగల్లె వచ్చిపోతారు నూరేళ్ళు నిండిపోతారు పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు చరణం::2 ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు మనకెగాని మట్టిలోన లేవమ్మా ఉన్నవాళ్ళు లేని వాళ్ళను భేదాలు మనకెగాని మట్టిలోన లేవమ్మా ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా పెట్టి పుట్టిన దానవమ్మా నీవు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు