Saturday, November 27, 2010

జగత్ కిలాడీలు--1969






సంగీతం::S.P.కోదండపాణి
రచన::కోసరాజు
గానం::S.P.బాలు , విజ్యలక్ష్మి కన్నారావు 

పల్లవి::

ఎక్కడన్న బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను బుల్లే తప్పుకొంటాను

హోయ్..తోట పెంచను అంతో ఇంతో తోడుగ ఉన్నాను నీకు తోడుగ ఉన్నాన్నూ
వంకచేయ్ నివు చూపావంటే కారం కొడతాను కంట్లో కారం కొడతాను

చరణం::1

కడుపు కష్టమున సంపాయించిన డబ్బులు ఊరక వస్తాయా
కడుపు కష్టమున సంపాయించిన డబ్బులు ఊరక వస్తాయా
తళుక్కుమంటూ..చమక్కుచేస్తే.. వళ్ళో ఊడిపడతాయా

ఎక్కడన్నా..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను..బుల్లే తప్పుకొంటాను

చరణం::2

దారినపోయే దానయల్ల..ప్రేమంటే సరిపోతుందా..ఓ బుల్లోడా..ఆ..
దారినపోయే దానయల్ల..ప్రేమంటే సరిపోతుందా
వట్టిమాటలకు వాలుచూపులకు..వలపు వచ్చి పై పడుతుందా
హోయ్..పిల్లోయ్..ప్రాణం ఇమ్మని అడిగావంటే..పస్తాయించక ఇస్తాను
అహా..ప్రాణం ఇమ్మని అడిగావంటే..పస్తాయించక ఇస్తాను
బైసా ఇమ్మని గొణిగావంటే..తోకముడిచి పరుగేస్తానూ..

ఎక్కడన్నా..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంగతోటకాడన్నావంటే తప్పుకొంటాను..బుల్లే తప్పుకొంటాను

డబ్బువదలనిది ఎవరికి ప్రేమ డబ్బులేమికాదూ..జోగే డబ్బులేమికాదూ
హా..హ్హ..హ్హ..హ్హ..ఆహా..
...?చూస్తూ ఉంటే మోజు తీరిపోదూ..నీకు మోజు తీరిపోదూ 

అహా..ఎక్కడన్నా..ఓ..ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకొంటాను పిల్లా ఒప్పుకొంటాను
వంకచేయ్ నివు చూపావంటే కారం కొడతాను..అబ్బా.. కంట్లో కారం కొడతాను

No comments: