Friday, August 17, 2007

రాజమకుటం--1960


సంగీతం::మాస్టర్ వేణు
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::P.లీల 
తారాగణం:N.T.రామారావు, రాజసులోచన,గుమ్మడి,కన్నాంబ,రాజనాల,పద్మనాభం

పల్లవి::

ఓఓఓఓఓఓఓ..ఓఓఓఓఓఓఓ..హేయ్ 
ఏడనున్నా..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు
ఏడనున్నా..ఎక్కడున్నాడో
చూడ చక్కని చుక్కల ఱేడు
ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
హేయ్.. 

చరణం::1

ఓహొహొహో..ఓహొహొహో
గాలి రెక్కల..పక్షుల్లారా..ఆ
గాలి రెక్కల..పక్షుల్లారా 
పాల వన్నెల మబ్బుల్లారా
ఓఓఓఓఓఓఓఓఓ
గాలి రెక్కల..పక్షుల్లారా
పాల వన్నెల..మబ్బుల్లారా
పక్షుల్లారా..మబ్బుల్లారా
మనసు చూరగొని మాయమైన మక్కువ ఱేడే
ఏడనున్నాడో..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
హేయ్.. 

చరణం::2

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
పొగడపొన్నల..పువ్వలవీడ
పొగడపొన్నల..పువ్వలవీడ
పూల వీధిలో..తుమ్మెదున్నాడా..ఆ
పొగడపొన్నల..పువ్వలవీడ
పూల వీధిలో..తుమ్మెదున్నాడా
గున్నమామిడి..కొమ్మలగూడా
గూటిలోన..గండు కోయిలలేడా
గున్నమామిడి..కొమ్మలగూడా
గూటిలోన..గండు కోయిలలేడా
కోయిలలేడా..తుమ్మెదున్నాడా
కులుకు బెలుకుగల కోడె ప్రాయపు కొంటివాడే
ఏడనున్నాడో..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు..ఏడనున్నాడో ఎక్కడున్నాడో
చూడచక్కని చుక్కలరేడు..ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు..ఏడనున్నాడో ఎక్కడున్నాడో..హేయ్ 

రాజమకుటం--1960:::ఆభేరి::రాగం






















సంగీతం::మాష్టర్ వేణు
రచన::దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు
గానం::P.లీల

Film Directed By::B.N.Reddi
తారాగణం::N.T.రామారావు,రాజసులోచన,రాజనాల,కన్నాంబ.
రాగం :: ఆభేరి



సడిచేయకో గాలి సడిచేయబోకె
సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకే

రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
మణి కిరీటం లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగున మాని కొలిచి పోరాదే
సడిచేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకేలే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడిచేయకే

పండు వెన్నెలలడిగి పానుపు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవను పూని విసిరి పోరాదే

సడిచేయకో గాలి సడిచేయబోకె
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిచేయకో గాలి
0..ఆఆఆఆఆఆఆఆ..మ్మ్ మ్మ్
మ్మ్

సారంగధర--1957




సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::భానుమతి


పల్లవి::

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు
అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

చరణం::1

మదిలో మెదిలే దేవుడే
కనుపించెను కన్నులకే
మదిలో మెదిలే దేవుడే
కనుపించెను కన్నులకే
వ్రతము ఫలించె బ్రతుకు తరించె
వ్రతము ఫలించె బ్రతుకు తరించె
వరుడరుదెంచెనుగా

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

చరణం::2

నీ రూపురేఖ నీ నవయవ్వన శోభ ఆ ఆ ఆ ఆ
సఫలమయే శుభవేళ
సమకూరెనుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

చరణం::3

నీ చెలికానుని దొచుకొనేనని
అలుగకుమా పావురమా
నీ చెలికానుని దొచుకొనేనని
అలుగకుమా పావురమా
నీ ఉపకృతికి బహుకృతిగా
గైకొనుమా నా ప్రేమ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు
అభినవ నారీ మన్మధుడు

మయా బజార్--1957



రచన::పింగళి నాగేంద్ర రావ్
సంగీతం::ఘంటసాల
గానం::ఘంటసాల

సుందరి నీవంటి దివ్యస్వరూపము
యెందెందు వెతికినా లెదుకదా
యెందెందు వెతికినా లెదుకదా
నీ అందచందాలింక నావే కదా
సుందరి ఒహో సుందరి అహ సుందరి

దూరం దూరం..ఆ
!!!
ఆ దూరమెందుకే చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుతౄడనింక నేనే కదా ఆ
ఆ దూరమెందుకే చెలియా
వరియించి వచ్చిన ఆర్యపుతౄడనింక నేనే కదా
మన పెళ్ళి వేడుకలింక రేపే కదా అయో

రేపటిదాకా ఆగాలి..ఆ !!!

ఆగుమంటూ సఖియా ఆలమరవెందుకే
సోగసులన్ని నాకు నచ్చే కదా
ఆగుమంటూ సఖియా ఆలమరవెందుకే
సోగసులన్ని నాకు నచ్చే కదా
నీ వగలోనా విరహము హెచ్చే కదా

!! హెచ్చితే ఎలా పెద్దలున్నారు
!!
పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి మ్మ్..
పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతినేకదా ఆ
పెద్దలున్నారంటూ హద్దులెందుకే రమణి
వద్దకు చేరిన పతినేకదా
నీ ముద్దుముచ్చటలింక నావే కదా
సుందరి నీవంటి దివ్యస్వరూపము
యెందెందు వెతికినా లెదుకదా
ఈ ముద్దుముచ్చటలింక నావే కదా
సుందరి అహ సుందరి ఒహొ సుందరి
అహ సుందరి ఒహొ సుందరి ఒహొ సుందరి
ఒహొ సుందరి ఒహొ సుందరి !!

ధర్మదాత--1966







సంగీతం::టి.చలపతి రావ్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల.


చిన్నారి బుల్లెమా
సిగ్గెందుకు లేవమ్మా
చన్నీట స్నానాలు చాలమ్మా అమ్మో
నీ చక్కలిగింతలు నాకందించగ రావమ్మా

!! చిన్నారి బుల్లెమ్మా !!
మెరిసిన నీ కళ్ళలో ఆ రంగులుచూసి
తడిసిన నీ మేనిలో ఆ పోంగులు చూసి

ఏం చూసి ?
రంగులు చూసి పోంగులు చూసి
రంగుల పోంగుల హంగులు చూసి
మనసేమో అంటుంటే
మత్తెక్కి పోతుంటే 2ఒళ్ళంత ఝలంటుందె బుల్లెమ్మా
బుల్లెమ్మా ఇగో ఇగో....

!! చిన్నారి బుల్లెమ్మా !!

చలి చలిగా వుందటే ఓ చక్కని దానా
చీరలు కావాలటే ఓ చిక్కని దానా

యూ...సిల్లి.....
చక్కని దానా చిక్కని దానా
చక్కని చిక్కని చెక్కిలిదానా
వేడుకలే తీరుస్తా మూడుముళ్ళువేసేస్తా 2
మొహమాటం ఎందుకురావే బుల్లెమ్మా
బుల్లెమ్మా ఇగో....ఇగో...

!! చిన్నారి బుల్లెమ్మా !!

జైజవాన్--1970::: కల్యాణి :: రాగం







సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
రచన: నారాయణ రెడ్డి
గానం:: ఘంటసాల, P.సుశీల
రాగం:: కల్యాణి


మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ
పసిడి కలలేవొ చిగురించె
ప్రణయ రాగాలు పలికించె

!! మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ !!
ఎదను అలరించు హారములొ
పొదిగితివి ఎన్ని పెన్నిధులో (2)మరువరాని మమతలన్ని
వెలిసిపోవాలి కన్నులలో

!! మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ !!
సిరుల తులతూగు చెలివున్నా
కరుణ చిలికేవు నాపైన(2)కలిమి కన్నా చెలిమి మిన్నా
కలవు మణులెన్నొ నీలోనా

!! మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ !!
ఒకే పదమందు పయనించి
ఒకే గమ్యమ్ము ఆసించి(2)ఒకే మనసై ఒకే తనువై
ఉదయ శిఖరాలు చేరితిమి

!! మధుర భావాల సుమమాల
మనసులో పూచె ఈ వేళ !!

అగ్గిబరాటా--1966::శంకరాభరణ::రాగం




సంగీతం::విజయా కృష్ణమూర్తి
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P.సుశీల

శంకరాభరణ::రాగం

పల్లవి::

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చరణం::1

నెలరాజు సైగచేసె వలరాజు తొంగిచూసె
నెలరాజు సైగచేసె వలరాజు తొంగిచూసె
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసె
సిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసె

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చరణం::2

నయనాల తారనీవె..నా రాజహంస రావె
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నయనాల తారనీవె..నా రాజహంస రావె
నను చెరదీసి మనసార చూసి పెనవెసి నావు నీవె
నను చెరదీసి మనసార చూసి పెనవెసి నావు నీవె

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి

చరణం::3

పవళించు మేనిలోన రవళించె రాగవీణ
పవళించు మేనిలోన రవళించె రాగవీణ
నీలాలనింగి లోలోనపొంగి కురిపించె పూలవాన
నీలాలనింగి లోలోనపొంగి కురిపించె పూలవాన

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి 

రాజమకుటం--1960:::చారుకేశి::రాగం



























రచన: నాగరాజు.
సంగీతం::మాస్టర్ వేణు
(జి.రజనీకాంత రావు)
గానం::ఘంటసాల, P.లీల.
Film Directed By::B.N.Reddi
తారాగణం::N.T.రామారావు,రాజసులోచన,రాజనాల,కన్నాంబ.

రాగం::: చారుకేశి :::

ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో ఓ...ఓ..
ఊరేది పేరేది ఓ చందమామ
(2)
నిను చూసి నీలి కలువ పులకింపనేలా

ఓ..ఓ..జాబిల్లి నీలి కలువ విడరాని జంట
ఊరేల పేరేల ఓ కలువ బాల
ఊగెటి తూగెటి ఓ కలువ బాల

ఆ..ఆ..ఆ..

విరిసిన రేకుల చెలువనుర..ఆ..ఆ..
కురిసే తేనేల కలువనుర
దరిపి వెన్నెలెల దొర రారా ఆ..ఆ..ఆ..

మరుగెలనురా నెలరాజ
తెర తీయర చుక్కల రేడ
రావోయి రావోయి ఓ చందమామ

పరువములొలికే విరిబోణి
(2)
స్వప్నసరసిలో సుమరాణి ఆ..ఆ..
కొలనంతా వలపున
తూగే అలలై పులకింతలు రేగే
నీవాడ నేగాన ఓ కలువ బాల

తరుణ మధుర మొహనా హిమచర
గరళ యవ్వనా మురాతి కనర
సురుచి రమన నా నివాళి ఇదిగో
(2)
వలచిన నా హృదయమె గైకొనరార

ఆస్తిపరులు--1966




సంగీతం::KV.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల

చిట్టి అమ్మలూ..చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు

ఎవరికెవరు వే శారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
నీకు నేను అమ్మనూ నాన్ననూ (2)
నాకు నీవే లోకాన సర్వమూ (2)

కన్న కడుపు తీయదనం కన్న
నీకు అన్న ఒడి వెచ్చదనం మిన్న
పదినాళ్ల పాపగానే ఒదిగావు (2)
హృదయమే ఊయలగా ఊగావు (2)

చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు

హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు

ఉన్నవాళ్లే నీకింక నీ వాళ్లు (2)
తుడిచివేయవమ్మా నీ కన్నీళ్లు

అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదను చీల్చి పాడుతున్న జోలలు (2)
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు (2)

జైజవాన్--1970



























సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల,బృందం


సాకీ :
వీరభారతీయ పౌరులారా!..దేశమాత పిలుపు వినలేరా

పల్లవి ::
హిమాలయంలో మంటలురేగి ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి

చరణం::1
అంతా స్నేహితులనుకున్నాము
అందరి మేలు ఆశించాము
అందరి మేలు ఆశించాము
పరుల మంచిపై నమ్మకముంచి
పగటికలలో జీవించాము
నే టికి కలిగెను కనువిప్పు
ముంచుకు వచ్చెను పెనుముప్పు
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి

చరణం::2

వీరమాతలారా సుతులకు
చందన గంధం పూయండి
చందన గంధం పూయండి
వీరవనితలారా పతులకు
కుంకుమ తిలకం తీర్చండి
కుంకుమ తిలకం తీర్చండి
నెత్తురుపొంగే యువకుల్లారా కత్తులుదూసి దూకండి
బానిసతనమున బ్రతికేకన్న చావేమేలని తలచండి
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి

చరణం::3

మనమంతా ఒకజాతి సమైక్యమే మననీతి
మనమంతా ఒకజాతి సమైక్యమే మననీతి
కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి
ధర్మదీక్షయే మన కవచం తప్పక మనదే ఘనవిజయం
స్వతంత్య్ర భారతయోధుల్లారా సవాలెదుర్కొని కదలండి

చరణం::4
భరతమాత పరువు నిల్పగా ఆ..
భరత వీర ప్రతిన దాల్పరా ఆ..
జయపతాక చేతబూనరా ఆ..
సమర విజయశంఖమూదరా ఆ..
సమర విజయశంఖమూదరా ఆ..

సారంగధర--1957-- రాగం::రాగేశ్రీ::


అన్నానా భామిని! ఏమని?
సంగీతం: ఘంటసాల.
రచన: సముద్రాల
గానం: ఘంటసాల, P.లీల.

రాగం::రాగేశ్రీ::

అన్నానా భామిని! ఏమని? ఎపుడైనా...(2)
అరవిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని - ఊ!
అరవిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
మాటవరసకెపుడైన అన్నాన భామిని ఎపుడైన

అన్నానా మోహన! ఏమని? ఎపుడైనా...(2)
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని - ఆహ!
తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా అన్నాన మోహన ఎపుడైన

లోకానికి రాజునైన నీ ప్రేమకు దాసుడనని(2)
మాటవరసకెపుడైన అన్నాన భామిని ఎపుడైన

నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమని ఆహ! అహహ(నవ్వు)...
ఆదమరచి ఎపుడైనా అన్నానా మోహన ఎపుడైన

అన్నాన మోహన ఎపుడైన
ఆ...ఆ...ఆ..

****************************************

వసంతసేన ~~ 1967


!! కొండలన్ని వెతికేను కోనలన్ని తిరిగేను !!
రచన: దాసరధి
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు.
గానం: ఘటసాల, జానకి.

కొండలన్ని వెతికేను కోనలన్ని తిరిగేను
చెలియా సఖియా నీకోసమే
రావే వయ్యారి నా వలపు మయూరి (2)
నవ్వులు చిందించి నటియించవే (2)

చెంతచేరి రావొయి చింతదీర్చి పోవోయి
వయసూ సొగసూ నీ కోసమే
నేడే వసంతం ఈ జగమున విరిసే
నేడే వసంతం నా మనసున విరిసే
కోయిల కొమ్మల్లొ కోయన్నది ఓ.. (2)

ఝుమ్మని రాగాలు పాడెను భ్రమరం
కమ్మని తేనెలనందించు కుసుమం
జల జల నాట్యాల ప్రవహించు నదులు
సాగరు కౌగిట చేరేను తుదకు

నెలరాజు నేడేల పిలిచేను కలువ
కలువకై జాబిల్లి కదిలీ వచ్చేను
వలచిన చెలికాని తలచేను చెలియ
చెలియను మురిపింప చేరేను ప్రియుడు

నిజమైన అనురాగమదియే కదా
ఆ.. నిజమైన అనురాగమిదియే కదా

చెంతచేరి రావొయి చింతదీర్చి పోవోయి
వయసూ సొగసూ నీ కోసమే
రావే వయ్యారి నా వలపు మయూరి (2)
నవ్వులు చిందించి నటియించవే (2)

ఓ సుందరీ..ఓ సుందరీ..ఓ సుందరీ..

^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!^!

ఆలీబాబా 40 దొంగలు--1970



శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం::B. విఠలాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, P. సుశీల.
తారాగణం::N.T. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ


పల్లవి::

ఆమె: నాలో నీవై నీలో నేనై
అతడు: నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము

!! ఆమె: నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!!

చరణం::1


ఆమె: పడమటి సూర్యుడు కన్నుమూసె
తూర్పున చంద్రుడు తొంగి చూసె
కారు చీకటి దారి లోనే
కాంతి విరబూసె

ఆమె: ఆ....
పెంచిన తోట మాలిని వీడి
పెరిగిన తోట తల్లిని వీడి
కన్నె మనసే తీగ లాగా
కాంతుని పెనవేసె, ప్రియ
కాంతుని పెనవేసె

!! ఆమె:నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!!
చరణం::2


ఆమె: నీలాకాశం నీడ లోన
నిండు మమతల మేడ లోన
గాలి లాగా పూల లాగా చేరి పోదాము

అతడు: ఆహ .... ఓహో ...
వలపులోన మలుపులు లేక
బ్రతుకులోన మెలికలు లేక
వాగులున్నా వంకలున్నా
సాగి పోదాము
అతడు, ఆమె: చెలరేగి పోదాము

!! ఆమె:నీలో నేనై నాలో నీవై
తీయని కలలే కందాము
ఎడబాయని జంటగ వుందాము
!!

అంతస్తులు--1965
















సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల,P. సుశీల


మారుబిహాగ్::రాగం

(హిందుస్తాని కర్నాటక )

పల్లవి::

నువ్వంటే నాకెందుకో..ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది

నువ్వంటే నాకెందుకో ..ఇంత ఇది
నువ్వంటే నాకెందుకో..ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది

చరణం::1

తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
మరునాడు మనసంత తానయినది..ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది..ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది

నువ్వంటే నాకెందుకో..ఇంత ఇది 
నువ్వన్నా నాకెందుకో..అదే ఇది..అదే ఇది..అదే ఇది 

చరణం::2

వయసులో పాకానికి వచ్చినది..తనువులో అణూణువున పొంగినది
వయసులో పాకానికి వచ్చినది..తనువులో అణూణువున పొంగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది..ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది..ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నువ్వంటే నాకెందుకో..ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది

ధర్మదాత--1966









సంగీతం::చలపతి రావ్
రచన::C.నారాయణ రెడి
గానం::ఘంటసాల,P.సుశీల



అతడు::- ఓం...పరమేశ్వరి....జగదీశ్వరి..
రాజేశ్వరి...కాళేశ్వరి...
ఇకనైన శాంతించవే....
మండోధరి...గుండోధరి..
నీలాంబరి...కాదాంబరి
నీదాసును కరుణించవే...

ఆమె::- నీ దండకం నేను విన్నానూ..
నీ అండగా నేను వున్నానూ..2
నీ హారతిని అందుకొన్నానూ..
నీ ముద్దు చెల్లించ వున్నానూ..2

అతడు::- పరమేశ్వరి..జగదీశ్వరి..
రాజేశ్వరి..కాళేశ్వరి..
ఇకనైన శాంతించవే...
మండోధరి..గుండోధరి..
నీలాంబరి..కాదాంబరి
నీదాసును కరుణించవే..

అతడు::- ఎన్నెన్ని పుణ్యాలు చేసానో
ఈ జన్మలో నిన్ను చూసానూ..2
చిలకమ్మ లెన్నెన్ని ఎదురైనా..2
తొలిచూపు నీపైనె వేసానూ..2

అతడు::- పరమేశ్వరి..జగదీశ్వరి..
రాజేశ్వరి..కాళేశ్వరి..
ఇకనైన శాంతించవే..
మండోధరి..గుండోధరి..
నీలాంబరి..కాదాంబరి
నీదాసును కరుణించవే..

ఆమె::- నా కళ్ళలో నిండి పోవాలీ
నువ్వు నా గుండెలో వుండి పోవాలీ..2

అతడు::- చెలికౌగిలి చెరసాల కావాలీ..2
కలకాలం బంధీనై పోవాలీ..2

అతడు::- పరమేశ్వరి...

ఆమె::- మూహు...

అతడు::- కాళేశ్వరి కళగేశ్వరి
హ్రుదయేశ్వరి మధనేశ్వరి
ఇకనైన శాంతించవే...
గాజేశ్వరి భాగేశ్వరి
వాగీశ్వరి నాగేశ్వరి
నీ దాసుని కరుణించవే...

ధర్మదాత--1966






సంగీతం::చలపతి రావ్
రచన::C.నారాయణ రెడి
గానం::ఘంటసాల

శ్రీ:::రాగం

జో..లాలి..జో...లాలి
లాలి నా చిట్టి తల్లి
లాలి నను గన్న తల్లి
లాలి బంగారు తల్లి
లాలి నా కల్పవల్లి

జో లాలి

చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగ నే చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగ నే చూడలేను
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా

జో లాలి

రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపల నిన్ను కాపాడు కోనా
కనుపాపల నిన్ను కాపాడు కోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా

జో లాలి

అంతస్తులు--1965



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::భానుమతి


దులపర బుల్లొడో హోయ్ హోయ్
దులపర బుల్లొడొ
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కల్లతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
1,2,3 చెప్పి దులపర బుల్లొడో దుమ్ము దులపర బుల్లోడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లోడో హోయ్

సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
సిరిగల చుక్కల చీర కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని
వరాల బొమ్మ..ముద్దుల గుమ్మ కాలేజికి కదిలిందంటే
వెకిలి వెకిలిగ వెర్రి వెర్రి గ వెంటపడే రౌడి ల పట్టుకొని..పట్టుకొని
తలాంగుతదిగిన తకతోం తోం అని
తలాంగుతదిగిన తకతోం తోం అని
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

సంప్రదాయమగు చక్కని పిల్ల..సాయంకాలం సినిమా కొస్తే..వస్తే
సంప్రదాయమగు చక్కని పిల్ల సాయంకాలం సినిమా కొస్తే
ఇదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులొ బైటాయించుకొని ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే శిఖండి గాళ్ళను ఒడిసి పట్టుకొని
చింత బరికను చేత బట్టుకొని
చింత బరికను చేత బట్టుకొని
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

రోడ్ పట్టని కారులున్నవని..మూడంతస్తుల మేడలున్నవని
రోడ్ పట్టని కారులున్నవని..మూడంతస్తుల మేడలున్నవని
డబ్బు చూసి ఎటువంటి ఆడది
తప్పకుండ తమ వళ్ళో పడునని
ఈలలు వేసి..సైగలు చేసె..గోల చేయు సొగ్గాల్లను పట్టి..పట్టి
వీపుకు బాగా సున్నం బెట్టి
వీపుకు బాగా సున్నం బెట్టి
దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హొయ్

మాయ మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరనాల్లకు పొతే..పొతే
జనం ఒత్తిడికి సతమతమవుతు దిక్కు తోచక తికమకపడితే..అయ్యయ్యొ
సందు చూసుకొని సరసాలకు దిగు గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమారమణ గోవిందా ఊ రమారమణ గోవిందా హారి

దులపర బుల్లొడో
దుమ్ము దులపర బుల్లొడ
చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే
మలప రాములను పిలక బట్టుకుని
దులపర బుల్లొడో ఓ ఓ ఓ హొయ్ హోయ్

అంతస్తులు--1965



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము

తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
మనసులోని చల్లని మమతకోసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
కల్లకపటమెరుగని మనసుకోసమ

దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
దాపరికం ఎరుగని మనిషికోసము
దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
దాపరికం ఎరుగని మనిషికోసము
దాగని యవ్వనం ఎవరికోసము
దాచుకొని ఎలుకొనే ప్రియునికొసము

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
కల్లకపటమెరుగని మనసుకోసము

పొద్దంత కలవరింత ఎవరికోసము
నిద్దురైన రానీ నీకొసము
పొద్దంత కలవరింత ఎవరికోసము
నిద్దురైన రానీ నీకొసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
కల్లకపటమెరుగని మనసుకోసము

నింగి నేల కలిసినది ఎందుకోసము
నీవు నన్ను చేరదీసినందుకోసము
నింగి నేల కలిసినది ఎందుకోసము
నీవు నన్ను చేరదీసినందుకోసము
నేల మీద ఒక్కరై సాగిపోదము
నింగిలోన చుక్కలై నిలిచిపోదము

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
మనసులోని చల్లని మమతకోసము

అంతస్తులు--1965::శివరంజని::రాగం




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
శివరంజని::రాగం 

ఓ....ఓ...ఓ....ఓఓ...ఓఓఓ...ఓఓఓఓఓ
నిను వీడని నీడను నేనే..కలగా మెదిలే కథనేనే
నిను వీడని నీడను నేనే..కలగా మెదిలే కథనేనే
నిను వీడని నీడను నేనే....

నునులేతపూవునై విరిసీ..నిను నమ్మి చేరినా వలచి
నునులేతపూవునై విరిసీ..నిను నమ్మి చేరినా వలచి
వలపంత ధుళిలో కలిసీ..వలపంతధుళిలో కలిసీ
బ్రతుకే బలియై ముగిసే...
నిను వీడని నీడను నేనే..కలగా మెదిలే కథనేనే
నిను వీడని నీడను నేనే....

ఓ....ఓ...ఓ....ఓఓ...ఓఓఓ...ఓఓఓఓఓ

బాలమిత్రుల కధ ~~ రాగం::హిందోళ ~1972







గానం::ఎస్. జానకి
రచన::ఆత్రేయ
సంగీతం::సత్యం


రాగం::హిందోళ

గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే

ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే

ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల...

!! గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి.....

!! హోయ్ ..గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది

ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద

గూళ్ళు రెండున్నాయి !!

మంచి కుటుంబం--1968::హిందోళం::రాగం















హిందోళం::రాగం
సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర


గానం::P.సుశీల
:::

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం

!! మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం !!


రాధను ఒక వంక లాలింతునే
సత్యభామను మురిపాల తేలింతునే
రాధను ఒక వంక లాలింతునే
సత్యభామను మురిపాల తేలింతునే
మనసార నెరనమ్ము తనవారినే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ...
మనసార నెరనమ్ము తనవారినే
కోటి మరులందు సుధలందు తనియింతునే..

మనసే అందాల బృందావనం
దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం
మాద మగస
దామ గమద
నీద నిసమ
గమ మద దనినిస
నిసమద మగస
గమ దనిసగ బృందావనం
సమగస గమదని
గదమగ మదనిస
మనిద మదనిస
ఆ...........

!! మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం .......... !!

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^