Friday, May 03, 2013

అడవి రాముడు--1977

సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందర రామమూర్తి 
గానం::S.P.బాలు, P.సుశీల, S. జానకి
తారాగణం::N.T.రామారావు,జయప్రద,జయసుధ,సత్యనారాయణ,శ్రీధర్,నాగభూషణం

పల్లవి::

అమ్మతోడు..అబ్బతోడు..నా తోడు..నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు..ఇంకెన్నటికి నేనే నీ తోడు

అమ్మతోడు..అబ్బతోడు..నా తోడు..నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు..ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం::1

ఆకలన్నదే లేదు..హర హరా..రామ రామా
అన్నమే రుచికాదు..శివ శివా..కృష్ణ కృష్ణా
ఆకలన్నదే లేదు..హర హరా
అన్నమే రుచికాదు..శివ శివా

వెన్నెలలొస్తె వేడిరా నా దొరా..ఆ వేడిలోనే చలేసింది రా
ఆకలన్నదే నీకు లేకపోతే..ఈ కేకలెందుకే రాకపోకలెందుకే
ఒట్టిమాటలింక నీవు కట్టిపెట్టు..నీ ఒట్టు తీసి గట్టుమీద అట్టిపెట్టు

అమ్మతోడు..అబ్బతోడు..నా తోడు..నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు..ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం::2

కళ్ళు కాయలు కాచే హర హరా..ఈశ్వరా
నిన్ను చూడకమాకు శివ శివా..శ్రీహర
కళ్ళు కాయలు కాచే..హర హరా
నిన్ను చూడకమాకు..శివ శివా

పొద్దె గడవదు మాకు ఓ దొరా..నిద్దరన్నదే లేదు రా
నిద్దరన్నదే నీకు లేకపోతే..ఈ పిలుపులెందుకే..ఆ కులుకులెందుకే
గుట్టు బయట పెట్టకుంటే..పెద్ద ఒట్టు
గట్టు మీద చిలక వింటే గుట్టు రట్టు

అమ్మతోడు..అబ్బతోడు..నా తోడు..నీ తోడు
అన్నిటికి నువ్వే నా తోడు..ఇంకెన్నటికి నేనే నీ తోడు

చరణం::3

ఆ శివుడే వరమిచ్చాడే..అదిరిపడకే ఆడవి జింకా
అంబ పలికే జగదంబ పలికెనే..ఆశవదులుకో నీవింకా

ఆహాఁ భోలా శంకరుడయినా నిన్ను బొల్తాకొట్టించాడమ్మా
చిత్తైపోయావమ్మో..ఓ సిగ్గులదొరసానమ్మా

తెల్లారే తల్లో పూలు పెట్టుకురమ్మన్నాడు
తేల్లారకనే తలస్నానం చేసి రమ్మన్నాడు
చిటికెడు విబూది ఇచ్చాడు
పిడికెడు నాకు ఇచ్చాడు
అమ్మతోడు అందాల రాముడు..నా వాడన్నాడు
నా అన్నవాడు అడవి రాముడు..నా తోడన్నాడు
అందుకే వాడు నా వాడు
కాడు కాడు..కాలేడు
అబ్బ అమ్మా

అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు..ఇంకెన్నటికి నేనే మీ తోడు
అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు
అన్నిటికి మీరే నా తోడు..ఇంకెన్నటికి నేనే మీ తోడు
ఇంతటితో ఆపండి..మీగోడు

అనురాగం--1963
సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P. సుశీల
తారాగణం::గుమ్మడి,హరనాధ్,P.భానుమతి,G.వరలక్ష్మి,రేలంగి,రమణారెడ్డి,గిరిజ 

పల్లవి:: 

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 
ఆ హా ఆ హా ఓ హో ఓ హో 
ఆ హా ఆహా ఓ హో ఓ హో 
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు 

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

చరణం::1 

నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..ఏమనెనో 
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే 
నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..ఏమనెనో 
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే 

ఓ ఓ ఓ ఓ  
పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

చరణం::2 

చల్లని గాలి నీవైతే..కమ్మని తావీ నేనవుతా 
కొమ్మవు నీవై రమ్మంటే..కోకిల నేనై కూ అంటా 
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు..జాణవులే 
జాణవులే చూపులతో బాణమేసినందుకు  
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు..జాణవులే 
జాణవులే చూపులతో బాణమేసినందుకు  

ఓ ఓ ఓ  
పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 
ఆ హా ఆ హా ఓ హో ఓ హో 
ఆ హా ఆహా ఓ హో ఓ హో 
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ ,బేబిశ్రీదేవి. 

పల్లవి::

మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  
మేడలో వున్నా ఏడ నీవున్నా
మేడలో వున్నా ఏడ నీవున్నా 
నీ నీడలేక నిలువలేదు ఈ రోజా..హోయ్             
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  

చరణం::1

ముసిముసి నవ్వులలో ముత్యాలు తెచ్చాను
మిసమిస బుగ్గలలో మీగడలే తెచ్చాను
ముసిముసి నవ్వులలో ముత్యాలు తెచ్చాను
మిసమిస బుగ్గలలో మీగడలే తెచ్చాను
దోచే దొరవని..సమయం కనుగొని
దోచే దొరవని..సమయం కనుగొని 
నీ వెచ్చని కౌగిలికై వేచి వేచి వచ్చాను             
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా 

చరణం::2

కన్నులు కలిసేనా..చెకుముకి రవ్వలు
హద్దులు తరిగితే..ముద్దులు పెరిగితే
కన్నులు కలిసేనా..చెకుముకి రవ్వలు
హద్దులు తరిగితే..ముద్దులు పెరిగితే
ఇద్దరి బ్రతుకులేను ముద్దబంతి పువ్వులు
ఇద్దరి బ్రతుకులేను ముద్దబంతి పువ్వులు                         
మేడలో ఉన్నావా ఓ రాజా
వెన్నెల వాడలో ఉన్నావా నారాజా  

చరణం::3

ముద్దుగా పలికితే మోవికే కొత్తరుచి
మత్తుగా నువుచూస్తే మధువుకే కొత్తరుచి
ముద్దుగా పలికితే మోవికే కొత్తరుచి
మత్తుగా నువుచూస్తే మధువుకే కొత్తరుచి
అందమంటే నీదే అందెలంటే నీవే
అందమంటే నీదే అందెలంటే నీవే 
జతగా నువ్వుంటె బ్రతుకుకే కొత్తరుచి..సరికొత్తరుచి

పట్టిందల్లా బంగారం--1971


సంగీతం::ఘంటసాల గారు
రచన::శ్రీ శ్రీ
గానం::విజయలక్ష్మి కన్నారావు,P. లీల
తారాగణం::చలం,జ్యోతిలక్ష్మి, జగ్గయ్య,హరనాధ్,రాజశ్రీ 

పల్లవి::

అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా
మనకిద్దరికీ పెళ్ళంటా..ఇద్దరికీ పెళ్ళంటా 
అమ్మను నేనంటా నాన్నవు నువ్వంటా..ఊహూ
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా

చరణం::1

అమ్మా నాన్నా ఇద్దరిమల్లే బొమ్మరిల్లొకటి కడదామా
బొమ్మలపెళ్ళి చెద్దామా
సరేగానీ బొమ్మకి బొమ్మకి పెళ్ళైపోతే 
బొమ్మల పిల్లలు పుడతారేమో..పుడితే ఏం?
వాళ్ళకి బువ్వ పెట్టేదెవరూ..మిఠాయిలు కొని పెట్టేదెవరూ
వాళ్ళకి బువ్వ పెట్టేదెవరూ..మిఠాయిలు కొని పెట్టేదెవరూ
మనమే..ఎలా ?
అమ్మా నాన్నా మనకిచ్చేవే దాచి పిల్లలకి పెడదామూ
అమ్మా నాన్నా మనకిచ్చేవే దాచి పిల్లలకి పెడదామూ
బొమ్మరింటినే మేడగ చేసి పిల్లలతో మనముందామూ
అందరమూ..కలిసుందామూ
అమ్మను నేనంటా..నాన్నవు నువ్వంటా

చరణం::2

ఉన్నది కాస్తా వాళ్ళు తినేస్తే మనకీ ఆకలి వేస్తేనూ
కడుపే కేకలు వేస్తేనూ
ఉన్నది కాస్తా వాళ్ళు తినేస్తే మనకీ ఆకలి వేస్తేనూ
కడుపే కేకలు వేస్తేనూ
పిల్లలు తినగా మిగిలిందంతా మనమే తింటామూ
హాయిగ ఉంటామూ
అమ్మవు నీవంటా..నాన్నను నేనంటా
అమ్మవు నీవంటా..నాన్నను నేనంటా
సరేగానీ మనకనదరికీ నిద్దుర వస్తే బొమ్మరింటిలో చోటేదీ
మనమూ పిల్లలు ఒక మంచాన కలిసే పడుకుంటాము
మనమూ పిల్లలు ఒక మంచాన కలిసే పడుకుంటాము
అమ్మా నాన్నా చేసేదంతా ఇంతేగా వోయ్ పుల్లయ్యా
అమ్మా నాన్నా చేసేదంతా ఇంతేగా వోయ్ పుల్లయ్యా
పిచ్చి పుల్లయ్య..పిచ్చి పుల్లయ్యా