Wednesday, January 30, 2013

చింతామణి--1956








సంగీతం::కీ.శే.అద్దేపల్లి రామారావు
రచన::రావూరు రంగై (Ravuri Rangaiah) 
గానం::P.భానుమతి

పల్లవి::

తీయని వేణువులూదిన దారుల 
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువులూదిన దారుల 
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా

చరణం::1

మురళీధర నా మొర వినవేరా
మురళీధర నా మొర వినవేరా
తరుణనుగనరా వరములనీరా
చరణమె నమ్మితి రారా
శరణని వేడితిరా

తీయని వేణువులూదిన దారుల 
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా

చరణం::2

పతివని నమ్మితి పరాకదేల
పతివని నమ్మితి పరాకదేల
దయగొని రావా దరిశనమీవా
పతితను బ్రోవగ రావా
గతియని వేడితిరా

తీయని వేణువులూదిన దారుల 
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా
తీయని వేణువులూదిన దారుల 
పరిగెడు రాధనురా పదముల వ్రాలెదరా


తీయని వేణువునూదిన దారుల పరుగిడు రాధనురా - పి. భానుమతి
పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) - కె. రఘురామయ్య
పాట, పద్యం గురించి:
రచన - రావూరు వేంకటసత్యనారాయణరావు 
సంగీతం - కీ.శే.అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు

చిత్రం గురించి:
దర్శకుడు, నిర్మాత, కూర్పు - రామకృష్ణ
కథ - కాళ్ళకూరి సదాశివరావు గారి నాటకం ఆధారంగా
మాటలు, పాటలు - రావూరు వేంకటసత్యనారాయణరావు
తారాగణం - ఎన్.టి.రామారావు, పి.భానుమతి, జమున, ఎస్.వి.రంగారావు, రేలంగి, కె.రఘురామయ్య 
నేపథ్య గాయకులు - ఘంటసాల, మాధవపెద్ది, ఏ.యం.రాజా, పి.లీల, పి.సుశీల
సంగీతం - కీ.శే.అద్దేపల్లి రామారావు, టి.వి. రాజు 
నిర్మాణ సంస్థ - భరణి పిక్చర్స్ 


చింతామణి--1956






సంగీతం::కీ.శే.అద్దేపల్లి రామారావు
రచన::రావూరు రంగై (Ravuri Rangaiah)
గానం::A.M.రాజా,P.భానుమతి

పల్లవి::

అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే శృంగారమేమో
అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే భోగమే ప్రేమ
అందాలు చిందేటి ఆనందసీమ

చరణం::1

వెన్నెల రేయి పున్నమి రేడు
కల్వల వన్నెచిన్నెలెన్నో చెల్వమేమో
వెన్నెల రేయి పున్నమి రేడు
కల్వల వన్నెచిన్నెలెన్నో చెల్వమేమో
ఎన్నలేని ప్రేమ యవ్వన సీమ
ఎన్నలేని ప్రేమ యవ్వన సీమ
తేనెలూరు పూల వ్రాలు తేటికేటి తనువో

అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే శృంగారమేమో
అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే భోగమే ప్రేమ
అందాలు చిందేటి ఆనందసీమ

చరణం::2

ఆమని రాగా అలరుల దాగి
ఏమని కోకిలమ్ము ఆలాపించునోయి
ఆమని రాగా అలరుల దాగి
ఏమని కోకిలమ్ము ఆలాపించునోయి
అనురాగ గీతి నందించు రీతి
అనురాగ గీతి నందించు రీతి
ఎంత హాయి నేటి రేయి అందవోయి ప్రేమ
ఎంత హాయి నేటి రేయి అందవోయి ప్రేమ

అందాలు చిందేటి ఆనందసీమ
రాగాల తూగే భోగమే ప్రేమ
అందాలు చిందేటి ఆనందసీమ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

గోరింటాకు--1979





సంగీతం::K.V.మహదేవన్  
రచన::శ్రీ శ్రీ  
గానం::S.P.బాలు , P. సుశీల
Falm Directed By::Daasarinaaraayana Rao
తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ.

పల్లవి::

ఇలాగ వచ్చి..అలాగ తెచ్చి
ఎన్నో వరాల..మాలలు గుచ్చి
నా మెడ నిండా..వేశావు
నన్నో మనిషిని..చేశావు
ఎలాగా తీరాలి..నీ ఋణమెలాగ..తీరాలి

తీరాలంటే..దారులు లేవా
కడలి కూడా..తీరం లేదా
అడిగినవన్నీ..ఇవ్వాలీ
అడిగినప్పుడే..ఇవ్వాలీ
అలాగ తీరాలీ..నా ఋణమలాగ..తీరాలి

చరణం::1

అడిగినప్పుడే వరమిస్తారు..ఆకాశంలో దేవతలు
అడగముందే అన్నీ ఇచ్చే..నిన్నే పేరున పిలవాలీ
నిన్నే తీరున..కొలవాలీ

అసలు పేరుతో..నను పిలవద్దు
అసలు కన్నా..వడ్డీ ముద్దు
ముద్దు ముద్దుగా..ముచ్చట తీర
పిలవాలీ..నను కొలవాలీ

అలాగ తీరాలీ..నా ఋణమలాగ..తీరాలీ

చరణం::2

కన్నులకెన్నడూ..కానగరానిది 
కానుకగా..నేనడిగేదీ

అరుదైనది..నీవడిగేది
అది నిరుపేదకెలా..దొరికేది
ఈ నిరుపేదకెలా..దొరికేది

నీలో ఉన్నది..నీకే తెలియదు
నీ మనసే నే..కోరుకున్నది

అది నీకెపుడో..ఇచ్చేశానే
నీ మదిలో అద.. చేరుకున్నదీ

ఇంకేం?..

ఇలాగ తీరిందీ..మన ఋణమిలాగ..తీరింది
ఇలాగ తీరిందీ..మన ఋణమిలాగ..తీరింది

గోరింటాకు--1979




సంగీతం: K.V.మహదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు , P.సుశీల 
Falm Directed By::Daasarinaaraayana Rao
తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ.

పల్లవి: 

చెప్పనా..సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి 
చెప్పనా..చెప్పనా..చెప్పనా

అడగనా..నోరు తెరిచి అడగరానివి..ఈ 
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ..ఈ 
అడగనా..అడగనా..అడగనా 

చెప్పనా..సిగ్గు విడిచి చెప్పరానివి 
అడగనా..నోరు తెరిచి అడగరానివి 

చరణం::1 

చెప్పమనీ..చెప్పకుంటే ఒప్పననీ 
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా? 

అడగమనీ..అడగకుంటే జగడమనీ 
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా? 

అడుగు మరి..చెప్పు మరి 
అడుగు మరి..చెప్పు మరి 

చెప్పితే అల్లరి..అడిగితే తుంటరి 
చెప్పనా..సిగ్గు విడిచి చెప్పరానివి 
అడగనా..నోరు తెరిచి అడగరానివి

చరణం::2 

నిన్న రాత్రి వచ్చి..సన్న దీప మార్పి 
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని 
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే
పిల్ల గతి..కన్నెపిల్ల గతి ఏమిటో..చెప్పనా 

పగటి వేళ వచ్చి..పరాచకలాడి 
ఊరుకొన్న పడుచువాణ్ణి..ఉసిగొలిపి 
పెదవి చాపి..పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే 
ఇవ్వమనీ..ఇచ్చి చూడమని..ముద్దులే అడగనా 

వద్దని..హద్దు దాట వద్దనీ
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా 

నేననీ..వేరనేది లేదనీ..అనీ అనీ..ఆగమని 
ఆపుతున్నదెందుకని అడగనా 

అడుగు మరి..చెప్పు మరి
అడుగు మరి..చెప్పు మరి 

చెప్పితే అల్లరి..అడిగితే తుంటరి
అడగనా..అడగనా..అడగనా 
చెప్పనా..సిగ్గు విడిచి..చెప్పరానివి 
అడగనా..నోరు తెరిచి..అడగరానివి

గోరింటాకు--1979




సంగీతం::K.V.మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ
గానం::S.P.బాలు , P.సుశీల 
Falm Directed By::Daasarinaaraayana Rao
తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ.

పల్లవి::

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ..ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ..ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ..ఇన్నేళ్ళూ

చరణం::1

పిలిచి పిలిచినా..పలుకరించినా..పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా..గుసగుసమనినా ఊగదేమది నీ మది

నిదుర రాని నిశిరాతురులెన్నో..నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో..ఆరాటములెన్నో

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ..ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ..ఇన్నేళ్ళూ

చరణం::2

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపు..చొరబడతారా ఎవరైనా?

దొరవో..మరి దొంగవో
దొరవో..మరి దొంగవో
దొరికావు ఈనాటికీ

దొంగను కానూ..దొరనూ కానూ
దొంగను కానూ..దొరనూ కానూ
నంగనాచినసలే..కానూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం
ఇన్నాళ్ళూ..ఇన్నేళ్ళూ

గోరింటాకు--1979




సంగీతం::K.V.మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ
గానం::P.సుశీల
Falm Directed By::Daasarinaaraayana Rao
తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ.

పల్లవి::

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది
గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
ఎంచక్కా పండిన ఎర్రని చుక్క
చిట్టిపేరనంటాలికి శ్రీరామరక్ష 
కన్నేపేరంటాలికి కలకాం రక్ష

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం::1

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు

సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం::2

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు

సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా
సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా
అందాల చందమామ అతనే దిగివస్తాడు

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్లు కోపిష్టి కళ్లు
పడకూడదమ్మా పాపాయి మీద
పాపిష్టి కళ్లు కోపిష్టి కళ్లు
పాపిష్టి కళ్ళలో పచ్చాకామెర్లు
పాపిష్టి కళ్ళలో పచ్చాకామెర్లు
కోపిష్టి కళ్ళలో కొరివీమంటల్లు

గోరింట పూచింది కొమ్మలేకుండా
మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

ఏప్రిల్ 1 విడుదల--1991









సంగీతం::ఇళయరాజా
రచన::సిరివెన్నెల సీతారామ శాస్త్రీ
గానం::మనో, చిత్ర

పల్లవి::

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా

చరణం::1

షోలే ఉందా ఇదిగో ఇందా..
చాల్లే ఇది జ్వాల కాదా..ఆ ఆ
తెలుగులో తీశారే బాలా
ఖైది ఉందా ఇదిగో ఇందా
ఖైదికన్నయ్య కాదే..ఏ ఏ
వీడికి అన్నయ్య వాడే
జగదేకవీరుని కథ
ఇది పాట పిక్చరు కదా
అతిలోకసుందరి తల అతికించి ఇస్తా పద
ఏ మాయ చేసినా ఒప్పించే తీరాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా

చరణం::2

ఒకటా రెండా పదుల వందా
బాకీ ఎగవేయకుండా బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా మతిపోయిందా
చాల్లే మీ కాకిగోల వేళాపాళంటూ లేదా
ఏమైంది భాగ్యం కథ
కదిలిందా లేదా కథ
వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా చేస్తానే ఏమైనా