Sunday, January 05, 2014

జడగంటలు--1984




సంగీతం::పుహళేంది
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
లలలలలలలల..లాలాలా..లాలాలా

పున్నమిలాగా వచ్చిపొమ్మని..జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని..గోదారడిగింది

పున్నమిలాగా వచ్చిపొమ్మని..జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని..గోదారడిగింది

నువ్వు రావాలా..పువ్వు పూయాలా..రావేలా?
జడ గంటమ్మా..రతనాలమ్మా..జానకమ్మా

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

చరణం::1

లలల లలల ఆ..
లలలలల లాలలలా..

పాపికొండలా..పండువెన్నెలా..పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా..ఆ
పాపికొండలా..పండువెన్నెలా..పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే..ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే..ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా..గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా
నే కుంగిపోవాలా..

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ..
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

చరణం::2

లలలల లాలాలా..లలలల లాలాలా

పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే..గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే..గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండు ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా..ఆ..
నే కుంగిపోవాలా..

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా..పువ్వు పూయాలా..రావేలా?
జడ గంటమ్మా..రతనాలమ్మా..జానకమ్మా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

డాక్టర్ బాబు--1973
























సంగీతం::T.చలపతి రావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::శోభన్‌బాబు, జయలలిత,S.V. రంగారావు, గుమ్మడి, విజయలలిత 

పల్లవి::

విరిసే కన్నులలో..వేయిబాసలున్నవిలే 
అవి నా గుండెలలో..అల్లరి చేస్తున్నవిలే
విరిసే కన్నులలో..వేయిబాసలున్నవిలే

చరణం::1

నీ కనుపాపలే..వినీల కాంతి దీపాలు
నీ చిరునవ్వులే..వెన్నెలల పారిజాతాలు
నీ సొగసే నాదైతే..నీ సొగసే నాదైతే 
కలకలలాడులే..వసంతాలు

విరిసే కన్నులలో..వేయిబాసలున్నవిలే 
అవి నా గుండెలలో..అల్లరి చేస్తున్నవిలే
విరిసే కన్నులలో..వేయిబాసలున్నవిలేలే 

చరణం::2

ఎదురుగా నువ్వుంటే..ఉదయ కాంతులెందుకులే
జతగా నువ్వుంటే..జాబిలి ఇంకెందుకులే

నీ వలపే నాదైతే..నీ వలపే నాదైతే 
ఏ బృందావనాలు..ఎందుకులే

విరిసే కన్నులలో..వేయిబాసలున్నవిలే 
అవి నా గుండెలలో..అల్లరి చేస్తున్నవిలే
విరిసే కన్నులలో..వేయిబాసలున్నవిలే 


Doctor Babu--1973
Music::T.ChalapatiRao
Lyrics::sinaare
Singer's::Ghantasaala

:::

virise kannulalo..veyibaasalunnavile 
avi naa gundelalo..allari chestunnavile
virise kannulalo..veyibaasalunnavile

:::1

nee kanupaapale..vineela kaanti deepaalu
nee chirunavvule..vennelala paarijaataalu
nee sogasae naadaite..nee sogase naadaite 
kalakalalaadule..vasantaalu

virise kannulalo..veyibaasalunnavile 
avi naa gundelalo..allari chestunnavile
virise kannulalo..veyibaasalunnavile 

:::2

edurugaa nuvvunte..udaya kaantulendukule
jatagaa nuvvunte..jaabili inkendukule

nee valape naadaite..nee valape naadaite 
e brndaavanaalu..endukule

virise kannulalo..veyibaasalunnavile 
avi naa gundelalo..allari chestunnavile

virise kannulalo..veyibaasalunnavile