Thursday, December 13, 2007
సింహాసనం --- 1986
సంగీతం::బప్పిలహరి
గానం::రాజ్ సీతారాం,P.సుశీల
దర్శకత్వ::కౄష్ణ
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం
హే...హేహే..ఆ..ఆ...ఆహహా...
లాలల లలలా ఆ...అ...
ఆకాశంలో ఒక తారా నాకోసమొచ్చింది ఈవేళా
ఆకాశంలో ఒక తారా నాకోసమొచ్చింది ఈవేళా
ఇలలో ఒక చందమామా ఒడిలో పొంగింది ప్రేమా
ఇలలో ఒక చందమామా ఒడిలో పొంగింది ప్రేమా
తారాజాబిలి కలవనినాడు ఏవెన్నెలా లేదులే...
జుం జుం జుం జుంతనజుం జుం జుం జుం జుంతనజుం
!!ఆకాశంలో ఒకతారా !!
1
జుంతనజుం జుంతనజుం జుంతనజుం జుంతనజుం
అనురాగం ఆందంగా మెరిసింది నీ కళ్ళలోనా
అందుకో నా లేతవలపే నీముద్దు ముంగిళ్ళలోనా
కదిలే నీప్రాణశిల్పం మదిలో కర్పూర దీపం
కదిలే నీప్రాణశిల్పం మదిలో కర్పూర దీపం
హోయ్...నింగి నేల కలిసినచూట ఏవెలుతురూ రాదులే
!!జుం జుం జుం జుంతనజుం జుం జుం జుం జుంతనజుం
ఆకాషంలో ఒకతారా !!
2
ఓ ఒహో హూ లాలలాలలా
ఆహాహహా ఓ..హూహూ
ఎన్నాళ్ళో ఈ విరహంవెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోనా
అలలై నా సోయగాలుపాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలుపాడాలి యుగయుగాలు
వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే
!!జుం జుం జుం జుంతనజుంజుం జుం జుం జుంతనజుం
ఆకాశంలో ఒకతార !!
3
జుం తనజుం జుం తనజుం జుం తనజుం జుం తనజుం
కాలంతో ఈ బంధం ఈడల్లే పెంచిందినన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోనా
జుం జుం జుం జుంతనజుంజుం జుం జుం జుంతనజుం
కాలంతో ఈ బంధం ఈడల్లే పెంచిందినన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోనా
నీకే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి
నీకే నా రాచపదవి నీవే నా ప్రణయరాణివి
నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే
జుం జుం జుం జుంతనజుం జుం తనజుం జుం తనజుం
ఆకాశంలో ఒక తారా నాకోసమ్మెచ్చింది ఈవేళా
తారాజాబిలి కలవనినాడు ఏవెన్నెలా లేదులే...
జుం జుం జుం జుంతనజుం జుం జుం జుం జుంతనజుం
లాలలాలాలాలలా లాలాలా లలలలా
వయసు పిలిచింది--1978
సంగీతం::ఇళయ రాజ
రచన::ఆరుద్ర
గానం::S.P..బాలు,P..సుశీల
Film Directed By::Sreedhar
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల
పల్లవి::
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
చరణం::1
వయసులో వేడుంది
మనసులో మమతుంది
వయసులో వేడుంది
మనసులో మమతుంది
మమతలేమో సుధామయం
మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో ....
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
చరణం::2
కంటిలో కదిలేవు
జంటగా కలిసావు
కంటిలో కదిలేవు
జంటగా కలిసావు
నీవు నేను సగం సగం
కలిసిపోతే సుఖం సుఖం
తనువూ మనసూ తనివి రేపునే..
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
లలలలలలలాలా లలలలలలలాలా
లలలలలలలాలా..లలలలలలలాలా
చరణం::3
భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
యదలోనా ఒకే స్వరం
కలలేమో నిజం నిజం
పగలు రేయి ఏదో హాయి ....
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
వయసు పిలిచింది--1978
సంగీతం:ఇళయరాజ
రచన:ఆరుద్ర
గానం::వాణిజయరాం
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల
రాగం::
నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా
నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య
నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య
చరణం::1
నీ కొసమే మరు మల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు
దాచినదంతా నీ కొరకే
దాచినదంతా నీ కొరకే
నీ కొరిక తీర్చె మది స్పందన చేసే
నా ఒళ్ళంతా ఊపెస్తూ ఉంటే
నాలొ ఎదొ అవుతోంది
నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య
చరణం::2
నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం
పరుగులు తీసే నా పరువం
నీ కధలే వింది నువు కావాలందీ
నా మాటేమి వినకుండ వుంది
నీకు నాకే జొడంది
నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య
వయసు పిలిచింది ~1978
Listen Here!
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి సుందరరమమూర్తి
గానం:S.P..బాలు
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల
రాగం:
హే ముత్యమల్లే మెరిసిపొయే మల్లెమొగ్గా
ఆరె ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
ఊరు నిదరొయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
చరణం::1
కురిసే సన్నని వానా సలి సలిగా వున్నది లోన
కురిసే సన్నని వానా సలి సలిగా వున్నది లోన
గుబులౌతుందే గుండెల్లొనా
జరగనా కొంచం నే నడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందాము మనమూ
హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ వుండిపోవే
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిచిందిలే
చరణం::2
పండే పచ్చని నేల అది బీడై పొతే మేలా
పండే పచ్చని నేల అది బీడై పొతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మల్లా
ఉరికె పరువమిది మనదీ
హే కాపుకొస్తే కాయలన్నీ జారిపొవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపొవా
మబ్బే మసకెసిందిలే పొగ మంచె తెరగా నిలిసిందిలే
ఊరు నిదరొయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మంచి చోటే మనకు కుదిరిందిలే
Subscribe to:
Posts (Atom)