Thursday, September 27, 2007

ఆత్మీయులు--1969


సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజురాఘవయ్య
గానం::ఘంటసాల,P.సుశీల


ఆమె::అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
ప్రేమించామంటారు పెద్దగ చెపుతుంటారు
పెళ్ళిమాట ఎత్తగానే చల్లగ దిగజారుతారు

అతడు::అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మారేజీలంటు లగ్నం పెట్టేస్తారు
అతడు::అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు

కట్నాలు పెరుగునని కాలేజి కెల్తారు
కట్నాలు పెరుగునని కాలేజి కెల్తారు
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్థయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లాయి ఇక చూస్కోమంటారు
అమ్మ బాబోయ్

వరందాలోన చేరి వాల్చూపులు విసురుతారు
వరందాలోన చేరి వాల్చూపులు విసురుతారు
సినిమాలు షికార్లంటు స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు
అమ్మబాబోయ్ నమ్మరాదు

దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపుదాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకొందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము

సంఘం--1954::కల్యాణి::రాగం




సంగీతం::R.సుదర్శనం
రచన::తోలేటి
గానం::P.సుశీల


!! రాగం::కల్యాణి !!

సుందరాంగమరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితినీకై రావేలా
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితినీకై రావేలా

ముద్దునవ్వుల మోహనకౄష్ణా రావేలా..ఆ...
నవ్వులలో రాలు సరాగాలురాగమయ రతనాలు..
నవ్వులలో రాలు సరాగాలురాగమయ రతనాలు..

!! సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితినీకై రావేలా !!

నీలికనులలో వాలుచూపుల ఆవేళా...
నను చూసి కనుసైగచేసితివోయీ....రావేలా
నీలికనులలో వాలుచూపుల ఆవేళా...
నను చూసి కనుసైగచేసితివోయీ....రావేలా
కాలిమువ్వలా కమ్మని పాట ఆవేళా...
కాలిమువ్వలా కమ్మని పాట ఆవేళా...
ఆ మువ్వలలో తెలుపు అదే మనసు....
మురిసే మన కలగలుపు...
మువ్వలలో తెలుపు అదే మనసు....
మురిసే మన కలగలుపు...

!! సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
నా అందచందములు దాచితినీకై రావేలా !!

హౄదయవీణ తీగలు మీటీ ఆవేళా...
అనురాగ రసములే పిండితివోయీ...రావేలా
హౄదయవీణ తీగలు మీటీ ఆవేళా...
అనురాగ రసములే పిండితివోయీ...రావేలా
మనసు నిలువదోయ్ మగువసొంతమోయ్...రావేలా..
మనసు నిలువదోయ్ మగువసొంతమోయ్...రావేలా..
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పల్లవించే.....
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పల్లవించే.....
!! సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
నా అందచందములు దాచితినీకై రావేలా !!

ఆనందబైరవి--1984::ఆనందబైరవి::రాగం




రాగం::ఆనందబైరవి
సంగీతం::రమేష్ నాయుడు

రచన::వేటూరి
గానం::S.జానకి.S.P.బాలసుబ్రమణ్యం


పిలిచిన మురళికి
వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం
అది ఆనందబైరవి రాగం

మురసిన మురళికి
మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరాగం
మది ఆనంద భైరవి రాగం

:::1


కులికే మువ్వల అలికిడి వింటే
కళలే నిద్దురలేచే..
కులికే మువ్వల అలికిడి వింటే
కళలే నిద్దురలేచే..
మనసే మురళీ ఆలాపనలో
మధురానగరిగ తోచే...
యమునా నదిలా పొంగినదీ
స్వరమే వరమై సంగమమై
 మురసిన మురళికి
మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరాగం
మది ఆనంద భైరవి రాగం

పిలిచిన మురళికి
వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం
అది ఆనందబైరవి రాగం
!!

:::2


ఎవరీ గోపిక పదలయ వింటే
ఎదలో అందియ మ్రోగే.....
పదమే పదమై మదిలో వుంటే
ప్రణయాలాపన సాగే...
హౄదయం లయమై పోయినదీ
లయలే ప్రియమై జీవితమై
మురసిన మురళికి
మెరిసిన మువ్వకి
ఎదలో ప్రేమపరాగం
మది ఆనంద భైరవి రాగం

పిలిచిన మురళికి
వలచిన మువ్వకి
ఎదలో ఒకటే రాగం
అది ఆనందబైరవి రాగం
!!