సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::జగ్గయ్య,నాగభూషణం,గుమ్మడి,రాజబాబు,జ్యోతిలక్ష్మి,హేమలత,మాష్టర్ దేవానంద్.
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గున్న మామిడీ కొమ్మమీద..గూళ్ళు రెండుడేవి
ఒక గూటిలోన చిలకుండేది..ఒక గూటిలోన కోయిలుండేది
గున్న మామిడీ కొమ్మమీద..గూళ్ళు రెండుడేవి
చరణం::1
తీగలాగ అల్లిన చెలిమి..తెగుతుందని దిగులుపడీ
కొమ్మవిడినా ఆ జంటా..కొత్త గూడు చేరింది
తీగలాగ అల్లిన చెలిమి..తెగుతుందని దిగులుపడీ
కొమ్మవిడినా ఆ జంటా..కొత్త గూడు చేరింది
ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసీ
కోయిలతో చెప్పలేక..గూడు విడిచి పోయింది
జోడు చెదరి పోయింది
గున్న మామిడీ కొమ్మమీద..గూళ్ళు రెండుడేవి
చరణం::2
చిన్ని చిలక ఏదనీ..కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది..కుమిలి కుమిలి ఏడుస్తుంది
చిన్ని చిలక ఏదనీ..కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది..కుమిలి కుమిలి ఏడుస్తుంది
కోన కోనలో తిరిగీ..కొమ్మ కొమ్మను అడిగీ
కొదమ చిలక కానరాకుంట..కోయిల గతి ఏమవుతుంది
గుండె పగిలి...చస్తుంది