సంగీతం::M.రంగారావ్
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి,
పల్లవి::
ఓయబ్బో..నిషాలో ఉన్నానని
ఉలికి పడుతు..వున్నావా
మరికాస్తా తీసుకోనీ..మరికాస్తా
ఓయబ్బో..నిషాలో ఉన్నానని
ఉలికి పడుతు..వున్నావా
మరికాస్తా తీసుకోనీ..మరికాస్తా
ఊం..హు..ఊం..హు..ఊం..హు
చరణం::1
ఇన్నినాళ్ళ దాహమేదొ ఇపుడు రగులుతున్నది
ఇన్నినాళ్ళ దాహమేదొ ఇపుడు రగులుతున్నది
పలుక లేని బాధయేదొ పడగవిప్పుతున్నది
నీవు పెంచుకున్న పరువు నీరుగారుతున్నది
మరికాస్తా తీసుకోని మరికాస్తా
ఊ..ఓయబ్బో..నిషాలో ఉన్నానని
ఉలికి పడుతు..వున్నావా
మరికాస్తా తీసుకోని..మరికాస్తా
ఓయబ్బో..నిషాలో ఉన్నానని
చరణం::2
కిలాడి వేటకాడి ముందు లేడి ఆడుతున్నది
కిలాడి వేటకాడి ముందు లేడి ఆడుతున్నది
ఒకొక్క చుక్కతో మరింత ఊపు పెరుగుతున్నది
తాగిందినేనైతే తమకెందుకు దిగుతున్నది
మరికాస్తా తీసుకోని మరికాస్తా
ఓయబ్బో..నిషాలో ఉన్నానని ఉలికి పడుతు వున్నావా
మరికాస్తా తీసుకోని మరికాస్తా
ఓయబ్బో..నిషాలో ఉన్నానని ఉలికి పడుతు వున్నావా
మరికాస్తా తీసుకోని మరికాస్తా
మరికాస్తా తీసుకోని మరికాస్తా మరికాస్తా తీసుకోని మరికాస్తా