సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,మీనాకుమారి,పండరీబాయి.
పల్లవి::
ఆ..హహా..ఏహెహే..ఒహో..హో..
లాలాలలలాలలలా.. లా లా..
గున్నమామిడీ గుబురులోనా
కులుకుతున్నా కోయలమ్మా
కమ్మగా ఒక పాట పాడేవా?
కైపుతో సయ్యాటలాడేవా ?
ఒహో..హో..మొలక మీసం దువ్వుకుంటూ
మురిసిపోయే...చిన్నవాడా
కమ్మగానే పాట పాడేనూ
మరి గుమ్ముగా నువు తాళమేసేవా
చరణం::1
పురివిప్పిన...కోరిక నీవై
పడగెత్తిన పరువం...నేనై
పురివిప్పిన కోరిక...నీవై
పడగెత్తిన పరువం...నేనై
సెలయేటికి చిందులు నేర్పేమా
మంచులో చలి మంటలు రేపేమా
మంచులో చలి మంటలు రేపేమా
ఒహో..హో..మొలక మీసం దువ్వుకుంటూ
మురిసిపోయే...చిన్నవాడా
కమ్మగానే పాట పాడేనూ
మరి గుమ్ముగా నువు తాళమేసేవా
చరణం::2
పాలకడలి పొంగును...నేనై
పడి లేచే కెరటం...నీవై
పాలకడలి పొంగును...నేనై
పడి లేచే కెరటం...నీవై
గగనానికి గంధం రాసేమా
సృష్టికే అందాలు పూసేమా
ఈ సృష్టికే అందాలు పూసేమా
గున్నమామిడీ గుబురులోనా
కులుకుతున్నా కోయలమ్మా
కమ్మగా ఒక పాట పాడేవా?
మరి గుమ్ముగా నువు తాళమేసేవా