Saturday, April 02, 2011

జీవనరాగం--1986




సంగీతం::సత్యం
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,జయసుధ,శరత్‌బాబు,సుమలత  

పల్లవి::

ఒక కొమ్మకు పూచిన..పువ్వులం 
అనురాగం..మనదేలే
ఒక గూటిని..వెలిగిన దివ్వెలం 
మమకారం..మనదేలే
చెల్లెమ్మా..ఆ..నీవేను నా ప్రాణము
అన్నయ్యా..ఆ..నీతోటిదేలోకము 

ఒక కొమ్మకు పూచిన..పువ్వులం 
అనురాగం..మనదేలే
ఒక గూటిని వెలిగిన..దివ్వెలం 
మమకారం..మనదేలే
అన్నయ్యా..ఆ..నీవేను నా ప్రాణము
ఓ అన్నయ్యా..ఆ..నీతోటిదేలోకము 

చరణం::1

మా చెల్లి నవ్వు..సిరిమల్లె పువ్వు
పలికించె నాలో..రాగాల వీణ
మా అన్న చూపు..మేఘాల మెరుపు
కురిపించె నాలో..పన్నీటి వాన
ఇది కరగని చెరగని..కలగా 
ఎద నిలిచెనులే..కలకాలం
చిరునవ్వుల వెన్నెల..సిరిగా 
చిగురించునులే..చిరకాలం
ఈ బంధం ..మ్మ్ మ్మ్..సాగేను..ఏనాటికీ
ఆ దైవం ..మ్మ్ మ్మ్..దీవించెను..ముమ్మాటికీ 

చరణం::2

మా ఇంటి పంట..చిన్నారి చెల్లి
మా కంటి పాప..బంగారు తల్లి
ఈచోటవున్నా..ఏచోటవున్నా 
ఎదలోన నిన్నే..కొలిచేను అన్నా
మమకారం..మనకే సొంతం 
విడరానిది..ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే..చెల్లి 
కావాలి..మళ్లి..మళ్లి
ఈ బంధం ..మ్మ్ మ్మ్..సాగేను..ఏనాటికీ
ఆ దైవం..మ్మ్ మ్మ్.. దీవించెను..ముమ్మాటికీ

ఒక కొమ్మకు..పూచిన పువ్వులం 
అనురాగం..మనదేలే
ఒక గూటిని వెలిగిన..దివ్వెలం 
మమకారం..మనదేలే
చెల్లెమ్మా..ఆ..నీవేను నా ప్రాణము
అన్నయ్యా..ఆ..నీతోటిదేలోకము 

Jeevana Raagam--1986
Music::Chellapalli Satyam
Lyrics::Veturisundararaammoorti
Singer::S.P.Baalu
Film Directed By::BV Prasad
Cast::SobhanBabu,SarathBabu,Maada,MikkilinEni,Padmanaabham,Jayasudha,Sumalatha,Jayamaalini.

::::::::::::::::::::::::::


oka kommaku poochina..puvvulam 
anuraagam..manadElE
oka gooTini..veligina divvelam 
mamakaaram..manadElE
chellemmaa..aa..neevEnu naa praaNamu
annayyaa..aa..neetOTidElOkamu 

oka kommaku poochina..puvvulam 
anuraagam..manadElE
oka gooTini veligina..divvelam 
mamakaaram..manadElE
annayyaa..aa..neevEnu naa praaNamu
O annayyaa..aa..neetOTidElOkamu 

::::1

maa chelli navvu..sirimalle puvvu
palikinche naalO..raagaala veeNa
maa anna choopu..mEghaala merupu
kuripinche naalO..panniiTi vaana
idi karagani cheragani..kalagaa 
eda nilichenulE..kalakaalam
chirunavvula vennela..sirigaa 
chigurinchunulE..chirakaalam
ii bandham saagEnu..mm^ mm^..EnaaTikii
aa daivam deevinchenu..mm^ mm^..mummaaTikii 

::::2

maa inTi panTa..chinnaari chelli
maa kanTi paapa..bangaaru talli
ii..chOTavunnaa..E chOTavunnaa 
edalOna ninnE..kolichEnu annaa
mamakaaram..manakE sontam 
viDaraanidi..ii anubandham
ii annaku nEnE..chelli 
kaavaali..maLli..maLli
ii bandham saagEnu..EnaaTikii
aa daivam deevinchenu..mummaaTikii

oka kommaku..poochina puvvulam 
anuraagam..manadElE
oka gooTini veligina..divvelam 
mamakaaram..manadElE
chellemmaa..aa..neevEnu naa praaNamu

annayyaa..aa..neetOTidElOkamu 

జీవితం--1973





సంగీతం::రమేష్ నాయుడు
రచన::సినారె
గానం:: L.R. ఈశ్వరి
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,కృష్ణంరాజు,నాగయ్య,రమణారెడ్డి,జ్యోతిలక్ష్మి

పల్లవి::

మావిడి తోపుల్లోనా..మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ..చీకటేల పట్టేసి

మావిడి తోపుల్లోనా..మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ..చీకటేల పట్టేసి

చెప్పలేని రుచులెన్నో..చిటికెలోన చూపించి
చెప్పలేని రుచులెన్నో..చిటికెలోన చూపించి
చూపించి..
మాయ చేసి పోతివిరో నాగులూ..ఊఊఊ..
నా మాట మరచిపోతివిరో..నాగులు

ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో 

చరణం::1

నిన్నే కావాలని..ఎన్నుకొంటిని
నీ చుట్టూ నా మనసే..అల్లుకొంటిని
రేకెత్తే నా సొగసే..నీకు ముడుపు కడితిని
ఇన్నీ చేసినదాన్నీ..ఏమెరుగని చినదాన్నీ
ఇన్నీ చేసినదాన్నీ..ఏమెరుగని చినదాన్నీ
హుమ్..హుమ్.. 
మాయ చేసి పొతివిరో..నాగులూ..ఊఊఊ  
నా మాట మరచిపోతివిరో..నాగులు

ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో

చరణం::2

నట్టింట ఒంటరిగా..కాచుకొంటిని
నడిరాతిరి ఉసురుసురు అంటూ..వేచి ఉంటిని
ఆకు చప్పుడైనా..నీ అడుగుల్లే అనుకొంటిని
నిన్నే నమ్మినదాన్నీ..నీకే నచ్చినదాన్నీ
నిన్నే నమ్మినదాన్నీ..నీకే నచ్చిన దాన్నీ
కాదు మరి..
మాయచేసి పోతివిరో..నాగులూ..ఊఊఊఊ 
నా మాట మరచిపోతివిరో..నాగులు

ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో

చరణం::3

తొలినాటి తొందరలు..ఏమాయెరా
ఆ బులిపాలు మురిపాలు..కరువాయెరా
నిద్దర పోతూ ఉన్నా..ఆ ముద్దులే గురుతాయెరా
చిగురాకు లాంటిదాన్నీ..వగలేది లేనిదాన్నీ
చిగురాకు లాంటిదాన్నీ..వగలేది లేని దాన్నీ
హుమ్..పాపం.. 
మాయ చేసి పోతివిరో..నాగులూ..ఊఊఊ  
నా మాట మరచిపోతివిరో..నాగులు

ఓలమ్మో..ఓలమ్మో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో
ఓలమ్మో..ఓర్నాయనో..ఓలమ్మో..ఓర్నాయనో