Friday, September 28, 2007

ఇల్లరికం--1959::యదుకుల కాంభోజి::రాగం



ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల


యదుకుల కాంభోజి::రాగం  

(పహడి హిందుస్తానీ రాగం )

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

అడిగిందానికి చెపుతా ఎంతైనా పందెం గడతా
నిల్చెదనోయ్ గెల్చెదనోయ్ ఓహో చిన్నవాడా

ఒంటికాలిపై నుండి హఠ యోగ ముద్రలో నుండి (2)
గుట్టుగ తన పని సాధించునది వివరిస్తావా ఏదది

(అడిగిందానికి చెప్పి...)

ముక్కు మూరెడే యౌను అది కొక్కుకు మని గొణిగేను (2)
కొంగ జపమని ప్రసిద్ధియేను ముందుకు వచ్చి కాదను

(అడిగిందానికి చెపుతా...)

వాయువేగమును మించి లోకాలన్ని గాలించి (2)
గడియలోననే ఉన్న చోటికే వడిగా చేరేదేదది

(అడిగిందానికి చెప్పి...)

రాకెట్టని అనుకోను అది స్పూట్నిక్ అనలేను (2)
ముమ్మాటికి అది మనసేను ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెపుతా..

దానమిచ్చి చెడెనెవ్వడు
కర్ణుడు
కర్ణుడు
తప్పు తప్పు బలి చక్రవర్తి
హే బలి చక్రవర్తి

జూదానికి నిపుణుండెవ్వడు
ధర్మజుడు
ధర్మజుడు
తప్పు తప్పు శకుని
హే శకుని

అన్నదమ్ముల పోరాటంలో సందు జూచుకొని కూల్చిందెవడు
భీముడు
భీముడు
తప్పు తప్పు రాముడు
హే రాముడు శ్రీ రాముడు శ్రీ రాముడు

ఇల్లరికం--1959 రాగం::యదుకుల కాంభోజి



సంగీతం::T.చలపతి 
రచన::కోసరాజు రాఘవయ్య గానం::మాధవపెద్ది సత్యం
తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,

ఆర్.నాగేశ్వరరావు,సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
రాగం::యదుకుల కాంభోజి

చాన్స్ భలే చాన్స్..భలే చన్స్ లే భ లే చన్స్ లే
లలలాం లలలాం లక్కీ చాన్స్ లే
భలే చాన్స్ లే
ఇల్లరికంలో వున్నమాజా...
ఇల్లరికంలో వున్న మజా
అది అనుభవుంచితే తెలియునులే
భలే చాన్స్ లే

అత్తమామలకు ఒక్క కూతురౌ
అదౄస్ట యొగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ
అదౄస్ట యొగం పడితే
బావమరుదులే లేకుంటే
ఇంటల్లుడిదేలే అధికారం
భలే చన్స్ లే

గంజిపోసినా అమౄతంలాగా
కమ్మగవుందనుకొంటే
బహు కమ్మగవుందంకొంటే
ఛి...ఛా...ఛి ఛా యన్నా
చిరాకు పడక దులపరించుకొని
పొయ్యేవాడికి
భలే చాన్స్ లే
ఇల్లరికంలో వున్నమజా
ఇల్లరికంలో వున్నమజా
అది అనుభవించితే తెలియునులే
భలే చాన్స్ లే

జుట్టుపట్టుకొని భైటి కీడ్చినా
చూరుపట్టుకొని వేలాడీ..ఈ...ఈ...
జుట్టుపట్టుకొని భైటి కీడ్చినా
చూరుపట్టుకొని వేలాడీ
దుషణ భూషణ శిరచ్చారములు
ఆశీసులుగా తలచేవాడికి
భలే చాన్స్ లే...అహా..అహా..
భలే చాన్స్ లే
భలే చాన్స్ లే భలే చాన్స్ లే
లలలాం లలలాం లక్కీ చాన్స్ లే
భలే చాన్స్ లే
ఇల్లరికంలో వున్నమజా...
ఇల్లరికంలో వున్నమజా ..
అది అనుభవుంచితే తెలియునులే
భలే చాన్స్ లే....

అణిగీ మణిగీ వున్నామంటే
అంతా మనకే చిక్కేది
అణిగీ మణిగీ వున్నామంటే
అంతా మనకే చిక్కేది
మామ లోభి అయి కూడబెట్టితే
మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది
ఇహ మనకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే అది మనకే
మనకే మనకే మనకే...
మ మ మ మనకే...

ఇల్లరికం--1959: :కల్యాణి::రాగం



Director : Prakasha Rao T
సంగీతం::T.చలపతి రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R..ఆంజనేయులు

:::

నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా ఎందుకో?
తగని బలే చిరాకా.. ఆ......
నేడు శ్రీవారికి మేమంటే పరాకా!!

మొదట మొగవారు వేస్తారు వేషాలు
పెళ్ళి కాగానె చేస్తారు మోసాలు
ఆఅ....
ఆడవారంటే శాంత స్వరూపాలే
కోప తాపాలు రావండీ పాపం

కోరి చేరిన మనసు జేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు జేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు

!! నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే బలే వినోదం ఎందుకో ?
తగువే బలే వినోదం......
నేడు శ్రీమతికి మాతోటి వివాదం !!
వారి మనసైతే వస్తారు ఆడవారు
చేరరమ్మంటే రానే రారు
ఆఅ.......
తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు

అలుక సరదా మీకు అదే వేడుక మాకు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే

ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే బలే వినోదం...ఆఅ....
నిజమే బలేవినోదం...ఆఅ.....
నిజమే బలే వినోదం.....నిజమే బలే వినోదం
!!

ఇల్లరికం--1959



సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::P.సుశీల,ఘటసాల,మాధవపెద్ది.

తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R.ఆంజనేయులు

:::::

చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు
రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు


పాలూ తేనె కలిసిన మాదిరి
ఆలు మగలు ఉండాలి..ఓ..ఒహో..ఓ..ఒహో..
పాలూ తేనె కలిసిన మాదిరి
ఆలు మగలు ఉండాలి
గువ్వల జంట కులికే రీతిగ
నవ్వుల పంటా పండాలీ
నవ్వుల పంటా పండాలీ
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు


కొత్త కుండలో నీరు తియ్యన
కోరిన మగవాడే తియ్యన
కొత్త కుండలో నీరు తియ్యన
కోరిన మగవాడే తియ్యన
కొత్త కాపురం చక్కని వరము
కోరిక తీరు రయ్ రయ్యన
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు


వన్నెల చిన్నెల వలపు తోటలో
పూల బాటలే వెయ్యాలి..ఓ..ఒహో..ఓ..ఒహో..
వన్నెల చిన్నెల వలపు తోటలో
పూల బాటలే వెయ్యాలి
అన్యోన్యంగా దంపతులెపుడు
కన్నుల పండుగ చేయాలీ
కన్నుల పండుగ చేయాలీ
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు
రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు

ఇల్లరికం--1959::కల్యాణి::రాగం(యమున్)



సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘటసాల

రాగం:::కల్యాణి(యమున్)
తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R.ఆంజనేయులు

:::


ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు


చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకే
పొదలలో పూపొదలలో పొంచినా గాలించినా
పొదలలో పూపొదలలో పొంచినా గాలించినా
కనులకు నే కనిపించనులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు


నీడలో దోబూచిగా ఆడకే తారాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
దాగుడుమూతలు చాలునులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు


వెదికినా నే దొరకనే పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
ఎన్నటికీ నిను వీడనులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

ఇల్లరికం--1959



సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘటసాల

తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R.ఆంజనేయులు

:::::

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు....
ఓ...లలనా..అదినీకే తెలుసు
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ


ఎవరని యెంచుకోనినావో
పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో
భ్రాంతి పడినావో
సిగ్గుపడి తోలగేవో
విరహగ్నిలో నన్ను త్రోసి పోయేవో
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..
ఓ...లలనా..అదినీకే తెలుసు


ఒకసారి నన్నుచూడరాదా
చెంతచేర సమయం ఇదికాదా
ఒకసారి నన్నుచూడరాదా
సమయమిదికాదా చాలునీ మరియాదా...
వగలాడినే నీ వాడనేకాద
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..
ఓ...లలనా..అదినీకే తెలుసు


మగడంటే మోజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా
నీకు నేను లేనా కోపమా నా పైనా
నీ నోటిమాటకు నోచుకోలేనా

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..
ఓ లలనా..ఓ చెలియా..ఓ మగువా..
అది నీకే తెలుసు