Sunday, September 23, 2012

అడవి దొంగ--1985సంగీతం::చక్రవర్తి 
రచన::వేటూరి సుందర రామమూర్తి  
గానం::S.P.బాలు, S.జానకి 
తారాగణం::చిరంజీవి,రాధ,శారద 

పల్లవి: 

అ ఆ ఆ వానా వానా వందనం.. 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 
నీవే ముద్దుకు మూలధనం 
పడుచు గుండెలో గుప్తధనం 
ఇద్దరి వలపుల ఇంధనం 
ఎంత కురిసినా కాదనం 
ఏమి తడిసినా..ఆ..ఆ..వద్దనం..ఈ దినం 

లల్లల్ల..లాలా..లాలా.. 
అ ఆ ఆ వాన వాన వందనం.. 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 

చరణం::1 

చలి పెంచే నీ చక్కదనం..కౌగిట దూరే గాలి గుణం 
గాలి వానల కలిసి రేగుతూ..కమ్ముకుపోతే యవ్వనం 
చినుకు చినుకులో చల్లదనం..చిచ్చులు రేపే చిలిపితనం 
వద్దంటూనే వద్దకు చేరే ఒళ్లో ఉందీ పడుచుతనం 
మెరుపులు నీలో చూస్తుంటే..ఉరుములు నీలో పుడుతుంటే 
వాటేసుకొని తీర్చుకో..వానదేవుడి వలపు ఋణం..వాన దేవుడి వలపు ఋణం

అ ఆ ఆ వానా వానా వందనం... 
ఆ ఆ ఆ వయసా.. వయసా.. వందనం 

చరణం::2 

కసిగ ఉన్న కన్నెతనం..కలబడుతున్న కమ్మదనం 
చెప్పలేక నీ గుండ వేడిలో..హద్దుకుపోయిన ఆడతనం 
ముద్దుకు దొరికే తియ్యదనం..ముచ్చట జరిగే చాటుతనం 
కోరి కోరి నీ పైట నీడలో..నిద్దుర లేచిన కోడెతనం 
చినుకులు చిట పటమంటుంటే..చెమటలు చందనమౌతుంటే 
చలి చలి పూజలు చెసుకో..శ్రావణమాసం శోభనం..శ్రావణమాసం శోభనం 

అ ఆ ఆ వానా వానా వందనం.. 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 
నీవే ముద్దుకి మూలధనం.. 
పడుచు గుండెలో గుప్తధనం.. 
ఇద్దరి వలపుల ఇంధనం.. 
ఎంత తడిచిన కాదనం.. 
ఏమి తడిసిన వద్దనం..ఈ దినం

లల్లల్ల..లాలా..లాలా.. 
అ ఆ ఆ వానా వానా వందనం... 
ఆ ఆ ఆ వయసా..వయసా..వందనం 

అల్లరి పిల్లలు--1978


సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::చెళ్ళపిళ్ళ సత్యం
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::C.S.Rao
రాతాగణం::రామకృష్ణ,జయచిత్ర,సావిత్రి,నాగభూషణం,చంద్రమోహన్,రాజబాబు 

పల్లవి::

శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా

శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా

చరణం::1

ఆత్మను నేనంటివి దేహపరమాత్మ నీవేనంటివి
ఆత్మను నేనంటివి దేహపరమాత్మ నీవేనంటివి

నీలోన నిలిచిపోనా..నిన్ను నాలోన కలుపుకోనా
నా స్వామి శృంగార శ్రీనివాసా

శ్రీచక్ర శుభనివాసా..
స్వామి జగమేలు చిద్విలాసా
నా స్వామి శృంగార శ్రీనివాసా

చరణం::2

కలవాడిననీ..హరి ఓం
సిరి కలవాడిననీ..హరి ఓం
మగసిరికలవాడిననీ..హరి ఓం
మనసు పద్మావతికిచ్చి..మనువు మహలక్ష్మికిచ్చినా
స్వామీ శృంగార శ్రీనివాసా

శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా
నా సామి శృంగార శ్రీనివాసా
నా సామి శృంగార శ్రీనివాసా
నా సామి శృంగార శ్రీనివాసా

అక్కాచెల్లెళ్ళు--1957

సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
గానం::A.M.రాజా, జిక్కి
నిర్మాతలు::P.గోపాలరెడ్డి, P.ఏ.పద్మనాభరావు
దర్శకత్వం::సార్వభౌమ, అమనుతుల్లా
తారాగణం::అమర్‌నాధ్, శ్రీరంజని, కృష్ణకుమారి
సంస్థ::శర్వాణి

అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే
కొంటెచూపు చూసేటి మావయా
నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా
అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే
కొంటెచూపు చూసేటి మావయా
నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా

చరణం::1

గున్న మావి పళ్ళు కోయు పిల్లదానా
గున్న మావి పళ్ళు కోయు పిల్లదానా
నీ వన్నె మీద మనసాయె చిన్నదానా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కోరచూపు చూడకే కుర్రదానా
ఆ అహా
కోరచూపు చూడకే కుర్రదానా
నీ కోరచూపు బాసయ్యే గుండెలోన

అంటుమామిడి తోటలోన 
కంటికింపు కాకుండా ఒంటరిగా ఉంటేను ఎలా
ఇక జంటగానే ఉండాలే పిల్ల

చరణం::2

మోటబావి నీరు తాగు చిన్నవాడా
నా బాట కట్టి రాబోకు వన్నెకాడా
మోటబావి గట్టు పక్క, నిమ్మచెట్టు నీడ కింద
మోటబావి గట్టు పక్క, నిమ్మచెట్టు నీడ కింద
మోటు సరసమేల చాలు నిలు నిలు నీటుగాడా

అంటు మామిడి తోటలోన ఒంటరిగా పోతుంటే
కొంటెచూపు చూసేటి మావయా
నీ కంటిచూపు కథలు తెలుసు లేవయా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గళ్ళ చీర కట్టుకుని
కళ్ళ కాటుకెట్టుకొని
గుళ్ళ పేరు వేసుకొని
ఘల్లుఘల్లని పోతుంటే
ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడొచ్చా
నా కళ్ళ సంకెల్లు నీకు వెయ్యొచ్చా

చిలకాగోరింకలల్లే చెట్టాపట్టాలేసుకొని
కలసి మెలసి ఉంటేనే హాయి
ఇలా కులుకుతూ ఉంటేనే హాయి

అక్కాచెల్లెలు--1970
సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::Akkineni Sanjeevi
తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య
పల్లవి::

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

చరణం::1

వచ్చే వచ్చే వానజల్లు..వచ్చే వచ్చే వానజల్లు
జల్లు కాదది పొంగివచ్చు..పడుచుదనం వరదలే అది
జల్లు కాదది పొంగివచ్చు..పడుచుదనం వరదలే అది
వరద కాదది ఆగలేని..చిలిపితనం వాగులే అది
నీ వేగమే ఇది..

కురిసింది వాన మెరిసింది జాణ...
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

చరణం::2

నల్లమబ్బు తెల్లమబ్బు..ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో..ముసుగు కప్పుకున్నవి
నల్లమబ్బు తెల్లమబ్బు..ముద్దులాడుకున్నవి
చుక్కలన్ని చీకట్లో..ముసుగు కప్పుకున్నవి
ఉల్లిపొర చీర తడిసి..ఒంటికంటుకున్నది
ఉల్లిపొర చీర తడిసి..ఒంటికంటుకున్నది

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
తళాతళా మెరుపులతో

చరణం::3

మెరిసె మెరిసె రెండు కళ్లు..మెరిసె మెరిసె రెండు కళ్లు
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
కళ్లు కావవి మనసులోకి తెరిచిన వాకిళ్ళులే అవి
వాకిళ్ళు కావవి వలపు తేనెలూరే రసగుళ్లులే అవి
సెలయేళ్లులే ఇవి
మెరిసింది పైన ఉరిమింది లోన

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన
చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ
చిటాపటా చినుకులతో

అక్కాచెల్లెలు--1970

సంగీతం::K.V. మహదేవన్ 
గీతరచయిత::ఆచార్య ఆత్రేయ 
 గానం::P.సుశీల
Film Directed By::Akkineni Sanjeevi
 తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య


పల్లవి:: 

పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

చరణం::1 

కన్నెగానె బతుకు గడిచిపోతుంది 
నన్నెవరేలుకుంటారు అనుకున్నది 
కన్నెగానె బతుకు గడిచిపోతుంది 
నన్నెవరేలుకుంటారు అనుకున్నది 
జానకి అనుకున్నది 
అయ్యో..జానకి అనుకున్నదీ 
అయ్యో..జానకి అనుకున్నదీ 
శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నదీ 
ఒళ్లంతా ఝల్లన్నదీ 
ఓయమ్మా..ఒళ్ళంతా ఝల్లన్నదీ 

ఆ..హొహోయ్..పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

చరణం::2

నవ మన్మధుని వంటి నాధుని కనులారా 
ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది 
నవ మన్మధుని వంటి నాధుని కనులారా 
ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది 
తుమ్మెదా ఉబలాటపడ్డది
ఓ..హొయ్..తుమ్మెదా ఉబలాటపడ్డది 
పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది 
కళ్లలో..కాని సిగ్గు కమ్మేసింది 
ఓయమ్మా బుగ్గలకుపాకింది 

అయ్..ఒహోయ్..పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 

చరణం::3 

నీ గుండెలోనె నేనుండిపోవాలి 
నీ అండనే నేను పండిపోవాలి 
నీ గుండెలోనె నేనుండిపోవాలి 
నీ అండనే నేను పండిపోవాలి 
నా నోముపంట పండాలి 
నా నోముపంట పండాలి 

రాముడే రాముడు..జానకే జానకని 
ముందు వెనకందరూ..మురిసిపోవాలని 
జానకి మొక్కుతూ మొక్కుకుంది 

పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
హే..పాండవులు పాండవులు తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా 
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా