Sunday, January 02, 2011

బంట్రోతు భార్య--1974

సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::ఆరుద్ర
గానం::S.జానకి   
తారాగణం::చలం,కృష్ణంరాజు,అల్లు రామలింగయ్య,బాలకృష్ణ,విజయనిర్మల,సూర్యకాంతం,నిర్మల    

పల్లవి::

సార్...సార్..
సారూ..కలెక్టెరుగారూ..సారీ 
అంటే లేస్తారా..ఈ పూటకి లోపలికొస్తారా 
లోపలికొస్తార..నా సంగతి కాస్త చూస్తారా

చరణం::1

ఊహూ అహ ఆహా..ఓహో అహ ఆహా  
పెళ్ళాం పెట్టిన దరకాస్తైనా..పెండింగ్ ఫైల్లో చూస్తారా
పెట్టిన అర్జీ టక్కున చదివి..నా సంగతి కాస్త చూస్తారా..చూస్తారా
సారూ..కలెక్టెరుగారూ..సో సారీ అంటే లేస్తారా 
ఈ పూటకి లోపలికొస్తారా..లోపలికొస్తారా..నా సంగతి కాస్త చూస్తారా

చరణం::2

కొంచెం చేతులు తడపాలంటే..లంచం పట్టరు దొరగారు
జిల్లాకంతా కలెక్టరైనా ఇల్లాలికి మీరు శ్రీవారూ..శ్రీవారూ
సారూ కలెక్టెరుగారూ..సారీ అంటే లేస్తారా 
ఈ పూటకి లోపలికొస్తారా..లోపలికొస్తారా..నా సంగతి కాస్త చూస్తారా
లాలాలలలలాలా ఊహూ లలలలాలా
లాలాలలలలాలాలా ఊహూహు 

సంసారం సాగరం--1974సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సుంకర సత్యనారాయణ 
గానం::S.P.బాలుP.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ,రోజారమణి,చంద్రమోహన్. 

పల్లవి::

యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు     

చరణం::1

ఒకటి ఒకటి రెండూ..నింగి నేల రెండూ 
పగలూ రేయీ రెండూ..కంటికి రెప్పలు రెండూ
యింటికి యిద్దరు...నిండూ 
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

చరణం::2

ఎదిగే పిల్లల కదిలే పెదవులు..ఎదలో ఆశలు చిలకాలి 
ఎదిగే పిల్లల కదిలే పెదవులు..ఎదలో ఆశలు చిలకాలి 
ఆశల బడిలో అ ఆ లు నేర్చి..ఆశయాల గుడికట్టాలి
యింటిపేరు...నిలబెట్టాలి         
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ.. పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

చరణం::3

ఆలుమగల అనురాగం..ఆనందానికి ప్రతిరూపం
ఆనందం నిండిన ఈ బ్రతుకే..కలకాలమిలా నిలవాలి
యిల్లే స్వర్గం...కావాలి       
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

భక్తతుకారం--1973::సింధుబైరవి::రాగంసంగీతం::ఆదినారాయణ రావ్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల


రాగం::సింధుబైరవి


ఆ...నందన వనముగ
ఈ లోకమునే సృష్టించిన
ఓ... వనమాలీ!
మరచితివో..ఓ..మానవజాతిని దయమాలి

భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభూ మాకేల ఈయవు

మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలిసి జీవించేను
మాటలు నేర్పిన మా నరజాతి
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి..2
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు...

భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభూ మాకేల ఈయవు
భలే అందాలు సృష్టించావు..

ఆ...ఆ...ఆ...ఆ...
చల్లగా సాగే సెలయేటివోలే
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే
అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని..2
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి...

భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభూ మాకేల ఈయవు
భలే అందాలు సృష్టించావు..


భక్తతుకారం--1973::మోహన::రాగం

సంగీతం::ఆదినారాయణరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల


మోహన రాగం::
ఆరోహణం::స, రి, గ, ప, ద, స
అవరోహణం::స, ద, ప, గ, రి, స

హరి ఓం...ఓ...ఓం...
హరి ఓం...ఓ...ఓం...
హరి ఓం....ఓ...ఓం...
ఆ..అ..అ..అ..అ..ఆ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..అ..ఆ..

ఘనా...ఘన సుందరా
కరుణా...రస మందిరా
ఘనా...ఘన సుందరా
కరుణా...రస మందిరా
అది పిలుపో...మేలు కొలుపో
నీ పిలుపో...మేలు కొలుపో
అది మధుర...మధుర
మధురమౌ ఓం కారమో

పాండురంగ...పాండురంగ
ఘనా...ఘన సుందరా
కరుణా...రస మందిరా
ఆ..అ..అ..ఆ..

ప్రాభాత మంగళ పూజావేళ
నీపద సన్నిధి నిలబడీ
నీపద పీఠిక తలనిడీ..

ప్రాభాత మంగళ పూజావేళ
నీపద సన్నిధి నిలబడి
నీపద పీఠిక తలనిడీ..

నిఖిల జగతి నివాళులిడదా
నిఖిల జగతి నివాళులిడదా
వేడదా..కొనియాడదా..

పాండురంగ...పాండురంగ
ఘనా. ఘన సుందరా
కరుణా..రస మందిరా
ఆ..అ..అ..ఆ..

గిరులూ...ఝరులూ
విరులూ...తరులూ
నిరతము నీ పాద ధ్యానమే
నిరతము నీ నామ గానమే

గిరులూ...ఝరులూ
విరులూ...తరులూ
నిరతము నీ పాద ధ్యానమే
నిరతము నీ నామ గానమే

సకల చరాచర...లోకేశ్వరేశ్వర..ఆ..
సకల చరాచర..లోకేశ్వరేశ్వర..ఆ..
శ్రీకరా...భవహరా..ఆ..

పాండురంగ...పాండురంగ
ఘనా...ఘన...సుందరా..అ..అ..ఆ
కరుణా.. రస మందిరా..అ..అ..ఆ
ఆ..అ..అ..ఆ
ఘనా. ఘన సుందరా..అ..అ..ఆ
పాండురంగ..పాండురంగ.
పాండురంగ..పాండురంగ

పాండురంగ...పాండురంగ
పాండురంగ...పాండురంగ

పాండురంగ...పాండురంగ
పాండురంగ...పాండురంగ
పాండురంగ...పాండురంగ
పాండురంగ...పాండురంగ