Sunday, September 09, 2012

తోడు నీడ--1965




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
దర్శకత్వం::ఆదుర్తి సుబ్బారావు
గానం::భానుమతి
తారాగణం::N.T..రామారావు,S.V.రంగారావు,P.భానుమతి,జమున,గీతాంజలి,నాగయ్య 

పల్లవి::

ఎన్నో రాత్రులు వస్తాయి
కాని యిదియే తొలిరేయి
ఎన్నో బంధాలున్నాయి
కానీ యిది శాశ్వతమోయి

ఎన్నో రాత్రులు వస్తాయి
కాని యిదియే తొలిరేయి

చరణం::1

పక్కన అతడు నిలబడితే
పరువం ఉరకలు వేస్తుంది
వయసుకు తగ్గది ఆ మొగ్గు
వల్లమాలినది ఈ సిగ్గు

చరణం::2

వస్తాడమ్మా నీరేడు
ఏమిస్తాడో రుచి చూడు
మల్లెల మంచం పిలిచింది
ఉయ్యల త్వరలో రానుంది

ఎన్నో రాత్రులు వస్తాయి
కాని యిదియే తొలిరేయి

చరణం::3

ఎవరో చెబితే విన్నాను
విన్నది నీతో అన్నాను
నాకూ యింతే తెలిసినది
నీకే తెలియును మిగిలినది

ఎన్నో రాత్రులు వస్తాయి
కాని యిదియే తొలిరేయి

తోడు నీడ--1965


సంగీతం::K.V.మహదేవన్
రచన::సముద్రాల
దర్శకత్వం::ఆదుర్తి సుబ్బారావు
గానం::P.సుశీల

తారాగణం::N.T..రామారావు,S.V.రంగారావు,P.భానుమతి,జమున,గీతాంజలి,నాగయ్య 

పల్లవి::

ఆయీ ఆయీ ఆయీ ఆయీ
అయి అయి అయి అయి ఆయీ
ఒలూలు ఆయీ..అయీ అయీ అయీ ఆయీ

అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ 

అదమరచి హాయిగ ఆడుకొమ్మ
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ 

అదమరచి హాయిగ ఆడుకొమ్మ
ఆడుకొని ఆడుకొని అలసిపొతివా

ఆడుకొని ఆడుకొని అలసిపొతివా
అలుపుతీర బజ్జోమ్మ అందాలబొమ్మ

అలుపుతీర బజ్జోమ్మ అందాలబొమ్మ
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ 

అదమరచి హాయిగ ఆడుకొమ్మ

చరణం::1

అమ్మలు కన్నులు తమ్మి పూవుల్లు
అమ్మలు కన్నులు తమ్మి పూవుల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు
వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు
కన్నీరు రానీకు కరుగు నెడదల్లు
ఆయీ ఆయీ ఆయీ ఆయీ.
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ 

అదమరచి హాయిగ ఆడుకొమ్మ

చరణం::2

కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుల్లు
కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుల్లు
వెయ్యాలి పాపాయి తప్పటడుగుల్లు
వెయ్యాలి పాపాయి తప్పటడుగుల్లు
చెయ్యాలి ఆ పైన గొప్ప చేష్టలు
ఆయీ ఆయీ ఆయీ ఆయీ
లాలి లాలి లాలి లాలి
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ