సంగీతం::M.S.శ్రీరాం రచన::రాజశ్రీ గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి పల్లవి:: అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రాకున్నది నా నోట తీయరాదా..సిగ్గు పరదా..ఎవరు లేరు కదా..ఆ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రాకున్నది నా నోట ఇంతలోనే..అంతప్రేమ..కలిగె నెందుకనీ..ఈ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట చరణం::1 పసిదానిగ నటీయించి..మది దోచావెందులకు? నేనెవరో తెలియకనే..నను పిలిచావెందులకు? ఇది ఏమి గడుసుతనం..ఇది ఏమి చిలిపితనం కాదు..పడుచుతనం..ఊ..ఊ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట చరణం::2 మన పరిచయమొక కథగా..జరిగింది మొదటిరోజు ఆ పరిచయ ఫలితముగా..పెరిగింది ప్రేమ మోజు ఏనాటి అనుబంధమో..గతజన్మలో బంధమో ఎందుకీ స్నేహమో.. అడుగుదామని ఉంది నిన్నొక మాట పెదవి దాటి రాకున్నది నా నోట ఇంతలోనే..అంతప్రేమ..కలిగె నెందుకనీ..ఈ.. అడుగుదామని ఉంది నిన్నొక మాట
సంగీతం::M.S.శ్రీరాం రచన::రాజశ్రీ గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి పల్లవి:: జీవితాన మరువలేను..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ జీవితాన మరువలేము..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ చరణం::1 నిన్న చూడ నీవు నేను..ఎవరికెవరమో నేడు చూడ నీవు నేను..ఒకరికొకరిమే నిన్న చూడ నీవు నేను..ఎవరికెవరమో నేడు చూడ నీవు నేను..ఒకరికొకరిమే రేపు చూడు పెళ్ళినాడు..మనము ఏకమై ఓ ఓ ఓ ఓ ఓ కలసిపోదమే... జీవితాన మరువలేము..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ చరణం::2 నింగినుండి చెందమామ..తోంగి చూచేనే మధురమైన కలతలేవో..మనసుతెలిపెనే ఊహలన్నీ ఉరకలేసి..చిందులాడెనే ఓ..హో..మనసుపోంగెనే.. చరణం::3 తలపులందు తెలియరాని..వేడి వున్నదీ నేడుచూచి కన్నె మనసు..కరుగుతున్నదీ తలపులందు తెలియరాని..వేడి వున్నదీ నేడుచూచి కన్నె మనసు..కరుగుతున్నదీ కన్నె మనసు కరుగువేళ..బిడియమెందుకూ హో..ఓ..రాకు ముందుకూ.. జీవితాన మరువలేము..ఒకే రోజు ఇరుజీవితాలు ఒకటిగ..ముడివేసే రోజు అదే పెళ్ళిరోజు..పెళ్ళిరోజూ
సంగీతం::M.S.శ్రీరాం రచన::రాజశ్రీ గానం::P.B.శ్రీనివాస్ తారాగణం::హరనాధ్,జమున,రేలంగి,గీతాంజలి,పద్మనాభం,హేమలత,పండరీబాయి పల్లవి:: ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా? ఆనాటి చెలిమి ఒక కల.. చరణం::1 మనసనేదే లేని నాడు..మనిషికేదీ వెల మనసనేదే లేని నాడు..మనిషికేదీ వెల మమతనేదే లేని నాడు..మనసు కాదది శిల ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ చరణం::2 చందమామే రాని నాడు..లేదులే వెన్నెల చందమామే రాని నాడు..లేదులే వెన్నెల ప్రేమనేదే లేని నాడు..బ్రతుకులే వెల వెల ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ చరణం::3 ఒక్కసారి వెనుక తిరిగి..చూసుకో జీవితం ఒక్కసారి వెనుక తిరిగి..చూసుకో జీవితం పరిచయాలు అనుభవాలు..గురుతు చేయును గతం ఆనాటి చెలిమి ఒక కల..కల కాదు నిజము ఈ కధ మనసులోని మమతలన్ని..మరచిపోవుట ఎలా?మరచిపోవుట ఎలా?
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::P.సుశీల తారాగణం::మోహన్‌బాబు,జయసుధ,గుమ్మడి,ప్రభాకరరెడ్డి,గిరిబాబు పల్లవి:: శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా నోచిన వారికి నోచిన..వరము చూసిన వారికి చూసిన..ఫలము శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా చరణం::1 స్వామిని పూజించే..చేతులె చేతులటా ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ స్వామిని పూజించే..చేతులె చేతులటా ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా తన కథ వింటే ఎవ్వరికైనా..జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా చరణం::2 ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ...ఆ..ఆ..ఆ..ఆ ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం..ప్రతి ఇంటికి దైవం..ఉ శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా చరణం::3 అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల..కడదామా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల..కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు..ఇమ్మని కోరేమా..ఆ శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ..మంగళమనరమ్మ కరములు జోడించి..శ్రీ చందనమలరించి మంగళమనరే శ్రీ సుందరముర్తికి..వందనమనరమ్మ