Sunday, February 25, 2018

పలువురి అభిమానుల గుండెల్లో చిరనివాసం ఏర్పరుచుకొంది ఈ అతిలోకసుందరి

Thursday, October 12, 2017

కోకిలమ్మ--1983సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::ఆచార్య -  ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::K.Bala Chander
తారాగణం::రాజివ్,సంజయ్,సరిత,స్వప్న

పల్లవి::

నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
తీయ్యగా హాయిగా..మెత్తగా మత్తుగా

నీలో మమతల..తరంగం
నాలో పలికెను..మృదంగం
నీలో మమతల..తరంగం
నాలో పలికెను..మృదంగం
జతులుగా..గతులుగా
లయలుగా..హొయలుగా

చరణం::1

కనులకు వెలుగైనా..కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కనులకు వెలుగైనా..కలలకు విలువైనా
నీవే నా చూపుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

తలపులనైనా మరపులనైనా
నీవే..నా రూపుగా..ఆ ఆ ఆ ఆ
తలపులనైనా..మరపులనైనా
నీవే...నా రూపుగా..ఆ ఆ ఆ ఆ
వయసుకే..మనసుగా
మనసుకే..సొగసుగా

నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
తీయ్యగా హాయిగా..మెత్తగా మత్తుగా

చరణం::2

మల్లెలజల్లేలా..వెన్నెల నవ్వేలా
మదిలో నీవుండగా..ఆ ఆ ఆ ఆ ఆ 
మల్లెలజల్లేలా..వెన్నెల నవ్వెలా
మదిలో..నీవుండగా..ఆ ఆ ఆ 
కోవెల ఏలా..దైవము ఏలా
ఎదటే నీవుండగా..ఆ ఆ ఆ ..ఆ హా 
కోవెల ఏలా..దైవము ఏలా
ఎదటే నీవుండగా..నేనుగా నేనుగా
వేరుగా..లేముగా..ఆ ఆ ఆ ఆ

నీలో మమతల తరంగం
నాలో పలికెను మృదంగం
జతులుగా..ఆ..గతులుగా
లయలుగా..ఆ..హొయలుగా
నీలో వలపుల..సుగంధం
నాలో చిలికెను..మరంధం
తీయ్యగా..ఆ..హాయిగా
మెత్తగా..ఆ..మత్తుగా

Kokilammaa--1983
Music::M.S.Viswanaatan
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::K.Bala Chander
Cast::Rajiv,Sanjay,Sarita,Swapna..

:::::::::::::::::::::::::::::::::

neelO valapula..sugandam
naalO chilikenu..marandham
neelO valapula..sugandam
naalO chilikenu..marandham
teeyyagaa haayigaa..mettagaa mattugaa

neelO mamatala..tarangam
naalO palikenu..mRdangam
neelO mamatala..tarangam
naalO palikenu..mRdangam
jatulugaa..gatulugaa
layalugaa..hoyalugaa

::::1

kanulaku velugainaa..kalalaku viluvainaa
neevE naa choopugaa..aa aa aa aa aa aa
kanulaku velugainaa..kalalaku viluvainaa
neevE naa choopugaa..aa aa aa aa aa aa

talapulanainaa marapulanainaa
neevE..naa roopugaa..aa aa aa aa
talapulanainaa..marapulanainaa
neevE...naa roopugaa..aa aa aa aa
vayasukE..manasugaa
manasukE..sogasugaa

neelO valapula..sugandham
naalO chilikenu..marandham
teeyyagaa haayigaa..mettagaa mattugaa

::::2

mallelajallElaa..vennela navvElaa
madilO neevunDagaa..aa aa aa aa aa 
mallelajallElaa..vennela navvElaa
madilO..neevunDagaa..aa aa aa 
kOvela Elaa..daivamu Elaa
edaTE neevunDagaa..aa aa aa ..aa haa 
kOvela Elaa..daivamu Elaa
edaTE neevunDagaa..nEnugaa nEnugaa
vErugaa..lEmugaa..aa aa aa aa

neelO mamatala tarangam
naalO palikenu mRdangam
jatulugaa..aa..gatulugaa
layalugaa..aa..hoyalugaa
neelO valapula..sugandham
naalO chilikenu..marandham
teeyyagaa..aa..haayigaa
mettagaa..aa..mattugaa

Friday, September 29, 2017

గడసరి అత్త సొగసరి కోడలు--1981సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::భానుమతి

పల్లవి::

శ్రీ గౌరీ వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ 

చరణం::1

సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే 
నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి 
సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే 
నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి
ముంజేతి చిలుక ముద్దాడ పలుకా
దీవించవే మమ్ము మా భారతీ 
సకల శుభంకరి విలయ లయంకరి 
శంకర చిత్త వశంకరి శంకరి 
సౌందర్య లహరి శివానంద లహరీ 

శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ 

చరణం::2

ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి 
కల్పవల్లి గౌరి కాపాడవే 
ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి 
కల్పవల్లి గౌరి కాపాడవే 
మా ఇంట కొలువై మము బ్రోవవే 
పసుపు నిగ్గుల తల్లి మా పార్వతీ 
ఆగమ రూపిణి అరుణ వినోదిని 
అభయమిచ్చి కరుణించవె శంకరి 
సౌందర్య లహరి శివానంద లహరీ 

శ్రీ గౌరి వాగీశ్వరీ 
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ  

Monday, July 31, 2017

కలిసి వుంటే కలదు సుఖం--1961సంగీతం::మాస్టర్ వేణు
రచన::కొసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Tapi Chanakya
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,SVR.జగ్గయ్య,సూర్యకాంతం,రేలంగి,గిరిజ,హరినాథ్.

పల్లవి::

మందార మాట విని మౌడ్యమున
కైకేయి రామలక్ష్మణులను అడవికి పంపే కదా
శకుని మాయలు నమ్మి జూదమున ఓడించి
కౌరవులు పాండవుల కష్ట పెట్టిరిగా
పరుల భోదకు లొంగి పండు వంటి సంసారాన్ని 
భాగాలుగా చీల్చి పంచుచుండిరి కదా

కలిసి వుంటే కలదు సుఖం
వేరు పడితే తీరని దుఖం
చెడు భోదలు విన్నారంటే
ఎవరికైన తప్పదు కష్టం

కలిసి వుంటే కలదు సుఖం
వేరు పడితే తీరని దుఖం
చెడు భోదలు విన్నారంటే
ఎవరికైన తప్పదు కష్టం

చరణం::1

చిట్టి చీమలన్నీ మూగి పెద్ద పుట్ట పెట్టునురా
చిట్టి చీమలన్నీ మూగి పెద్ద పుట్ట పెట్టునురా
శిల్పులంతా కట్టుగా వుండే తాజ్ మహలు కట్టిరిరా
జనులేందరో త్యాగము చేసి స్వరాజ్యము తెచ్చిరి రా

కలిసి వుంటే కలదు సుఖం
వేరు పడితే తీరని దుఖం

చరణం::2

పది కట్టెలు ఒక్కటిగా వుంటే పట్టి విరువ లేరురా
ఒక కట్టేగ ఉంటేనే వికలము చేసేరురా
కర్ణుడొకడు చేరక పోతే భారతమే పూజ్యము రా
యాదవులే ఒక్కటిగా ఉంటే నాశనమై ఉండరు రా

కలిసి వుంటే కలదు సుఖం
వేరు పడితే తీరని దుఖం
కలిసి వుంటే కలదు సుఖం
వేరు పడితే తీరని దుఖం

Tuesday, June 13, 2017

D.C.నారాయణ రెడ్డి గారికి అశ్రునివాళి


జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.. ప్రముఖ కవి.. 
గీతరచయిత డా. సి. నారాయణ రెడ్డి గారికి అశ్రునివాళి 

సి నారాయణ రెడ్డి (29-07-1931 & 12-06-2017)
సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017)గారు తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యారు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యారు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు.
ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.
ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.
ఆయనది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి.
1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించారు. అందులో బహుళ ప్రాచుర్యం పొందిన కొన్ని పాటలు
1962 ఆత్మబంధువు అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, చదువురాని వాడవని దిగులు చెందకు
1962 గులేబకావళి కథ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
1962 రక్త సంబంధం ఎవరో నను కవ్వించి పోయేదెవరో
1963 బందిపోటు వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
1963 కర్ణ గాలికి కులమేది నేలకు కులమేది
1963 లక్షాధికారి దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే, 
1963 తిరుపతమ్మ కథ పూవై విరిసిన పున్నమివేళా బిడియము నీకేలా 
1964 గుడి గంటలు నీలి కన్నుల నీడల లోనా
1964 మంచి మనిషి అంతగా నను చూడకు మాటాడకు, వింతగా 
1964 రాముడు భీముడు తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే
1965 మంగమ్మ శపథం కనులీవేళ చిలిపిగ నవ్వెను
1966 పరమానందయ్య శిష్యుల కథ నాలోని రాగమీవె నడయాడు తీగ
1968 వరకట్నం ఇదేనా మన సాంప్రదాయమిదేనా
1969 ఏకవీర కృష్ణా నీ పేరు తలచినా చాలు
1970 కోడలు దిద్దిన కాపురం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు 
1970 లక్ష్మీ కటాక్షం రా వెన్నెల దొరా కన్నియను చేరా
1971 చెల్లెలి కాపురం కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
1971 మట్టిలో మాణిక్యం రింఝిం రింఝిం హైదరబాద్
1972 బాలమిత్రుల కథ గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండు
1972 మానవుడు దానవుడు అణువూ అణువున వెలసిన దేవా కను
1972 తాత మనవడు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
1973 శారద శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా
1974 అల్లూరి సీతారామరాజు వస్తాడు నా రాజు ఈ రోజు
1974 కృష్ణవేణి కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలి
1974 నిప్పులాంటి మనిషి స్నేహమేరా నా జీవితం స్నేహమేరా 
1974 ఓ సీత కథ మల్లెకన్న తెల్లన మా సీత మనసు
1975 అన్నదమ్ముల అనుబంధం ఆనాటి హృదయాల ఆనంద గీతం 
1975 ముత్యాల ముగ్గు గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ
1976 తూర్పు పడమర శివరంజనీ నవరాగినీ వినినంతనే నా
1978 శివరంజని అభినవ తారవో నా అభిమాన తారవో, జోరుమీదున్నా
1984 మంగమ్మగారి మనవడు శ్రీ సూర్యనారాయణా మేలుకో
1985 స్వాతిముత్యం లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల 
1997 ఒసే రాములమ్మా ఒసే రాములమ్మా
2001 ప్రేమించు కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత 
2003 సీతయ్య ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు 
2009 అరుంధతి జేజమ్మా జేజమ్మా....
ఆయనకు సద్గతులు కలగాలని ఆశిస్తూ


పాటలా...అవి కావు నవ పారిజాతాలు! రసరమ్య గీతాలు!!
అది...ప్రేయసీ ప్రియులు పాడుకునే యుగళగీతం. నటించేది ఎన్టీఆర్‌, జమున. తోటలో మాల కడుతూ ఎదురుచూస్తున్న ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? ‘తోటలో తొంగి చూసిన’ ఆ రాజు నవ్వులు ఆమెకెలా అనిపిస్తాయి?
‘నవ్వులా? అవి కావు...నవపారిజాతాలు...
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు...’లా కనిపిస్తాయిట!
మరి అంతటి ప్రేమను ఆమెలో చూసిన ఆ రాజు ఏం చేశాడు?
‘ఎలనాగ నయనాల కమలాలలో దాగి...
ఎదలోన కదిలే తుమ్మెద పాట...’ విన్నాడు!
‘ఆ పాట నాలో తియ్యగ మోగనీ... అనురాగ మధుధారలై సాగనీ...’ అన్నాడు!
‘ఏకవీర’ చిత్రంలో ‘తోటలో నా రాజు...’ పాట అటు రసజ్ఞులను, ఇటు సామాన్యులను కూడా ఒకేలా ఆకట్టుకుంది.
* మరో సందర్భం... అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశం. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ ధీరగంభీరంగా నడుస్తూ వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.
‘శత సోదర సంసేవిత సదనా... అభిమానధనా... సుయోధనా...’ అంటూ స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో ఆ సందర్భాన్ని సుసంపన్నం చేసింది.
‘ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా...’ అని సంబోధించింది.
‘కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు సౌర్యాభరణా...’ అని మెచ్చుకుంది. ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలో ఇలాంటి పదాలతో సాగిన ఈ పాట కూడా నేల ప్రేక్షకుడి చేత ఈలలు వేయించింది.
* హీరో హీరోయన్‌తో కలసి విహార యాత్రకు వెళ్లే సందర్భంలో పాట రాయాల్సి వస్తే ఇంకెవరైనా అయితే శృంగార పరంగా రాస్తారు. కానీ సినారె ఆ సందర్భానికి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. శోభన్‌బాబు నటించిన ‘విచిత్ర కుటుంబం’లోని ‘ఆడవే జలకమ్ములాడవే... కలహంస లాగ... జలకన్య లాగ...’ అంటూ మొదలు పెట్టి...
‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల...’లోను, ‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట...’, ‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు...’ -సాహిత్యాన్ని జలకాలాడించారు! సినిమా పాట చేత పుణ్యస్నానాలు చేయించారు!!
* తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె.
*‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు.
*వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. 
‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. 
‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’లో కళ్లకుకట్టారు.
*‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా,
‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్‌..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘
చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.
*‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో.
‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో.
‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు.
‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు.
* ఇలా ఎన్నెన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి.
‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ...’ పాట విన్నా, ఇలా ఒకటా రెండా ఏ పాటను గమనించినా... అవన్నీ చిత్రసీమలో ‘చిత్రం... భళారే విచిత్రం...’ అనిపించేవే. ‘ఛాంగురే... భళారే... సినారె’ అనిపించేవే!!
*గీత రచయితగా సి.నారాయణరెడ్డి ప్రయాణం ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘గులేబకావళి కథ’తో ప్రారంభమైంది. తొలి చిత్రంలోనే సినారె మొత్తం పాటలన్నీ రాశారు. ‘గులేబకావళి కథ’ కోసం పాటలు రాయడానికని సినారె హైదరాబాదు నుంచి మద్రాసుకి వెళ్లగా, ఎన్టీఆర్‌ స్వయంగా రైల్వే స్టేషన్‌కి వెళ్లి, తన సొంత కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లారట. 1961మార్చి 10న సినీ గీత రచనని ఆరంభించారు సినారె. పది రోజుల్లోనే, మొత్తం పది పాటల్ని పూర్తి చేశారు. ఆ పది రోజులు కూడా ఎన్టీఆర్‌ ఇంట్లోనే భోజనం చేశారు. షూటింగ్‌ పూర్తి కాగానే నేరుగా సినారె దగ్గరికి వెళ్లి, ఆయన రాసిన పాటలు విని, భోజనానికి ఇంటికి తీసుకెళ్లేవారట ఎన్టీఆర్‌. ఆపై ఎన్టీఆర్‌ నిర్మించిన ప్రతి చిత్రంలోనూ సినారె గీతాలు రాశారు. తాను గీత రచయితగా మారిన సందర్భం గురించి ఓ ఇంటర్వ్యూలో సినారె చెబుతూ ‘‘నాకు అంతకు ముందే పాటలు రాసే అవకాశాలు వచ్చాయి.
‘శభాష్‌ రాముడు’, ‘పెళ్ళిసందడి’ చిత్రాల్లో పాటలు రాయమని అడిగారు. అయితే ఒకట్రెండు పాటలే రాయమని చెప్పేవారు. కానీ నాకది ఇష్టం ఉండేది కాదు. రాస్తే అన్ని పాటలు రాయాలనేది నా అభిమతం. ఎన్టీఆర్‌తో కూడా అంతకుముందు ముఖపరిచయం ఉంది. ఆయన హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రీకరణలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సందర్భంలోనే నాకు కబురు పెట్టారు. వెళ్లగానే ‘మీ గురించి వింటున్నాను. మీ గేయాలు పత్రికల్లో అప్పుడప్పుడు చూస్తున్నా. మీరు పాటలు రాయాలి’ అన్నారు. ‘మొత్తం పాటలన్నీ నాతోనే రాయిస్తే, రాస్తానండి’ అని చెప్పా. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు నాకు కబురు పెట్టారు. ‘‘గులేబకావళి కథలో అన్ని పాటలూ మీరే రాయాలి’’ అన్నారు. అలా మద్రాసు వెళ్లినప్పుడ గుమ్మడి, మిక్కిలినేని, సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి నాలుగు కార్లతో ఎన్టీఆర్‌ స్వయంగా మద్రాసు స్టేషనుకొచ్చి నన్ను సాదరంగా తీసుకెళ్లి, అందరికీ పరిచయం చేశారు. 
*దుర్యోధనుడికి యుగళ గీతం: ఎన్టీఆర్‌ చిత్రాల్లో ‘దానవీర శూరకర్ణ’ది ప్రత్యేక స్థానం. అందులో దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ నటన ఎంత బాగుంటుందో.. ఆ చిత్రంలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాట కూడా అంతే సూపర్‌ హిట్‌. దుర్యోధనుడికి ఓ యుగళ గీతం పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఎన్టీఆర్‌కే వచ్చిందట. వెంటనే సినారెతో ఆ విషయాన్ని చెప్పారు. ‘ఏం కవిగారూ దుర్యోధనుడికి ఈ చిత్రంలో ఓ యుగళ గీతం పెడితే ఎలా ఉంటుంది’ అని అడిగితే బాగుంటుందని సినారె చెప్పారు. దాంతో ఆ పాట రాసే బాధ్యత కూడా సి.నారాయణరెడ్డికే అప్పగించేశారు ఎన్టీఆర్‌. సాహిత్యంలో ఇష్టమొచ్చిన పద ప్రయోగాలు చేసుకోమని కూడా చెప్పేశారట ఎన్టీఆర్‌. అలా ‘చిత్రం భళారే..’ పాటకు అంకురార్పణ జరిగింది. ఆ పాటలోని సాహిత్యం రామారావుగారిని ఎంతగానో ఆకట్టుకుందని చాలాసార్లు చెప్పారు సినారె. (Courtesy: Eenadu cinema 13-06-2017)Kameswara Rao Anappindi

Friday, May 05, 2017

స్వాతిచినుకులు--1989సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరిసుందరరామ్మూర్తి 
గానం::మనో,S.జానకి
Film Directed By::Sri Chakravarti
తారాగణం::శరత్‌బాబు,సురేష్,గిరిబాబు,మారుతిరావు,వేలు,సాక్షి రంగారావు,దమయంతి,శారద,అలేఖ్య,హేమ,రమ్యకృష్ణ,జయసుధ,వాణిశ్రీ.

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..లాలలా..లాలలాల
నిన్ను కన్నా..మనసు విన్నా 
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా 
అనుబంధాల..ఆరాధన..ఆ 

నాకు నీవు...నీకు నేను 
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా 
ఎదలో..మోహనాలాపన..ఆ

చరణం::1

నీ కళ్ళు పాడేటి..కధలు..ఊఊఊ  
అధరాలలో..పొంగు సుధలు..ఊఊఉ 
ఇటు ప్రేమించుకున్నాక..ఎదలు..ఊఊఊ 
పేరంట మాడేటి...పొదలు..ఊఊఊఉ 
చేమంతిపూల..సీమంతమాడే 
హేమంత వేళ..ఈ రాసలీల 
వెయ్యేళ్ళ వెన్నెల్లు..కాయాలిలే

నిన్ను కన్నా..మనసు విన్నా 
ఎదలో..మోహనాలాపన..ఆ

నాకు నీవు...నీకు నేను 
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా 

చరణం::2

కౌగిళ్ళలో పండు..కలలు..ఊఊఉ 
వేవిళ్లలో దాటు..నెలలు..ఊఊఊ 
బిగిసందిళ్లకేటందు..కలలు..ఊఊఉ 
సందేల మందార..గెలలు..ఊఊఉ
రాసేదికాదు..ఈ చైత్రగీతం 
రాగాలు తీసే..ఈ ప్రేమవేదం 
పూలారబోసింది..ఈ తోటలో

నిన్ను కన్నా..మనసు విన్నా 
ఎదలో..మోహనాలాపన..ఆ

నీడలోనా..వెలుగులోనా 
అనుబంధాల..ఆరాధన..ఆ 

నాకు నీవు..ఆ..నీకు నేను..ఆ 
తోడు వుందాము..ఏడేడు జన్మలెత్తినా

నిన్ను కన్నా..మనసు విన్నా 
ఎదలో..మోహనాలాపన..ఆ

Swaatichinukulu--1989
Music::Ilayaraaja
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::Mano,S.Jaanaki
Film Directed By::Sri Chakravarti
Cast::SarathBabu,Suresh,Gollapoodi,Velu,Giribaabu,SaakshiRangaaRao,Damayanti,Saarada,Alekhya,Hema,Vanisree,Ramyakrishna,Jayasudha.

::::::::::::::::::::::::::::::::::::::

mm mm mm mm mm..laalalaa..laalalaala
ninnu kannaa..manasu vinnaa 
edalO..mOhanaalaapana..aa

neeDalOnaa..velugulOnaa 
anubandhaala..aaraadhana..aa 

naaku neevu...neeku nEnu 
tODu vundaamu..EDEDu janmalettinaa

ninnu kannaa..manasu vinnaa 
edalO..mOhanaalaapana..aa

::::1

nii kaLLu paaDETi..kadhalu..uuuuuu  
adharaalalO..pongu sudhalu..uuuuu 
iTu prEminchukunnaaka..edalu..uuuuuu 
pEranTa maaDETi...podalu..uuuuuuu 
chEmantipoola..seemantamaaDE 
hEmanta vELa..ii raasaleela 
veyyELLa vennellu..kaayaalilE

ninnu kannaa..manasu vinnaa 
edalO..mOhanaalaapana..aa

naaku neevu...neeku nEnu 
tODu vundaamu..EDEDu janmalettinaa

ninnu kannaa..manasu vinnaa 

::::2

kaugiLLalO panDu..kalalu..uuuuu 
vEviLlalO daaTu..nelalu..uuuuuu 
bigisandiLlakETandu..kalalu..uuuuu 
sandEla mandaara..gelalu..uuuuu
raasEdikaadu..ii..chaitrageetam 
raagaalu teesE..ii..prEmavEdam 
poolaarabOsindi..ii..tOTalO

ninnu kannaa..manasu vinnaa 
edalO..mOhanaalaapana..aa

neeDalOnaa..velugulOnaa 
anubandhaala..aaraadhana..aa 

naaku neevu..aa..neeku nEnu..aa 
tODu vundaamu..EDEDu janmalettinaa

ninnu kannaa..manasu vinnaa 
edalO..mOhanaalaapana..aa

Sunday, April 23, 2017

శ్రీమతి S.జానకి గారి 80వ పుట్టిన రోజు


శ్రీమతి ఎస్ జానకి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా...
(S. Janaki born on 23-04-1938)
ఆమె గొంతు ఓ గంగా ప్రవాహం... ఆమె గానం ఓ మలయమారుతం... ఆమె స్వరం ఓ కోయిల గానం. ఆ స్వరం ఓ సమ్మోహనం... తన పాటకు పగలే వెన్నెల కాస్తుంది... జగమంతా ఊయలలూగుతుంది. ఆమె పలుకు వింటే ప్రకృతి పులకరిస్తుంది. ఆ సుస్వరాల కోకిల వయస్సు 80 ఏళ్లయితే, తన గాత్రం వయస్సు 60 ఏళ్లు. అయినా... ఆమె గొంతులోనూ, గానంలోనూ ఎక్కడా వృద్దాప్య ఛాయలు కనిపించవు. ఆమె మరెవరో కాదు... తన కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి.
ఎస్.జానకి అంటే.. 'సంగీత జానకి'గా సంగీతాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 15 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో వీనుల విందు చేసిన గాయకరత్నం... మన ఆణిముత్యం జన్మదినం నేడు.
గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు 1938, ఏప్రిల్ 23న జానకి జన్మించారు. నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి 1957వ సంవత్సరంలో తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తిన జానకి పాటల రచయిత, సంగీత దర్శకురాలు కూడా. 1956లో రేడియో పాటల పోటీలో పాల్గొన్న జానకి ఆ పోటీలో రెండవ బహుమతి గెలుచుకొని, అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో ఎం.చంద్రశేఖరం జానకిని మద్రాస్లోని ప్రముఖ సంగీత సంస్థ ఎ.వి.ఎం.కు పరిచయం చేశారు. అదే సమయంలో పి.సుశీలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పూర్తికావొచ్చిన ఎ.వి.ఎం. వారికి మరో గాయని కావలసివచ్చింది. ఆ సమయంలో వారికి జానకి తటస్థించారు. అప్పటి ఎ.వి.ఎం. నిర్వాహకులను జానకి తన అభిమాన గాయకురాలైన లతామంగేష్కర్ పాడిన 'రసిక్ బల్మా' పాటతో మెప్పించారు. ఇక అక్కడినుంచి జానకి ఎ.వి.ఎం.లో స్టాఫ్ సింగర్ అయ్యారు. మొదట్లో అసలు తమిళమే రాని జానకి మొట్టమొదటిసారిగా తమిళంలోనే పాడారు. అవి రెండూ విషాద గీతాలే. టి.చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన 'విధియిన్ విళైయాట్టు' అనే తమిళ చిత్రంలో 4.4.1957న ఆమె తొలిసారిగా 'పేదై ఎన్ ఆసై పాళా న దేనో' అనే శోకగీతంతో తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు.
5.4.1957న 'ఎం.ఎల్.ఎ.' సినిమా కోసం ఘంటశాలతో కలిసి 'నీ ఆశ అడియాస... చెయి జారే మణిపూస... బ్రతుకంతా అమవాస లంబాడోళ్ల రాందాసా' అనే విషాద గీతం పాడారు. ఇది కూడా విషాద గీతం కావడం యాదృచ్ఛికమే. ఆమె మలయాళంలో పాడిన తొలి గీతం కూడా శోక గీతమే. ఎంవిఎం వారికి తొలిసారిగా సింహళంలో పాడిన పాట కూడా అలాంటి సందర్భంలోనిదేనట. దీంతో 'ఇదేమిట్రా... శుభమా అని సినిమాల్లోకి వస్తే ప్రారంభమే ఏడుపు పాటలు పాడాల్సి వచ్చిందే' అని జానకి ఫీలాయ్యారట. ఆ తర్వాత 'బిడ్డ పుట్టగానే ఏడుస్తూనే కదా లోకాన్ని చూసేది... లోకంలోకి వచ్చేది... ఇదీ అంతే' అని తనని తాను సముదాయించుకున్నారట. ఆమె పాడటం ప్రారంభించిన తొలి సంవత్సరమే(1957) 6భాషల్లో 100పాటలకు పైగా పాడి రికార్డు సృష్టించారు.
మొదట పాడిన పాట ఏదైననూ ఆవిడకు బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది మాత్రము “ నీ లీల పాడెద దేవ “ ఈ పాట కోసము ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు గారు ఒక సన్నాయి లాంటి గళానికి కోసము వెతుకుతుండగా , జానకి గారి మావగారైన డా!చంద్రశేఖర్ గారి ద్వారా ఆవిడ గురించి వినడము , ఆ తరవాత కరైకూచి అరుణాచలం గారి నాదస్వరానికి పోటీ పడుతూ ఆవిడ పాడిన ఆ పాట ఆ నాటి నుండి ఈ నాటి వరకు సంగీతభిమానులను డోళలాడిస్తూనే ఉంది . అటు వంటి పాట ఇంతవరకు ఎవరూ పాడలేదు…….పాడలేరు. ఈ పాట పాటలప్రపంచములో ఒక సుస్థిరస్థాన్నాన్ని ఏరపరచుకొని అభేరీ రాగానికే ‘ ఆభరణం ‘ అయ్యింది.
ఇళయరాజా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ..''జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతిరోజూ కొన్ని లీటర్ల తేనె తాగుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా'' అని జానకి గాత్రంలోని మాధుర్యం గురించి చమత్కరించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గానంలో మాధుర్యం ఎంతో.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, సినాÛలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్, సింహళీ భాషల్లో తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె.జె.జేసుదాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, పి. జయచంద్రన్, పి.లీలా, కె.ఎస్.చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి.శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి.బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పాటు మనో, వందే మాతరం శ్రీనివాస్ వంటి వర్థమాన గాయకులెందరితోనో కలిసి పాడారు.
బిస్మిల్లాఖాన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రముఖ సంగీత విద్వాంసులతోనూ కలిసి పనిచేశారు. ఎస్.రాజేశ్వరరావు, దక్షిణమూర్తి, సుబ్బయ్య నాయుడు, పెండ్యాల, కె.వి.మహదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథం, రాజన్ నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, రమేష్ నాయుడు, జాన్సన్, శ్యామ్, వందేమాతరం శ్రీనివాస్, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి ఎందరో సంగీత దర్శకులకు గాత్రం అందించారు.
ఆరుసార్లు జాతీయ స్థాయిలో గాయనిగా అవార్డు అందుకున్నారు. వాటిల్లో తెలుగులో వంశీ దర్శకత్వంలో ఆమె పాడిన 'సితార' చిత్రంలోని 'వెన్నెల్లో గోదారి అందం' పాటకుగాను ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు అందుకున్నారు.
మహమ్మద్ రఫీ, లతామంగేష్కర్, ఆశాభోంస్లేలు జానకికి ఇష్టమైన సింగర్స్. ఐదు తరాల నటీమణులకు జానకి తన గళాన్ని అందించడం మరో విశేషం. రామోజీరావు నిర్మించిన 'మౌనపోరాటం' చిత్రానికి జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తరం వారిలో భానుమతి, పి.లీల తర్వాత జానకి మాత్రమే మహిళా సంగీత దర్శకురాలు. ప్రస్తుతం ఉన్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు, గాయకురాలు ఎంఎం శ్రీలేఖ మాత్రమే.
ఏ భాషలో పాడినా... పాటలో ఆ నేటివిటీ ధ్వనించేలా పాడగలగడమే ఆమె అందరి అభిమానం చూరగొనేలా చేసింది. ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి వి.రామ ప్రసాద్ ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.
ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడారు.
మౌనపోరాటం సినిమా ద్వారా ఆవిడ సినీ సంగీత దర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు. చాలా కొద్దిమందికే తెలిసిన మరో విద్య కూడా కలదు ఆవిడలో …అవిడ మంచి చిత్రకారిణి కూడా.
ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు.1980-90 దశకంలో విడుదలైన చిత్రాలన్నింటిలో జానకి గాత్రం వినబడేది. బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రం అందించారు. జానకి అద్భుతమైన పాటలనెన్నింటినో వీనుల విందుగా ఆలపించి శ్రోతలను పరవశింపచేశారు.
నీలిమేఘాలలో... గాలి కెరటాలలో (బావామరదళ్లు), పగలే వెన్నెల, జగమే ఊయల (పూజాఫలం), నడిరేయి ఏ జాములో (రంగులరాట్నం), ఆడదాని ఓరచూపులో (ఆరాధన), ఈ దుర్యోధన, దుశ్సాసన, దుర్వినీతి లోకంలో (ప్రతిఘటన), గున్న మామిడి కొమ్మ మీద(బాలమిత్రుల కథ), కన్నె పిల్లవని కన్నులున్నవి (ఆకలి రాజ్యం), సిరిమల్లె పువ్వా (సిరిమల్లె పువ్వా), సందె పొద్దుల కాడా (అభిలాష), మౌనవేలనోయి (సాగర సంగమం), గోవుల్లు తెల్లనా గోపమ్మ నల్లనా (సప్తపది), నీలి మేఘాలలో (బావా మరదలు), నీ లీలా పాడెద దేవ (మురిపించే మువ్వలు), వెన్నెల్లో గోదారి అందం (సితార), గువ్వా గోరింకతో (ఖైదీ నెం.786), మనసా తెళ్లిపడకే (శ్రీవారికి ప్రేమలేఖ), చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య ( స్వాతి ముత్యం ) , పంటచేల్లో పాలకంకి నవ్వింది ( పదహారేళ్ల ) ,గున్నమామిడి కొమ్మ మీద (బాలమిత్రుల కథ )
భళిరా నీవెంత (దేవాంతకుడు), గాజులమ్మ గాజులు (కార్తవరాయని కథ), ఓ వన్నెకాడ (పాండవ వనవాసం), కన్ను కన్ను చేర (అగ్గి పిడుగు), హొయిరే పైరగాలి (గోపాలుడు భూపాలుడు), లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు (అగ్గిపిడుగు ), స స స సారె గ గ గ గారె నీవురంగుల (సవతికొడుకు ), ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక (టైగర్ రాముడు), నవ భావనలు (టైగర్ రాముడు), జయ గణనాయక విఘ్నవినాయక (నర్తనశాల), ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు (గోపాలుడు భూపాలుడు ), కలల అలలపై (గులేబకావళి కథ), సలామ లేకుం (గులేబకావళి కథ), ఏమో ఏమో ఇది (అగ్గి పిడుగు), సిలకవే రంగైన మొలకవే (సంగీత లక్ష్మి ),మల్లెలు కురిసే చల్లని వేళలో (అడుగు జాడలు), హిమనగిరీ మధుర (వరూధీనీ ప్రవరాఖ్య, టైగర్ రాముడు ), వల్లభా ప్రియ వల్లభ (శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కథ), కుశలమా (శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కథ), వసంత గాలికి వలపులు రేగ (శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కథ ), కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో (లక్ష్మీ కటాక్షం ), చిరునవ్వుల చినవాడే పరువంలో (పవిత్ర హృదయాలు ), త ధిన్ ధోన ( ధిల్లానా , ఉమా చండీ గౌరీ శంకరుల కథ ), అలుకమానవే (శ్రీ కృష్ణ సత్య), ఎంత మధుర సీమ (దేవాంతకుడు), భళారే వీరుడు నీవేరా (దేవత), వలపులోని (తోడు నీడ), రారా ఇటు రారా (దాన వీర శూర కర్ణ),చెడు అనవద్దు (మేలుకొలుపు),పాలరాతి బొమ్మకు (అమ్మాయి పెళ్ళి), నిద్దురపోరా సామీ (కోడలు దిద్దిన కాపురం),సరి లేరు నీకెవ్వరు (కంచు కోట), ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది (అగ్గిపిడుగు ), ఎవరనుకున్నావే (అగ్గి పిడుగు), ఓహో హోహో రైతన్నా (విజయం మనదే ), కదలించే వేదనలోనే ఉదయించును (సంగీత లక్ష్మి ), నేటికి మళ్ళీ మా ఇంట్లో (వాడే వీడు), ఎనలేని ఆనందమీ రేయీ (పరమానందయ్య శిష్యుల కథ ), ఎవ్వరో పిలిచినట్టుటుంది (విజయం మనదే ), పలికేది నేనైనా పలికించేది నీవేలే (పవిత్ర హృదయాలు ), భువనమోహినీ అవధిలేని యుగయుగాల (భామావిజయం ), ఎన్నాళ్ళకెన్నాళ్లకు (అడవి రాముడు), నరవరా కురువరా (నర్తనశాల) వంటి ఎన్నో వైవిధ్యభరితమైన పాటలను తన సుస్వరంతో ఆలపించి వీనుల విందు చేశారు.
kameswara rao anappindi

Saturday, April 15, 2017

సింహాసనం--1986సంగీతం::బప్పీలహరి (బప్పిలహరి తొలి తెలుగు చిత్రం)
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::రాజ్ సీతారామ్, P.సుశీల 
Film Directed By::Ghattamaneni Sivaraama Krishna 
తారాగణం::కృష్ణ గుమ్మడి,ప్రభాకర్‌రెడ్డి,కాంతారావు,గిరిబాబు,సత్యనారాయణ (అంజాద్‌ ఖాన్‌ నటించిన తొలి చిత్రం),త్యాగరాజు, మహారథి, బాలయ్య, రాజవర్మ, సుదర్శన్, సి.ఎస్‌.రావు, ప్రవీణ్‌కుమార్‌, భీమరాజు చంద్రరాజు, వహీదా రెహమాన్, జయమాలిని, అనూరాధ, జయశ్రీ, టి.లీనాదాస్‌ 
జయప్రద,రాధ,మందాకిని.

పల్లవి::

లలలా..లలలా..లలలలాల..ఆఆ
లలలా..లలలా..లలలా..ఆ..లా..ఆ
వయ్యారమంతా కోరే ఒక్క కౌగిలి..ఇచ్చుకో..ఓ
నా ముద్దు ముద్దర్లడిగే కన్నె జాబిలి..ఉంచుకో..ఓ
ఈ నిండు యవ్వనాల..కౌగిలింతలో 
సాగనీ సంగమం..మ్మ్..తియ్యగా
హాయిగా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

తకతుతకతై..తకతై 
తకతుతకతై..తకతై 

వయసే విరిసే..రాతిరి
వయసే విరిసే..రాతిరి

చరణం::1

పెదవుల పొంగిన..అమృతం
దాహం తీర్చే..వేళా
హ్హా..ఝుమ్మని పొంగిన..పరువం
రమ్మని పిలిచే..వేళా..ఆఆ

ఆహా..పెదవుల పొంగిన..అమృతం
దాహం తీర్చే...వేళా
ఆ..హా..ఝుమ్మని పొంగిన..పరువం
రమ్మని పిలిచే...వేళా
సాగనీ సంగమం..మ్మ్..మత్తుమత్తుగా..మెత్తగా

ఆఆఅ..తకతుతకతై..తకతై
తకతుతకతై..తకతై 

వయసే విరిసే..రాతిరి
వయసే విరిసే..రాతిరి..ఆహా

చరణం::2  

రాతిరి కుండదు..ఉదయం 
ఎదలో దాగిన వేళా..హా..ఆ
తారల కుండదు..గ్రహణం
తనువులు కలిసిన వేళా..ఆ..ఆ

ఓ..రాతిరి కుండదు..ఉదయం 
ఎదలో దాగిన వేళా..మ్మ్
మ్మ్..మ్మ్..హ..హ..హా
తారల కుండదు..గ్రహణం
తనువులు కలిసిన వేళా..ఆ
సగనీ సంగమం రాసలీలలో..తేలగా..హా..ఆ

తకతుతకతై..తకతై
తకతుతకతై..తకతై 

వయసే విరిసే..రాతిరి
వయసే విరిసే..రాతిరి

వయ్యారమంతా కోరే ఒక్క కౌగిలి..ఇచ్చుకో
నా ముద్దు ముద్దర్లడిగే కన్నె జాబిలి..ఉంచుకో

ఓఓఓ..ఈ నిండు యవ్వనాల..కౌగిలింతలో 
సాగనీ సంగమం..ంం..తియ్యగా
హాయిగా..ఆ..ఆ..ఆ..ఆ 

తకతుతకతై..తకతై 
తకతుతకతై..తకతై 

వయసే విరిసే..రాతిరి 
వయసే విరిసే..రాతిరి

హహహహ..హహహహహహహా
హహహహ..హహహహహహహా
మ్మ్..హూ..హా..హా..ఆ..అహాహా

Simhaasanam--1986
Music::Bappiilahari
Lyrics::Veetoorisundararaammoorti
Singer::Raajseetaaraam,P.Suseela
Film Directed By::Ghattananeni Sivaraama Krishna
Cast::Krishna,Gummadi,M.Prabhaakar Reddi,KaantaaRao,GiribaabuK.Satyanaaraayana,(Anjaad khaan First Movie),Tyaagaraaju,mahaaradhi,Baalayya,Raajavarma,Sudarsan,C.S.Rao,raveenkumaar,Bhiimaraaju,Chandraraaju,Vahidaa rehamaan,Jayamaalini,Anuraadha,Jayasree,T.Leenaadaas,Mandaakini,Jayaprada,Raadha.

:::::::::::::::::::::::::::::::

lalalaa..lalalaa..lalalalaala..aaaaa
lalalaa..lalalaa..lalalaa..aa..laa..aa
vayyaaramantaa kOrE okka kaugili..ichchukO..O
naa muddu muddarlaDigE kanne jaabili..unchukO..O
ii ninDu yavvanaala..kaugilintalO 
saaganii sangamam..mm..tiyyagaa
haayigaa..aa..aa..aa..aa..aa..aa 

takatutakatai..takatai 
takatutakatai..takatai 

vayasE virisE..raatiri
vayasE virisE..raatiri

::::1

pedavula pongina..amRtam
daaham teerchE..vELaa
hhaa..jhummani pongina..paruvam
rammani pilichE..vELaa..aaaaaa

aahaa..pedavula pongina..amRtam
daaham teerchE...vELaa
aa..haa..jhummani pongina..paruvam
rammani pilichE...vELaa
saaganii sangamam..mm..mattumattugaa..mettagaa

aaaaaa..takatutakatai..takatai
takatutakatai..takatai 

vayasE virisE..raatiri
vayasE virisE..raatiri..aahaa

::::2  

raatiri kuNDadu..udayaM 
edalO daagina vELaa..haa..aa
taarala kunDadu..grahaNam
tanuvulu kalisina vELaa..aa..aa

O..raatiri kunDadu..udayam 
edalO daagina vELaa..mm
mm..mm..ha..ha..haa
taarala kunDadu..grahaNam
tanuvulu kalisina vELaa..aa
saganii sangamam raasaleelalO..tElagaa..haa..aa

takatutakatai..takatai
takatutakatai..takatai 

vayasE virisE..raatiri
vayasE virisE..raatiri

vayyaaramantaa kOrE oka kougili..ichchukO
naa muddu muddarlaDigE..kanne jaabili..uMchukO

OOO..ii ninDu yavvanaala..kaugilintalO 
saaganii sangamam..mm..tiyyagaa
haayigaa..aa..aa..aa..aa

takatutakatai..takatai 
takatutakatai..takatai 

vayasE virisE..raatiri 
vayasE virisE..raatiri

hahahaha..hahahahahahahaa
hahahaha..hahahahahahahaa
mm..huu..haa..haa..aa..ahaahaa

Sunday, April 09, 2017

బంధం--1986
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::Raajachandra
తారాగణం::శోభన్‌బాబు,మురళిమోహన్,అల్లురామలింగయ్య,J.V.సోమయాజులు,C.S.రావు,(నూతన నటుడు)రాజేంద్ర,కల్పనారాయ్,రావికొండలరావు,త్యాగరాజు,అన్నపూర్ణమ్మ,
విజయశాంతి,రాధిక,సిల్క్‌స్మిత,మాష్టర్ శ్రీహనుమాన్,బేబి విజయలక్ష్మీ,బేబి కీర్తి,
జయవిజయ,జానకి,ధనశ్రీ,విరిత,విజయబాల.

పల్లవి:: 

ఇదో ప్రేమగోపురం..ఇదే నీకు ఆలయం
చిలిపి..నవ్వులతోనే..ఏఏఏ  
వలపు దీపాలెన్నో..పెట్టాలంట 
తోడు నీడా..నేనై..ఈ
ఇదో ప్రేమగోపురం..ఇదే నీకు ఆలయం

చరణం::1

పువ్వుతేనై నువ్వు నేనై..ముద్దాలాడాలంటా
గాలివానై నీలో నేనై..నీళ్ళాడాలంటా

చెదరని కుంకుమ బొట్టు..చెలిమికి వేకువ పొద్దు
మమతలే..మనుగడై..కలిపిన వలపుల..కౌగిలిలో
నీ నీడలో..ఓ..ఆశలా..ఆ..మేడలే..ఏ..నిలుపనా
ఇదో ప్రేమగోపురం..ఇదే నీకు ఆలయం

చరణం::2

మేఘాలల్లే తాకంగానే..మెరుపవ్వాలంటా
ఆకాశంలో నక్షత్రాలే..నగలవ్వాలంటా

తరగని కాటుక కన్ను..పాపగ చేసెను నన్ను
సిరులనే అడగని..మరులులో పెరిగిన ప్రేమలలో
నీ పూజకే పూవునై..పూయనా..రాలనా

ఇదో ప్రేమగోపురం..ఇదే నీకు ఆలయం
చిలిపి..నవ్వులతోనే..ఏఏఏ 
వలపు దీపాలెన్నో పెట్టాలంట..తోడు నీడా నేనై

ఇదో ప్రేమగోపురం..ఇదే నీకు ఆలయం
లలాలాలలాలలా..లలాలాలలాలలా
లలాలాలలాలలా..లలాలాలలాలలా

Bandham--1986
Music::Chakravarti
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Raajchandra
Cast::Sobhanbabu,Raadhika,

::::::::::::::::::::::::::::::::::

idO prEmagOpuram..idE neeku aalayam
chilipi..navvulatOnE..EEE  
valapu deepaalennO..peTTaalanTa 
tODu neeDaa..nEnai..ii
idO prEmagOpuram..idE neeku aalayam

::::1

puvvutEnai nuvvu nEnai..muddaalaaDaalanTaa
gaalivaanai neelO nEnai..neeLLaaDaalanTaa

chedarani kunkuma boTTu..chelimiki vEkuva poddu
mamatalE..manugaDai..kalipina valapula..kaugililO
nee neeDalO..O..aaSalaa..aa..mEDalE..E..nilupanaa
idO prEmagOpuram..idE neeku aalayam

::::2

mEghaalallE taakangaanE..merupavvaalanTaa
aakaaSamlO nakshatraalE..nagalavvaalanTaa

taragani kaaTuka kannu..paapaga chEsenu nannu
sirulanE aDagani..marululO perigina prEmalalO
nee poojakE poovunai..pooyanaa..raalanaa

idO prEmagOpuram..idE neeku aalayam
chilipi..navvulatOnE..EEE 
valapu deepaalennO peTTaalanTa..tODu neeDaa nEnai

idO prEmagOpuram..idE neeku aalayam
lalaalaalalaalalaa..lalaalaalalaalalaa
lalaalaalalaalalaa..lalaalaalalaalalaa

Friday, April 07, 2017

బావామరదళ్ళు--1984
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,Pసుశీల 
Film Directed By::A.Kodandaraami Reddi
తారాగణం::శోభన్‌బాబు,రాధిక,సుహాసిని.

పల్లవి::

అ.హహహా...అహహహా..ఆ ఆ ఆ 
వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు 

ఎండపూల జల్లులు..ఎవరి కోసము?..మ్మ్
ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము..మ్మ్
బంధమైన అందమైన..బ్రతుకు కోసము..మ్మ్ 

వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు 

ఎండపూల జల్లులు..ఎవరి కోసము?..మ్మ్
ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము..మ్మ్
బంధమైన అందమైన..బ్రతుకు కోసము..మ్మ్  

చరణం::1

ఘడియలైన కాలమంతా..ఘడియైనా వీడలేని
ఘాఢమైన మమతలు..పండే కౌగిలి కోసం 

మధువులైన మాటలన్నీ..పెదవులైన ప్రేమలోనే
తీపి తీపి ముద్దులు కొసరే..వలపుల కోసం

నవ్వే నక్షత్రాలు..రవ్వల చాందినీలు
పండినవే కలలు..అవి పరచిన పానుపులు

నీవు లేక నాకు రాని..నిదర కోసము
నిన్ను తప్ప చూడలేని..కలల కోసము

వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
అ..ఆ ఆ ఆ ఆ ఆ..ఏహే..ఆ..ఆ..ఆ..ఆ  

చరణం::2

తనువులైన బంధమంతా..క్షణమైనా వీడలేని
అందమైన ఆశలు పూసే..ఆవని కోసం

పల్లవించు పాటలన్నీ..వెలుగులైన నీడలలోనే
తోడు నేను ఉన్నానన్నా..మమతల కోసం

వెన్నెల కార్తీకాలు..వెచ్చని ఏకాంతాలు
పిలిచే కోయిలలు..అవి కొసరే కోరికలు

నిన్ను తప్ప కోరుకోని..మనసు కోసము 
నీవు నేను వేరు కాని..మనువు కోసము

వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు..వేయి తీపి రాత్రులు

ఎండపూల జల్లులు..ఎవరి కోసము
ఒకరి కోసం ఒకరున్న..జంట కోసము
బంధమైన అందమైన..బ్రతుకు కోసము 

Baavaa Maradallu--1984
Music::Chakravarti
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::A.Kodandaraami Reddi
Cast::Sobhanbabu,suhaasini,raadhika,

:::::::::::::::::::::::::::::::::::::::::::::

a.hahahaa...ahahahaa..aa aa aa 
venDi chandamaamalu..vEyi teepi raatrulu
veMDi chandamaamalu..vEyi teepi raatrulu 

enDapoola jallulu..evari kOsamu?..mm
okari kOsam okarunna..janTa kOsamu..mm
bandhamaina andamaina..bratuku kOsamu..mm 

venDi chandamaamalu..vEyi teepi raatrulu
venDi chandamaamalu..vEyi teepi raatrulu 

enDapoola jallulu..evari kOsamu?..mm
okari kOsam okarunna..janTa kOsamu..mm
bandhamaina andamaina..bratuku kOsamu..mm  

::::1

ghaDiyalaina kaalamantaa..ghaDiyainaa veeDalEni
ghaaDhamaina mamatalu..panDE kaugili kOsam 

madhuvulaina maaTalannii..pedavulaina prEmalOnE
teepi teepi muddulu kosarE..valapula kOsam

navvE nakshatraalu..ravvala chaandineelu
panDinavE kalalu..avi parachina paanupulu

neevu lEka naaku raani..nidara kOsamu
ninnu tappa chooDalEni..kalala kOsamu

venDi chandamaamalu..vEyi teepi raatrulu
a..aa aa aa aa aa..EhE..aa..aa..aa..aa  

::::2

tanuvulaina bandhamantaa..kshaNamainaa veeDalEni
andamaina aaSalu poosE..aavani kOsam

pallavinchu paaTalannii..velugulaina neeDalalOnE
tODu nEnu unnaanannaa..mamatala kOsam

vennela kaarteekaalu..vechchani Ekaantaalu
pilichE kOyilalu..avi kosarE kOrikalu

ninnu tappa kOrukOni..manasu kOsamu 
neevu nEnu vEru kaani..manuvu kOsamu

venDi chandamaamalu..vEyi teepi raatrulu
venDi chandamaamalu..vEyi teepi raatrulu

enDapoola jallulu..evari kOsamu
okari kOsam okarunna..janTa kOsamu
bandhamaina andamaina..bratuku kOsamu