Saturday, September 05, 2015

విశ్వరూపం--1981 హ్యాపీ టీచర్స్ డే ఫ్రెండ్స్సంగీతం::చక్రవర్తి 
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Director::DasariNarayanaRao
తారాగణం::N.T.రామారావు,జయసుధ,అంబిక.

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నూటికో కోటికో..ఒక్కరు 
ఎప్పుడో ఎక్కడో..పుడతారు
నూటికో కోటికో..ఒక్కరు 
ఎప్పుడో ఎక్కడో..పుడతారు
అది మీరే..మీరే..మాస్టారు
మా దేవుడు మీరే..మాస్టారు
అది మీరే..మీరే..మాస్టారు
మా దేవుడు మీరే..మాస్టారు
నూటికో కోటికో..ఒక్కరు 
ఎప్పుడో ఎక్కడో..పుడతారు

చరణం::1

దారే దొరకని..చీకటిలో..ఓ 
తానే వెలుగై నడిచాడు..ఊ
జాతే నా..వెలుగన్నాడు 
జాతిపితా..ఆ..మన జాతిపిత
దిక్కులు తెలియని..సమయంలో
తానే దిక్కుగ..నిలిచాడు..ఊ 
శాంతిని నేతగ..నిలిపాడు..ఊ
శాంతిదూత మన..శాంతిదూత
ఆ జాతిపిత బాపూజీ మీలో..వెలిశాడు
ఆ శాంతి దూత నెహ్రూజీ..మీలో కలిశాడు
ఎందరో ఇంకెందరో..మీలో ఉన్నారు
మా దేముడు..మీరే మాస్టారు 
మా దేముడు..మీరే మాస్టారు 
నూటికో కోటికో..ఒక్కరు 
ఎప్పుడో ఎక్కడో..పుడతారు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::2

జరిగే జీవిత సమరంలో..జారే నైతిక విలువల్లో
నీతిని నేతగా నిలపాలి..నవయువత యువనేత
చుక్కలు మాడే గుండెల్లో..నిప్పులు వెలగని గుడిసెల్లో
ఆశను జ్యోతిగా నిలపాలి..నవయువత యువనేత
ఈ యువత తాత గాంధీజీ..మీలో మిగిలారు
మీ నవతకు నేతాజీ..మీలో రగిలారు
అందరూ ఆ అందరూ..మీలో ఉన్నారు
దేశానికి..మీరే సారధులు 
దేశానికి..మీరే సారధులు

నూటికో కోటికో..ఒక్కరు 
ఎప్పుడో ఎక్కడో..పుడతారు
నూటికో కోటికో..ఒక్కరు 
ఎప్పుడో ఎక్కడో..పుడతారు
అది మీరే..మీరే..మాస్టారు
మా దేవుడు మీరే..మాస్టారు
అది మీరే..మీరే..మాస్టారు
మా దేవుడు మీరే..మాస్టారు

అల్లుడు పట్టిన భరతం--1980
సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::K.Viswanaath
తారాగనం::కృష్ణంరాజు,,జయసుధ,నూతన్‌ ప్రసాద్,కవిత,అల్లు రామలింగయ్య,రమాప్రభ,రంగనాథ్,నాగభూషణం,పద్మనాభం.

పల్లవి::

హే...ఈఈ..లల్లల్లా
ఆ..హా..లలల్లలా
ఆ..హా..హా..హా..హా
పలికెను నాలో..పల్లవిగా
పలికెను నాలో..పల్లవిగా
అరవిరిసే..అనురాగం 
అరవిరిసే..అనురాగం 
నా పరువాలే..పాడగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పలికెను నాలో..పల్లవిగా 
పలికెను నాలో..పల్లవిగా

చరణం::1

కడలిని కోరి గిరులను దాటి
సెలయేరు దిగిదిగిరాగా
కడలిని కోరి గిరులను దాటి
సెలయేరు దిగిదిగిరాగా
మిన్నుల్లో పూచే వెన్నెల తానే 
ఈ నేల ముద్దాడి పోదా
నిను నిను చూసి నను నేనే మరచి
నిను నిను చూసి నను నేనే మరచి
నిన్నంటి రాలేదా
ఆ పరువాలే పాడగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పలికెను నాలో పల్లవిగా 
పలికెను నాలో పల్లవిగా

చరణం::2

మిలమిల మెరిసే జిలిబిలి నవ్వే 
అలివేణి పెదవికి అందం
మిలమిల మెరిసే జిలిబిలి నవ్వే 
అలివేణి పెదవికి అందం
జలజల కురిసే తొలకరి జల్లే 
నింగికి..నేలకు..బంధం
ఆ అందమేదో..ఆ బంధమేదో 
ఆ అందమేదో ఆ బంధమేదో 
ఇరువురి....అనుబంధం
ఆ పరువాలే పాడగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పలికెను నాలో పల్లవిగా 
పలికెను నాలో పల్లవిగా
అరవిరిసే అనురాగం 
అరవిరిసే అనురాగం 
నా పరువాలే పాడగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పలికెను నాలో పల్లవిగా 
పలికెను నాలో పల్లవిగా