సంగీతం::చెళ్ళపిళ్ళి సత్యం రచన::వీటూరి గానం::S.P.బాలు,S.జానకి Film Directed By::C.S.Rao తారాగణం::చంద్రమోహన్,భానుచందర్,అర్చన,K.R.విజయ. పల్లవి:: నీవు రాగము..ఊ..నేను తాళ్ళము నేను నాట్యము..ఊ..నీవు వేదము ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి ఆరు రుతువులకు..ఇదే పల్లవి జన్మకిదే..నా..పూజావలీ..ఈఈఈ నీవు రాగము..ఊ..నేను తాళ్ళము..ఊఊఊ నేను నాట్యము..ఊ..నీవు వేదము చరణం::1 మామితోటల..మల్లికలలో మొవిదాటిన..అల్లికలో కోయిలల్లే ఎగసి పాడే కోరికలతో..ఓఓఓ ఎన్నికళ్ళలో మొసుకొచ్చే ఈ వసంతం గ్రీషమైన..విడిచిపోను..ఊఊఊఊఊఊ విరహమల్లే..నిలిచిపోను..ఊఊఊఊఊ గ్రీషమైన..విడిచిపోను..ఊ విరహమల్లే..నిలిచిపోను..ఊ వేడి వలపే వేసవి నీ నీడ మల్లెల పందిరి..ఈఈఈఈఈ నేను నాట్యము..ఊ..నీవు వేదము నీవు రాగము..ఊ..నేను తాళ్ళము చరణం::2 శ్రావణ సంధ్యా..రాగాలు ఆ..హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ శ్రావణ సంధ్యా..రాగాలు మధురసంగమ..స్నానాలు..ఊ తేటగీతిలా తేనే వెన్నెల తేలివస్తుంటే..ఏఏఏ ఆట వెలదిల హంసమేఘమే సాగివస్తుంటే..ఏఏఏ పూటపూటకి పున్నమలే తెల్లవారినా వెన్నెలలే..ఈఈఈఎ నీవు రాగము..ఊ..నేను తాళ్ళము నేను నాట్యము..ఊ..నీవు వేదము చరణం::3 లేత పెదవే పుష్యరాగం సిగ్గుపడితే మంచు ముత్యం బంతులు చేమంతులు పసుపుపారాణులు మంచులో చలిమంటలే అగ్నిసాక్షాలు రుతువులెన్నో..మారుతున్నా..ఆ ఆ ఆ వయసు నాలో..వణుకుతున్న..ఆ ఆ ఆ రుతువులెన్నో..మారుతున్నా..ఆ వయసు నాలో..వణుకుతున్న..ఆ శిశిరమైన శిధిలమైన చెరిగిపోదీ అనురాగం..మ్మ్ నీవు రాగము..ఊ..నేను తాళ్ళము నేను నాట్యము..ఊ..నీవు వేదము ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి ప్రేమకొకటే పల్లవి..జన్మకొకటే జావలి ఆరు రుతువులకు ఇదే పల్లవి జన్మకిదే నా పూజావలి..ఈఈఈఈ నీవు రాగము..ఊ..నేను తాళ్ళము నేను నాట్యము..ఊ..నీవు వేదము
సంగీతం::K.V.మహాదేవన్ రచన::దాశరథి గానం::ఘంటసాల ,సుశీల Film Directed By::Adurthi SubbaRao
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,అల్లురామలింగయ్య,రాజబాబు,పద్మనాభం,రమాప్రభ,సూర్యకాంతం,S.V.రంగారావు, అంజలిదేవి,నాగయ్య,రాధాకుమారి. పల్లవి:: చల్లని బాబూ..నా అల్లరి బాబూ నా కంటి పాపవు..నీవే మా యింటి దీపం..నీవే చల్లని బాబూ..నా అల్లరి బాబూ చరణం::1 పంచవన్నెల రామచిలకను..పలకరించబోయేవు పంచవన్నెల రామచిలకను..పలకరించబోయేవు వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వెసేవు నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను బాబూ..చల్లని బాబూ..నా అల్లరి బాబూ నా కంటిపాపవు నీవే..మా యింటి దీపం నీవే చరణం::2 ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ వున్నాను వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ వున్నాను వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు చల్లని బాబూ..నా అల్లరి బాబూ నా కంటి పాపవు నీవే మా యింటి దీపం నీవే చరణం::3 నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నవా నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలుకావా
Vichitra Bandham--1972 Music::K V Mahadevan Lyrics::Dasaradhi Singer's::Ghantasala,P.Suseela Film Directed By::Adurthi SubbaRao Cast::A.N.R.Vanisree,Alluraamalingayya,S.V.Rangarao,Padmanabham,Ramaprabha,Nagayya,Anjalidevi,Sooryakaantam,Rajababu,Raadhakumaari. ::::::::: Challani baabuu..naa allari baabuu naa kanTi paapavu..neevE maa inTi deepam..neevE Challani baabuu..naa allari baabuu