Tuesday, June 15, 2010

తులాభారం--1974


సంగీతం::సత్యం 
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి

పల్లవి::

ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా
ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా
నువ్వేడుంటే అది నా వూరే..నువ్వేదంటే అది నా పేరే
ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా 
ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా 

చరణం::1

అన్నెం పున్నెం తెలియదు..నీ కని అనుకున్నా నొకనాడు
అన్నీ తెలిసిన గడసరి నువ్వని..తెలిసెను నాకీనాడు
నాటకం ఆడేవులే..నా మనసంతా దోచేవులే
ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా
ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా  

చరణం::2

చిలిపిగ నవ్వే కాటుక కళ్ళూ..చిలికెను వలపుల జల్లు
కులుకూ పలుకూ పొగరూ వగరూ..ముంగాళ్ళకు బంధాలూ
ఉండనీ నీ గుండేలో..ఏడడుగులు నీతో నడవనీ
ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా
ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా  

చరణం::3

పారే ఏరూ వీచే గాలి..ఏమంటుందో చూడు
నింగీ నేలా నిలిచేదాకా..నువ్వే నాకు తోడు
చేతిలో చెయి వెయ్యానీ..ప్రతి పగలూ వెన్నెల చూడనీ  
ఏ వూరూ ఏ పేరూ..ఏందేహె నీ కత చిన్నోడా
నువ్వేడుంటే అది నా వూరే..నువ్వేదంటే అది నా పేరే
ఏ వూరో ఏ పేరో..ఎందుకు నీకెహె చినదానా 
ఏందేహె నీ కత చిన్నోడా..ఎందుకు నీకెహె చినదానా  
ఏందేహె నీ కత చిన్నోడా..ఎందుకు నీకెహె చినదానా