సంగీతం::రమేష్‌నాయుడు
Director::Vijaya Nirmala
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,అల్లు రామలింగయ్య, సూర్యకాంతం,రమాప్రభ
పల్లవి::
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే కోయిల నీదైతే
చరణం::1
పలకరించేదీ నా ప్రాయం
పులకరించేదీ నీ హృదయం
పలకరించేదీ నా ప్రాయం
పులకరించేదీ నీ హృదయం
నా లావణ్యం నీ ప్రణయం
నా లావణ్యం నీ ప్రణయం
కలిసే మంగళ సమయం
గంగా యమునల సంగమం
గంగా యమునల సంగమం
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే..కోయిల నీదైతే
చరణం::2
మెరిసి మెరిసి తొలకరి జల్లై
కురిసి కురిసి వలపుల వానైనదీ
మెరిసి మెరిసి తొలకరి జల్లై
కురిసి కురిసి వలపుల వానైనదీ
మురిసీ మురిసీ నాలోపలి నెమలి
పురివిప్పి నాట్యమాడిందీ నాట్యమాడిందీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
గూడేదైతేనేమీ కొమ్మేదైతేనేమీ
పాడే కోయిల నీదైతే
కోయిల నీదైతే కోయిల నీదైతే