సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
Film Director::V.B.Rajendra Prasad
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,జయంతి,రాజబాబు,S.వరలక్ష్మీ,కృష్ణ,శోభన్‌బాబు,
నాగభూషణం,పద్మనాభం.
పల్లవి::
ఏమనుకున్నావూ..నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా..ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా
ఏమనుకున్నావూ..నన్నేమనుకున్నావూ
చరణం::1
వెళ్ళినట్టె, వెళ్ళావూ..కళ్ళలోనె ఉన్నావూ
మరచిపోను వీలులేక..మనసులోనె మెదిలావూ
వెళ్ళినట్టె, వెళ్ళావూ..కళ్ళలోనె ఉన్నావూ
మరచిపోను వీలులేక..మనసులోనె మెదిలావూ
పిచ్చివాడి ననుకున్నావా..బిచ్చగడి ననుకున్నావా
ఏమనుకున్నావూ..నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా..ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా
చరణం::2
నిన్నునేను రమ్మన్నానా..మనసు నాకు ఇమ్మన్నానా
వచ్చి వలపు రగిలించావూ..చిచ్చునాకు మిగిలించావూ
నిన్నునేను రమ్మన్నానా..మనసు నాకు ఇమ్మన్నానా
వచ్చి వలపు రగిలించావూ..చిచ్చునాకు మిగిలించావూ
పిచ్చివాడి ననంకున్నావా..బిచ్చగడి ననుకున్నావా
ఏమనుకున్నావూ..నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా..ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా
చరణం::3
ప్రేమంటేనే బాధన్నారూ..ఆ బాధుంటేనే బ్రతుకన్నారూ
అది ప్రేమే కాదంటాను..ఆ బ్రతుకే వద్దంటాను
అది ప్రేమే కాదంటాను..ఆ బ్రతుకే వద్దంటాను
ఏమనుకున్నావూ..నన్నేమనుకున్నావూ
పిచ్చివాడి ననుకున్నావా..ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా