Thursday, May 03, 2012

రాగమాలిక--1982

సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ

చరణం::1

నీవే నాకు రాగం సాగనీవే హృదయ తాళం
గీతం నీకు హారం దేవి పాదం నాకు తీరం
దేవీ పూజ వేళ రాగమేలే పూల హారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ ఛైత్రమాసం
రేగే అగ్నిగుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం

చరణం::2

నాదే సూర్య నేత్రం ఇంక నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం తీరకుంది తీపి మోహం
వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడి పాడే నాట్య వేదం
నీకే అంకితం..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
దం ద నందం దం ద నందం
దం ద నందం దం ద నం దం దం ద
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం

పాపం పసి వాడు--1972

సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన:: ఆత్రేయ
గానం::P.సుశీల
దర్శకత్వం::V.రామచంద్రరావు
నిర్మాణం::అట్లూరి శేషగిరిరావు

నటీనటులు::
S.V.రంగారావు,దేవిక,
నగేష్,చిత్తూరు నాగయ్య,
త్యాగరాజు,కైకాల సత్యనారాయణ,
రాజబాబు,సూర్యకాంతం,
ఛాయాదేవి,నాగశ్రీ,M.ప్రభాకరరెడ్డి

అమ్మా చూడాలి నిన్నూ నాన్నాను చూడాలి నాన్నకు ముద్దూ
ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా...అమ్మా...అమ్మా

అమ్మా చూడాలి నిన్నూ నాన్నాను చూడాలి నాన్నకు ముద్దూ
ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా...అమ్మా...అమ్మా

ఇల్లు చేరే దారే లేదమ్మా..నిన్ను చూసే ఆశలేదమ్మా
ఇల్లు చేరే దారే లేదమ్మా..నిన్ను చూసే ఆశలేదమ్మా
నడవాలంటే ఓపికలేదు ఆకలివేస్తోంది....

అమ్మా...అమ్మా...అమ్మా..ఆ..

పలికేందుకు మనిషేలేడు నిలచేందుకు నీడే లేదు
పలికేందుకు మనిషేలేడు నిలచేందుకు నీడే లేదు
బాధగ ఉంది భయమేస్తుంది ప్రాణం లాగేస్తుంది

అమ్మా...అమ్మా...అమ్మా..ఆ..ఆ..ఆ..

అమ్మా చూడాలి నిన్నూ నాన్నాను చూడాలి నాన్నకు ముద్దూ
ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా...అమ్మా...అమ్మా