Thursday, June 16, 2011

ఊర్వశి--1974


సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి 
తారాగణం::శారద,సంజీవ్ కుమార్ (హింది నటుడు),సత్యనారాయణ,రాజబాబు,రాజశ్రీ,పుష్పలత,

పల్లవి::

వయసే ఊరుకోదురా..మనసే నిలువనీదురా
వయసే ఊరుకోదురా ఆ..మనసే నిలువనీదురా..ఆ
కన్నులనిండా కైపెక్కుతుంటే..వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే 
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే..ఒంటరి తనం కాల్చేస్తుంటే 
అబ్బా..వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా 

చరణం::1

ఏహే..లాలల..రోజు రోజుకొక కొత్త కోరిక రాజుకుంటుంది 
రేయి రేయికొక..వింత కోరిక రివ్వుమంటుంది
రోజు రోజుకొక కొత్త..కోరిక రాజుకుంటుంది 
రేయి రేయికొక వింత..కోరిక రివ్వుమంటుంది
రుచులెరిగిన పిచ్చి పరువం..రెచ్చిపోతుంది 
ఆ రుచులే కావాలని..పదే పదే కోరుకుంటుంది 
కన్నులనిండా కైపెక్కుతుంటే..వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే 
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే..ఒంటరి తనం కాల్చేస్తుంటే 
అబ్బబ్బ..వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా 

చరణం::2

ఏహే..లాలల..లేత నడుము నీ పిడికిట కూతవేసింది 
దోర సొగసు తనను తానే ఆరవేసుకుంది
లేత నడుము నీ పిడికిట కూతవేసింది 
దోర సొగసు తనను తానే ఆరవేసుకుంది
తడిగాలికి పురివిప్పిన తనువూగిందీ 
ఊగి ఊగి నీ కౌగిట ఒదిగి ఒదిగిపోతూ వుంది 
కన్నులనిండా కైపెక్కుతుంటే వెన్నెల రాతిరి వేడెక్కుతుంటే  
ఒళ్ళంత ఆవిరి ఊరేగుతుంటే ఒంటరి తనం కాల్చేస్తుంటే 
అబ్బా..వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా
వయసే ఊరుకోదురా మనసే నిలువనీదురా

రామచిలక--1978



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::జానకి


రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
తుళ్ళిపడకే..కన్నె పువ్వా
తుమ్మెదెవరో రాకముందే
ఈడు కోరే తోడుకోసం
గూడు వెతికే కన్నెమనసా
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే....
ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే
గోరువంక దారివంక
కోరుకున్న జంట కోసం
ఆశలెన్నో అల్లుకున్న
అంతలోనే ఇంత ఉలుకా
రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే

కటకటాల రుద్రయ్య --- 1978





సంగీతం::JVరాఘవులు
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

ఈదురుగాలికి మాదొరగారికి
ఏదో గుబులు రేదిందీ
ఈ చలిగాలికి..మా దొరసానికి
ఎదలో..వీణ మ్రోగింది..
హహ..హహా..హుహు..హుహూ
లల లలా..హుహు హుహూ

తడిసినకొద్ది..బిగిసిన రైక
మిడిసి మిడిసి పడుతుంటే..
హూ..నిన్నొడిసి ఒడిసి పడుతుంటే
తడిసే వగలు..రగిలే సెగలు
చిలిపి చిగురులేస్తుంటే
నా కలలు నిదుర లేస్తుంటే
నీ కళకు గెలలు వేస్తుంటే

ఈదురుగాలికి మాదొరగారికి
ఏదో గుబులు రేదిందీ
ఈ చలిగాలికి..మా దొరసానికి
ఎదలో..వీణ మ్రోగింది..
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ

కరిగిన కుంకుమ పెదవి..
ఎరుపునే కౌగిలి కోరుతు ఉంటే
నా పెదవులెర్రబడుతుంటే
తడిసి సొగసులే ఇంద్రధనస్సులో
ఏడురంగులౌతుంటే..నా పైటకొంగులౌతుంటే
నీ హొయలు లయలు వేస్తుంటే

ఈదురుగాలికి మాదొరగారికి
ఏదో గుబులు రేదిందీ
ఈ చలిగాలికి..మా దొరసానికి
ఎదలో..వీణ మ్రోగింది..
హహ హహా..మ్మ్ మ్మ్
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ

రంగూన్ రౌడి--1979::శివరంజని::రాగం




















సంగీతం::JV.రాఘవులు
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల


రాగం::శివరంజని


ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది..నిదుర కాచింది..కలువ నీకోసమే
వెలుగువై రావోయీ..వెలుతురే తేవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

కదలిపోయే కాలమంతా నిన్ను నన్నూ నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే
భ్రమర నాదాలూ..
భ్రమర నాదాలు ప్రేమ గీతాలై ప్రమళించేనోయీ
పున్నమై రావోయీ..నా పున్నెమే నీవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

నవ్వులన్నీ పువ్వులైనా నా వసంతం నీకు సొంతం
పెదవి దాటీ ఎదను మీటే ప్రేమబంధం నాకు సొంతం
ఇన్ని రాగాలూ..ఊ...
ఇన్ని రాగాలు నీకు అందించి రాగమే నేనోయీ
అనురాగమే నీవోయీ..అనురాగమే నీవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

రంగూన్ రౌడి -- 1979




సంగీతం::JV.రాఘవులు
రచన::వేటూరి
గానం::P.సుశీల
రాగం::శివరంజని

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది..నిదుర కాచింది...
ఎదురు చూసింది..నిదుర కాచింది..కలువ నీకోసమే
వెలుగువై రావోయీ..వెలుతురే తేవోయీ..

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

నువ్వులేక..నవ్వలేక..ఎందరున్నా ఎవరులేక
జంటగాని తోడులేక..ఒంటిగానే నుండలేను
స్నేహదీపాలూ..ఊ..
స్నేహదీపాలు..వెలగనీచాలు
చీకటేలేదోయీ..
వెలుగువై..రావోయీ..వెలుతురే తేవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

గువ్వలాగ నువ్వురాగ..గూడునవ్వే..గుండెనవ్వే
వేకువల్లే నీవురాగా..చీకటంతా చెదరిపోయే
తుడిచి కన్నీళ్ళూ..ఊ..తుడిచి కన్నీళ్ళూ
కలిసినూరేళ్ళు..జతగ ఉందామోయీ...
వెలుగువే నీవోయీ..వెలుతురేకావోయీ..
ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం