సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,సుశీల
ఏనాటికైనా ఏజన్మనైనా నీతోడు నీడగా నె చేయి వీడకా
నీ అడుగుజాడలే అనుసరిస్తాను...
కన్నులు నీవే కావాలీ..కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలి..కావ్యం నేనై నిలవాలి
కన్నులు నీవే కావాలీ..కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలి..కావ్యం నేనై నిలవాలీ
కన్నులు నీవే కావాలీ..ఈ..ఈ..ఈ..
మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి
మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి
కడలి నేనై పొంగాలీ..నదివి నీవై చేరాలీ
కడలి నేనై పొంగాలీ..నదివి నీవై చేరాలీ
నదివీ నీవై చేరాలీ
కన్నులు నీవే కావాలీ..ఈ..ఈ..ఈ..
తొలకరి నీవై చిలకాలీ..మొలకను నేనై మొలవాలీ
తొలకరి నీవై చిలకాలీ..మొలకను నేనై మొలవాలీ
దైవం నీవై నడపాలీ..ధర్మం నీనై నడవాలీ
దైవం నీవై నడపాలీ..ధర్మం నీనై నడవాలీ
ధర్మం నీనై నడవాలీ
కన్నులు నీవే కావాలీ..ఈ..ఈ..ఈ..
శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి
శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి
కన్నులు నీవే కావాలి..కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలీ..కావ్యం నేనై నిలవాలి
కన్నులు నీవే కావాలీ..ఈ..ఈ..ఈ