Saturday, September 29, 2007

చింతామణి--1956
మూలం::చింతామణి నాటకము
రచన::కాళ్ళకూరి నారాయణ రావు
గానం::ఘంటసాల వెంకటేశ్వర రావు
సంగీతం::అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు
సంగీత పర్యవేక్షణ::పి.భానుమతి

కష్ట భరితంబు బహుళ దుఃఖప్రదంబు
సారరహితంబునైన సంసారమందు
భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసె
పురుషులనిమిత్తము పురాణ పూరుషుండు!!

అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
చూడు..
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరక యేడ్పించువారు
పడపుగత్తెల ఇండ్ల బానిసెంచై ధర్మపత్ని యన్నను మండిపడెడివారు
బయట నెల్లరచేత పడివచ్చి యింటను పొలతినూరక తిట్టి పోయువారు
పెట్టుపోతల పట్లగలట్టి లోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు
ఖలులు, కఠినులు, హీనులు, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము

మంచి మనసులు--1962సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం ::ఘంటసాల


అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు...
కను చూపు కరువైన వారికైనా
కను చూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా
శిలలపై శిల్పాలు చెక్కినారు...

ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు
ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప శృంగారమొలుకు నాట్యాలు
నవరసాలొలిగించు నగరానికొచ్హాము
కనులు లేవని నీవు కలత పడవలదు
కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు...

ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన
ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి
సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారని
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు...

రాజులే పోయినా రాజ్యాలు కూలినా
కాలాలు పోయినా గాల్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ......
చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు నా హౄదయాన
నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలి నిజమునా జాబిలి

మంచి మనసులు--1962సాహిత్యం::ఆరుద్ర
గాత్రం::P.సుశీల
సంగీతం::KV.మహదేవన్
దర్శకత్వం::ఆదుర్తి సుబ్బారావు

తారాగణం::నాగేశ్వరరావు,సావిత్రి,షావుకారు జానకి,ఎస్వి.రంగారావు,సూర్యకాంతం.


ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్... హొయ్

పసివాని చూచుటకీ తొందర
మైమరిచి ముద్దాడి లాలింతుర
లులులుల ఆయి లులులుల ఆయి
ఉహు ఉహు ఉహు ఉహు
పసివాని చూచుటకీ తొందర
మైమరిచి ముద్దాడి లాలింతుర
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకు ఏముంది మీదగ్గర


ఏవండోయ్...

ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ !!

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
ఒహొహొ ఓ
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా...

!! ఏవండోయ్....


ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ !!

ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
అయ్యో పాపం
ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కపటాలు మానేసి నా మదిలోన
కాపురము చేయండి కలకాలము

!! ఏవండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ
ఏవండోయ్ హొయ్ హొయ్ హొయ్ !!

మంచి మనసులు--1962::హిందోళ::రాగంసంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల , P.సుశీల

హిందోళ::రాగం


:::

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే

తావిలేని పూవు విలువు లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే
తావిలేని పూవు విలువు లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే


నా మనసే చిక్కుకొని నీ చూపులవలలో
నా వయసు నా సొగసు నిండెను నీమదిలో
నా మనసే చిక్కుకొని నీ చూపులవలలో
నా వయసు నా సొగసు నిండెను నీమదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె
తావిలేని పూవు విలువు లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనే లేవులే లేవులే


సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ
రంగులీను నీమెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినం రానున్నదిలే ఓ ఓ ఓ
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే


తొలినాటి రేయి తడబాటు పడుతూ మెలెమెల్లగా నీవు రాగ
నీ మేని హొయలు నీలొని వగలు నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలిసి ఉయ్యాలలూగి ఆకాశమే అందుకొనగా
పైపైకి సాగే మేఘాలదాటి కనరాని లోకాలు కనగా
అహ ఒహొ ఉహు..ఆ..ఆ..ఆ..ఆ..అ..అ...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే
నీవులేని నేను లేనే లేనులే
నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే
నీవులేని నేను లేనే లేనులే

చరణదాసి--1956


చరణదాసి--1956
సంగీతం::సాలూరు రాజేశ్వరరావు
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,లీల
హిందోళ :: రాగం

ఆ..ఆ..
ఆ..ఆ..

గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే, వికాసాలివే

ఇదే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి
గులాబీల తావులీనే కులాసాల జీవితాల
విలాసాలివే, వికాసాలివే

ఇదే ప్రేమ జీవితాల వరాలౌను ప్రేయసి
మానస సీమల, మాయని ప్రేమల
మాధురులెపుడూ మారవుగా
మారవులే...మారవులే

ప్రమాణముగా
మారవులే
ప్రమాణముగా
జీవన తారవు, దేవివి నీవే
జీవన తారవు, దేవివి నీవే

గులాబీల తావులీనే కులాసాల జీవితాల
మనజాలినా.. అదే చాలులే..
ఇదే ప్రేమ జీవితాల వరించే వరాలుగా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..

మంచి మనసులు--1962
రచన::కోసరాజు
సంగీతం::మహాదేవన్.K V
గానం::ఘంటసాల,జమునా రాణి


మామ మామ మామ మామ మామ మామ
ఏమె ఏమె భామ... ఏమె ఏమె భామ
పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదుంటె
చుట్టు చుట్టు తిరుగుతారు మరియాద
పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదుంటె
చుట్టు చుట్టు తిరుగుతారు మరియాద
తాళి కాట్టకుండ ముట్టుకుంటె తప్పుకాదా
మామ మామ మామ మామ మామ మామ 2!!

వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి
ప్రేమలోకి దింపువాళ్ళు మీరు కాదా..ఒహొ
వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి
ప్రేమలోకి దింపువాళ్ళు మీరు కాదా
చెయ్యి వెయ్యబోతె బెదురుతారు వింత గాదా
ఏమె ఏమె భామ... ఏమె ఏమె భామ !!

1)నీవాళ్ళు నావాళ్ళు రాకనే మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే....
నీవాళ్ళు నావాళ్ళు రాకనే మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే
సిగ్గు దాచి ఒహొ..
సిగ్గు దాచి ఒకరొకరు సిగను పూలు కట్టుకోని
టింగు రంగ అంటు ఊరు తిరగొచ్చును
లోకం తెలుసుకోక మొగవాళ్ళు మెలగొచ్చునా
మామ మామ మామ మామ మామ మామ 2 !!

హోయ్..హోయ్...హోయ్..హోయ్....

2) కళ్ళు కళ్ళు కలుసుకొను రాక ముందే
అహ కప్పుకున్న సిగ్గు జారి పోకముందే
కళ్ళు కళ్ళు కలుసుకొను రాక ముందే
అహ కప్పుకున్న సిగ్గు జారి పోకముందే
మాయజేసి ఒహో..మరులుగొల్పి ఒహొ.. మాయజేసి మరులుగొల్పి
మాటలోని మాటగల్పి మధురమైన మా మనసు దోచవచ్చ్హునా
నీవు మర్మమడిగి ఈ మాట అడగవచ్చునా..
ఏమె ఏమె భామ... ఏమె ఏమె భామ 2 !!

3)పడుచు పిల్ల కంట పడితె వెంట పడుదురు
అబ్బొ వలపంత వొలకబోసి ఆశ పెడుదురు..
పడుచు పిల్ల కంట పడితె వెంట పడుదురు
అబ్బొ వలపంత వొలకబోసి ఆశ పెడుదురు..
పువ్వు మీద ఒహో..
పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనెటీగవంటి
మొగవాళ్ళ జిత్తులన్ని తెలుసులేవయ్య...
మా బుద్ది ముందు కధలన్ని విన్నవయ్యా
మామ మామ మామ మామ మామ మామ 2

హోయ్..హోయ్........హోయ్..హోయ్....

4) కొత్త కొత్త మోజుల్నీ కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారు
కొత్త కొత్త మోజుల్నీ కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారు
టక్కరోళ్ళుంటారు టక్కులు జేస్తుంటారు
నీవు జెపు మాట కూడ నిజమేనులే హోయ్..
దేహం దూరంగా ఉన్నపుడే జోరౌనులే
ఔనె ఔనే భామా....ఔనె ఔనే భామా...
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి
ఆత్రపడక కొంతకాలం ఆగుదామయా...
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి
ఆత్రపడక కొంతకాలం ఆగుదామయా
ఫెళ్ళున పెళ్ళైతే ఇద్దరికి అడ్డు లేదయ్యా..

మామ మామ మామ మామ మామ మామ 2 !!

చింతామణి--1956
సంగీతం::కీ.శే.అద్దేపల్లి రామారావు
రచన::రావూరు వేంకటసత్యనారాయణరావు
గానం::P.భానుమతి


రావోయి..రావోయి..
రావోయి రావోయి ఓ మాధవా..
రావోయి రావోయి ఓ మాధవా..
అందాల రాధా అలిగింది బేగి రావోయి..

రావోయి రావోయి ఓ మాధవా..
అందాల రాణి అలిగింది బేగి రావోయి
రావోయి రావోయి ఓ మాధవా..

పొదరింటి నీడలలో పొంచింది రాధ
పొదరింటి నీడలలో పొంచింది రాధా
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
ఇంక జాగేల మురళీ.. మోహన
బేగి రావోయి రావోయి ఓ మాధవా ...
అందాల రాధా అలిగింది బేగి రావోయి
రావోయి రావోయి ఓ మాధవా ..

ఊదుమురా యమునా విహారి..నీ మురళీ
ఊదుమురా యమునా విహారి..నీ మురళీ
ఆ..ఆ..ఆ..ఆ..
ఒద్దుమురా యమునా విహారి..నీ మురళీ
ఊగునురా నీ రాధ ఆనంద డోళా
ఊగునురా నీ రాధ ఆనంద డోళా..
ఇంక జాగేల మురళీ..మోహన
బేగి రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగింది బేగి రావోయి
రావోయి రావోయి ఓ మాధవా..

తన ప్రేమ వేణువులో దాచింది రాధా
తన ప్రేమ వేణువులో దాచింది రాధా
అనురాగ రాగ సుధ అందించవేళా
అనురాగ రాగ సుధ అందించవేళా..
ఇంక జాగేల మురళీ..మోహన
బేగి రావోయి రావోయి ఓ మాధవా
రావోయి రావోయి ఓ మాధవా..
అందాల రాధా అలిగింది బేగి రావోయి
రావోయి రావోయి ఓ మాధవా..ఆ..ఆ..