Sunday, June 07, 2015

తూర్పు సింధురం--1990




సంగీతం::ఇళయరాజా
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు
Film Directed By::R.V.Udhaya Kumar
తారాగణం::కార్తీక్,రేవతి,కుషుబు.

పల్లవి::

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

చరణం::1

చిరుగాలి పరదాలే గలగలలాడి
చెవిలోన లోలాకూ జతగా పాడి 

చిరుగాలి పరదాలే గలగలలాడి
చెవిలోన లోలాకూ జతగా పాడి

బంగరు దేహం సోలుతుంది పాపం
చల్లనీపూటా కోరుకుంది రాగం
నీవే అన్నావే నే పాడాలంటూ
ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

చరణం::2

ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే 

ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే
రేరాణి తాపంలో వెల్లువై పొంగే

చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే
మెత్తగా లాలీ నే పాడుతాలే

విరిసే హరివిల్లే ఊరించే వేళా
మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి
కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్

పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే
ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే 

Toorpu Sindhuram--1990
Music::IlayaRaja
Lyrics::Sirivennela
Singer's::S.P.Baalu
Film Directed By::R.V.Udhaya Kumar
Cast::Kartik,Revati,Kushubu.

:::::::::::::::::::::

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnE 

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnE 

alisina bonDumalli sarigaa bajjOmari
kalalE kanToo nuvvu uyyaaloogE hOy

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnE

::::1

chirugaali paradaalE galagalalaaDi
chevilOna lOlaakoo jatagaa paaDi 

chirugaali paradaalE galagalalaaDi
chevilOna lOlaakoo jatagaa paaDi

bangaru dEham sOlutundi paapam
challaneepooTaa kOrukundi raagam
neevE annaavE nE paaDaalanToo
uugii toogaali naa paaTE vinToo hoy

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnE 

alisina bonDumalli sarigaa bajjOmari
kalalE kanToo nuvvu uyyaaloogE hOy

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnEe 

::::2

mutyaala vaaDallO vennelE saagE
rEraaNi taapamlO velluvai pongE 

mutyaala vaaDallO vennelE saagE
rEraaNi taapamlO velluvai pongE

chintalanni teerchE manchu puvvu neevE
mettagaa laalii nE paaDutaalE

virisE harivillE uurinchE vELaa
manasE maripinchii kariginchE vELaa hoy

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnE

alisina bonDumalli sarigaa bajjOmari
kalalE kanToo nuvvu uyyaaloogE hOy

podduvaalipOyE nidarochchE vELayyEnE
ooruvaaDalOna saDi lEnE lEdayyEnE 

కళ్ళు--1988



సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం 
రచన::సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం:::సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
Cast::Shivaji Raja, Rajeshwari, Bhaskar Rao 

Director::M.V.Raghu 

పల్లవి::

మూసుకున్న రెప్పలిరిసి చూపులెగరనీయండి
తెల్లారింది లెగండో..కో క్కో రో కో
తెల్లారింది లెగండో..కో క్కో రో కో 
మంచాలింక దిగండో..కో క్కో రో కో
తెల్లారింది లెగండో..కో క్కో రో కో 
మంచాలింక దిగండో..కో క్కో రో కో 
పాములాంటి సీకటి..పడగ దించి పోయింది 
భయం నేదు భయం నేదు..నిదర ముసుగు తీయండి 
చావులాటి రాతిరి చూరు దాటి పోయింది 
భయం నేదు భయం నేదు చాపలు సుట్టేయండి 
ముడుచుకున్న రెక్కలిరిచి పిట్ట చెట్టు ఇడిసింది 
ముడుచుకున్న రెక్కలిరిచి పిట్ట చెట్టు ఇడిసింది
మూసుకున్న రెప్పలిరిసి చూపులెగరనీయండి 
తెల్లారింది లెగండో..కో క్కో రో కో 
మంచాలింక దిగండో..కో క్కో రో కో

చరణం::1

చురుకు తగ్గిపోయింది చందురూడి కంటికి 
చులకనైపోయింది లోకం సీకటికి 
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం
ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారిపోయిందా సూసే కన్ను
ముసురుకోదా మైకం మన్ను మిన్ను 
కాలం కట్టిన గంతలు దీసి 
కాంతుల ఎల్లువ గంతులు యేసి 
తెల్లారింది లెగండో..కో క్కో రో కో 
మంచాలింక దిగండో..కో క్కో రో కో

చరణం2

ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం 
ఎగ్గుబెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం 
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ 
ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల పీడా 
చమట బొట్టు సమురుగా సూరీడ్ని ఎలిగిద్దాం 
ఎలుగుచెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం 
ఏకువ చెట్టుల కత్తులు దూసి 
రేతిరి మత్తును ముక్కలు జేసి
తెల్లారింది లెగండో..కో క్కో రో కో 
మంచాలింక దిగండో..కో క్కో రో కో

ప్రాణమిత్రులు--1967




సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరీ 
Film Directed By::P.Pullayya 
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారి.

పల్లవి::

నువ్వు కావాలీ..ఈ..నువ్వే కావాలీ 
రేయి పగలు లేత వగలు..రెప రెపలాడాలీ..ఈ 

నువ్వు కావాలీ..ఈ..నువ్వే కావాలీ 
రేయి పగలు లేత వగలు..రెప రెపలాడాలీ..ఈ 
నువ్వు కావాలీ..ఈ..మ్మ్

చరణం::1

అందీ అందక ఒరగాలీ..ఆశల అంచులు పెరగాలీ
అందీ అందక ఒరగాలీ..ఆశల అంచులు పెరగాలీ
కేలు సాచి..ఈలవేసీ..కేలు సాచి..ఈలవేసీ
కెరటంలా..ఆఆఆ..విరగాలీ  

నువ్వు కావాలీ..ఈ..నువ్వే కావాలీ 
రేయి పగలు లేత వగలు..రెప రెపలాడాలీ..ఈ 
నువ్వు కావాలీ..ఈ..మ్మ్

చరణం::2


కొత్తగా జత కూడాలీ..మెత్తగా నను చూడాలీ
కొత్తగా జత కూడాలీ..మెత్తగా నను చూడాలీ
మనసులోని మధువులన్నీ..మత్తుగా చవి చూడాలి 
నువ్వు కావాలీ..ఈ..మ్మ్

చరణం::3

వయసు మొగ్గలు వేయాలీ..సొగసులే విరబూయాలీ
వయసు మొగ్గలు వేయాలీ..సొగసులే విరబూయాలీ
నిలువలేని వలపులన్నీ..నిలువలేని వలపులన్నీ
చిలిపిగా పెన వేయాలీ

నువ్వు కావాలీ..ఈ..నువ్వే కావాలీ 
రేయి పగలు లేత వగలు..రెప రెపలాడాలీ..ఈ  
నువ్వు కావాలీ..ఈ..మ్మ్

Praana Mitrulu-1967
Music::K.V.Mahadevan
Lyrics::D.C.NaaraayanaReddi
Singer's::L.R.Iswarii
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi

::::::::::::::::::::::::::::

nuvvu kaavaalii..ii..nuvvE kaavaalii 
rEyi pagalu lEta vagalu..repa repalaaDaalii..ii 

nuvvu kaavaalii..ii..nuvvE kaavaalii 
rEyi pagalu lEta vagalu..repa repalaaDaalii..ii 
nuvvu kaavaalii..ii..mm

::::1

andii andaka oragaalii..aaSala anchulu peragaalii
andii andaka oragaalii..aaSala anchulu peragaalii
kElu saachi..iilavEsii..kElu saachi..iilavEsii
keraTamlaa..aaaaaaaa..viragaalii  

nuvvu kaavaalii..ii..nuvvE kaavaalii 
rEyi pagalu lEta vagalu..repa repalaaDaalii..ii 
nuvvu kaavaalii..ii..mm

::::2

kottagaa jata kooDaalii..mettagaa nanu chooDaalii
kottagaa jata kooDaalii..mettagaa nanu chooDaalii
manasulOni madhuvulannii..mattugaa chavi chooDaali 
nuvvu kaavaalii..ii..mm

::::3

vayasu moggalu vEyaalii..sogasulE virabooyaalii
vayasu moggalu vEyaalii..sogasulE virabooyaalii
niluvalEni valapulannii..niluvalEni valapulannii
chilipigaa pena vEyaalii

nuvvu kaavaalii..ii..nuvvE kaavaalii 
rEyi pagalu lEta vagalu..repa repalaaDaalii..ii 
nuvvu kaavaalii..ii..mm

ప్రాణమిత్రులు--1967




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::ఘంటసాల గారు
Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారి.

పల్లవి::

తెల్లవారెను..కోడి కూసెను
దిక్కులన్నీ..తెలివి మీరెను

తెల్లవారెను..కోడి కూసెను
దిక్కులన్నీ..తెలివి మీరెను

సెందురూడా నిదరపో..నిదరపో
సుప్పనాతీ..సూరుడొచ్చెను
సుక్కపడుచూ..సోలిపోయెను

సుప్పనాతీ..సూరుడొచ్చెను
సుక్కపడుచూ..సోలిపోయెను
అందగాడా..నిదురపో
నిదరపో..సెందురుడా నిదరపో..నిదరపో 
అందగాడా నిదరపో..నిదరపో 

చరణం::1

ఆడుకుంటివి..తెల్లవార్లూ 
అలసిపోయెను..ఎన్నెలొళ్ళూ

ఆడుకుంటివి..తెల్లవార్లూ 
అలసిపోయెను..ఎన్నెలొళ్ళూ

నలిగిపోయిన..కలువకన్నె  
ముసుగుతన్ని..ముడుసుకుందీ

నలిగిపోయిన..కలువకన్నె  
ముసుగుతన్ని..ముడుసుకుందీ
సెందురుడా..నిదరపో
నిదరపో..అందగాడా నిదరపో..నిదరపో

చరణం::2

శెంగావీ శీరకట్టి..శెందనాలు శెరగు నింపి 
శెంగావీ శీరకట్టి..శెందనాలు శెరగు నింపి  
శెంప శెంపన కెంపు పొదిగి..శిందులాడె సిగ్గుతోటి
శెంపశెంపన కెంపు పొదిగి..శిందులాడె సిగ్గుతోటి 
కాసుకున్నదీ కలువ సిన్నది..కన్నెమనసే కట్న మన్నదీ
కాసుకున్నదీ కలువ సిన్నది..కన్నెమనసే కట్న మన్నదీ
కాసుకున్నదీ కలువ సిన్నది..కాసుకున్నదీ కలువ సిన్నది
సెందురూడ మేలుకో..మేలుకో..ఓఓ 
అందగాడా మేలుకో..ఏలుకో..మేలుకో..ఏలుకో

Praana Mitrulu-1967
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya-Atreya
Singer's::Ghantasala gaaru
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi

::::::::::::::::::::::::::::

tellavaarenu..kODi koosenu
dikkulannii..telivi meerenu

tellavaarenu..kODi koosenu
dikkulannii..telivi meerenu

sendurooDaa nidarapO..nidarapO
suppanaatii..sooruDochchenu
sukkapaDuchoo..sOlipOyenu

suppanaatee..sooruDochchenu
sukkapaDuchoo..sOlipOyenu
andagaaDaa..nidurapO
nidarapO..senduruDaa nidarapO..nidarapO 
andagaaDaa nidarapO..nidarapO 

::::1

aaDukunTivi..tellavaarluu 
alasipOyenu..enneloLLuu

aaDukunTivi..tellavaarluu 
alasipOyenu..enneloLLuu

naligipOyina..kaluvakanne  
musugutanni..muDusukundii

naligipOyina..kaluvakanne  
musugutanni..muDusukundii
senduruDaa..nidarapO
nidarapO..andagaaDaa nidarapO..nidarapO

::::2

Sengaavii SeerakaTTi..Sendanaalu Seragu nimpi 
Sengaavii SeerakaTTi..Sendanaalu Seragu nimpi  
Sempa Sempana kempu podigi..SindulaaDe siggutOTi
Sempa Sempana kempu podigi..SindulaaDe siggutOTi 
kaasukunnadii kaluva sinnadi..kannemanasE kaTna mannadii
kaasukunnadii kaluva sinnadi..kannemanasE kaTna mannadii
kaasukunnadii kaluva sinnadi..kaasukunnadii kaluva sinnadi
sendurooDa mElukO..mElukO..OO 
andagaaDaa mElukO..mElukO..mElukO..mElukO

ప్రాణమిత్రులు--1967




సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల
Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,కాంచన,శాంతాకుమారి.

పల్లవి::

నర్తకి::కలకల నవ్వె..వయసుంది..కావాలన్నా దొరకంది
కలకల నవ్వె..వయసుంది..కావాలన్నా దొరకంది
తీసుకో తీసుకో..తీయ తీయగా..దోచుకో 

బృందం::తీసుకో తీసుకో..తీయ తీయగా దోచుకో

చిన్న::కలకల నవ్వె..వయసుంటే
కళ్లెంవేసే..వొడుపుంది
కలకల నవ్వె..వయసుంటే
కళ్లెంవేసే..వొడుపుంది
కాచుకో కాచుకో..దోచే దొరనే దోచుకో

బృందం::ఊ కాచుకో కాచుకో..దోచే దొరనే దోచుకో

నర్తకి::చిగురులాంటి లేత వలపు..చెదరకుండ కవ్విస్తావా? 
చిగురులాంటి లేత వలపు..చెదరకుండ కవ్విస్తావా?
పొగరెక్కిన గుఱ్ఱంలాగ..డుర్ర్ర్ర్..ఎగురుతుంటె లాలిస్తావా? లాలిస్తావా?

బృందం::పొగరెక్కిన గుఱ్ఱంలాగ..ఎగురుతుంటె లాలిస్తావా? లాలిస్తావా?

చిన్న::చిగురు వలపు మెత్తగ దూసి..పొగరుంటె మచ్చిక చేసి
చిగురు వలపు మెత్తగ దూసి..పొగరుంటె మచ్చిక చేసి
కనుసన్నల ఆడిస్తా..ఆ..ఆహ్హా..ఆహ్హా..కౌగిటిలో బంధిస్తా

బృందం::కనుసన్నల ఆడిస్తా కౌగిటిలో..బంధిస్తా

నర్తకి::ఓ..హో..హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చిన్న::కల కల నవ్వె వయసుంటె..కళ్ళెంవేసే వొడుపుందీ
కాచుకో కాచుకో దోచే దొరనే దోచుకో

నర్తకి::కలకల నవ్వే వయసుంది..కావాలన్నా దొరకందీ
తీసుకో తీసుకో తీయ తీయగా దోచుకో 

బృందం::హోయ్..హోయ్..హోయ్

నర్తకి::ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

బృందం::హోయ్..హోయ్..హోయ్
చిన్న::ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

Praana Mitrulu-1967
Music::K.V.Mahadevan
Lyrics::D.C.Narayana Reddi
Singer's::P.Suseela,Ghantasala,Brundam
Film Directed By::P.Pullayya
Cast::Akkineni,Jaggayya,Saavitri,Kanchana,Santakumari,Gummadi

::::::::::::::::::::::::::::

Nartaki::kalakala navve..vayasundi..kaavaalannaa dorakandi
kalakala navve..vayasundi..kaavaalannaa dorakandi
teesukO teesukO..teeya teeyagaa..dOchukO 

Brundam::teesukO teesukO..teeya teeyagaa dOchukO

Chinna::kalakala navve..vayasunTE
kaLlemvEsE..voDupundi
kalakala navve..vayasunTE
kaLlemvEsE..voDupundi
kaachukO kaachukO..dOchE doranE dOchukO

Brundam::uu kaachukO kaachukO..dOchE doranE dOchukO

Nartaki::chigurulaanTi lEta valapu..chedarakunDa kavvistaavaa?
chigurulaaTi lEta valapu..chedarakunDa kavvistaavaa?
pogarekkina gurramlaaga..Durrrr..egurutunTe laalistaavaa? laalistaavaa?

Brundam::pogarekkina gurramlaaga..egurutunTe laalistaavaa? laalistaavaa?

Chinna::chiguru valapu mettaga doosi..pogarunTe machchika chEsi
chiguru valapu mettaga doosi..pogarunTe machchika chEsi
kanusannala aaDistaa..aa..aahhaa..aahhaa..kaugiTilO bandhistaa

Brundam::kanusannala aaDistaa kaugiTilO..bandhistaa

Nartaki::O..hO..hO..O O O O O O O O

Chinna::kala kala navve vayasunTe..kaLLemvEsE voDupundii
kaachukO kaachukO dOchE doranE dOchukO

Nartaki::kalakala navvE vayasundi..kaavaalannaa dorakandii
teesukO teesukO teeya teeyagaa dOchukO 

Brundam::hOy..hOy..hOy

Nartaki::O O O O O O O O

Brundam::hOy..hOy..hOy
Chinna::O O O O O O O O