సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
పల్లవి::
జోడు గుళ్ళ పిస్తోలు..ఠా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
చరణం::1
హద్దు మీరు వారు శిక్షింపబడుదురు
బుద్ధిమంతులెపుడు రక్షింపబడుదురు
జోడు గుళ్ళ పిస్తోలు..ఠా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
చరణం::2
ఆఫీసరు భార్యననే అహం కూడదు
అధికారం చెలాయిస్తే ఇంక చెల్లదు
తొండ ముదిరితే ఊసరవెల్లి..అత్తా
హజం ముదిరితే హళ్ళికి హళ్ళి
జోడు గుళ్ళ పిస్తోలు..ఠా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
చరణం::3
కాకి పిల్ల కాకికి కడు ముద్దు
అది అందుచేత కాకూడదు మొద్దు
ఎవరి గొప్ప వాళ్ల వద్ద ఆగకున్నచో
ఎవరి గొప్ప వాళ్ల వద్ద ఆగకున్నచో
అత్తా..దేహశుద్ధి..కొండొకచో జరుగుట కద్దు
జోడు గుళ్ళ పిస్తోలు..ఠా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
చరణం::4
నోరు మంచిదైతేనే ఊరు మంచిది
పోరు నష్టమూ..ఎపుడూ పొందు లాభము
ఇది కోర్టుకెక్కితే అంతా అభాసు..అత్తా
నీ జోరు తగ్గకుంటేనూ కొంప కళాసు
జోడు గుళ్ళ పిస్తోలు..ఠా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా
నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహా..హు మ్మ్..జీహా