సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆచార్య-ఆత్రేయ గానం::P.B.శ్రీనివాస్,S.జానకి పల్లవి:: అతడు:: ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో.. ఆమె:: ఏవేవో వలపు తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో.. చరణం::1 అతడు:: కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది కురులలోన మల్లెపూలు కులుకుచున్నవి అరవిరిసిన పడుచుతనం పిలుచుచున్నది ఆమె: మరపురాని తొలిరేయి మరల రానిది మరపురాని తొలిరేయి మరల రానిది మగువ జీవితాన ఇదే మధురమన్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో చరణం::2 అతడు: ఒక్క క్షణం ఆమె: మ్మ్ మ్మ్ మ్మ్ అతడు: ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది ఒక్కక్షణం జారిపోతే దక్కనన్నది కాలానికి బిగి కౌగిలి కళ్ళెమన్నది ఆమె: కన్నె మనసు ఏవేవో కలలు కన్నది కన్నె మనసు ఏవేవో కలలు కన్నది ఆ కలల రూపు ఈ రేయే కాంచమన్నది అతడు::మ్మ్ మ్మ్హు.. ఆమె:ఆహా! ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో చరణం::3 అతడు:: తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి తీసియున్న తలపులను మూయమన్నది తీయనైన తలపు లేవో ముసురుకొన్నవి తీసియున్న తలపులను మూయమన్నది ఆమె:: మనసు తోటి తనువుకూడ నీది కానున్నది మనసు తోటి తనువుకూడ నీది కానున్నది మనుగడ ఈ నాటితో మనది కానున్నది ఏవేవో చిలిపి తలపులురుకుతున్నవి అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఏవేవో