సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::P.సుశీల,S.జానకి,చంద్రశేఖర బృందం.
తారాగణం::చలం,కృష్ణంరాజు,అల్లు రామలింగయ్య,బాలకృష్ణ,విజయనిర్మల,సూర్యకాంతం,నిర్మల
పల్లవి::
ధనమే ఈ జగతికి...మూలం
ధాన్యమే జనులకు...ప్రాణం
ధనమే ఈ జగతికి మూలం..ఆ
దనం లేనిదే క్షణం కదలదూ
ఈ లోకం...ఈ లోకం
ధనమే ఈ జగతికి...మూలం
ధాన్యమే జనులకు...ప్రాణం
ఆ ధాన్యం లేనిదే..లేడు మానవుడు
లేనేలేదు జీవనం..ధాన్యమే జనులకు ప్రాణం
చరణం::1
మొదట దేవుడు..ధాన్యాన్ని సృష్ఠించాడూ
ఆ పిదపనే..మానవుణ్ణి పుట్టించాడూ
మనిషికి దురాశ కలిగి..అధికారం మోజు పెరిగి
తల తిరిగీ ధనాన్ని కలిగించాడూ..మంచి ధనాన్ని బలి చేశాడూ
చరణం::2
హరి తన ఉరమున శిరిని నిలిపి శ్రీహరి అయ్యాడూ
ఆ సిరి కరుణించిన నరుడే భూవరుడయ్యాడూ
ధనముంటేనే చిటికెలోన..దైవ దర్శనం
అది లేకుంటే అవుతుందో లేదో..ధర్మ దర్శనం
ధనమే ఈ జగతికి మూలం..ధాన్యమే జనులకు ప్రాణం
ధాన్యమే జీవన మార్గం..ధనమే ఈ భువిపై స్వర్గం
ధాన్యం తోనే భుక్తీ శక్తీ..ధనముంటేనే రక్తీ ముక్తీ
ఋజువు చేసుకుందామా..నిజం తేల్చుకుందామా
నిజం...తేల్చుకుందామా