Sunday, July 22, 2012

బొబ్బిలి పులి--1982::శివరంజని::రాగం



సంగీతం::J.V.రాఘవులు
రచన::దాసరినారాయణ రావ్
గానం::S.P.బాలు


శివరంజని::రాగం 

పల్లవి::


జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో..ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

చరణం::1

నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టే కాలే వరకురా....
ఆ ఋణం తలకొరివితో తీరేనురా
ఈ ఋణం ఏ రూపాన తీరేనురా
ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

చరణం::2

గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధేంటో
ఈ గుండె రాయి కావాలి
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం
ఈ మనుషుల కోసం

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి

బొబ్బిలి పులి--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::దాసరి
గానం::S.P.బాలు


శ్లోకం::
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్క్రుతాం
ధర్మ సంస్తాపనార్దాయ సంభవామి యుగే యుగే

పల్లవి::

సంభవం నీకే సంభవం...సంభవం నీకే సంభవం
ధర్మానికి నువ్వే రాజువై..న్యాయానికి నువ్వే మూర్తివై
ధర్మానికి నువ్వే రాజువై..న్యాయానికి నువ్వే మూర్తివై
అవినీతినే అణచివెయ్..అన్యాయమే తుడిచివెయ్
అది నీకే సంభవం..సంభవం సంభవం

చరణం::1

తల్లి కడుపు పండగా..పుట్టినావు కొడుకుగా
తల్లి కట్టే కాలగా..చేరినావా కాటికి
చెల్లి వలపు పంటగా..వీడినావు ప్రేమని
చెల్లి గుండె రగలగా..ఆర్పినావా మంటను
ఆ రగిలే మంటలు ఎక్కడివి???
ఆ పగిలే గొంతులు ఎవ్వరివి???
నీ తల్లివా నీ చేల్లివా...నీ తల్లివా నీ చేల్లివా
దిక్కులేని అనాధలవా..రోడ్డు పక్క అభాగ్యులవా
ఆ పాపుల పాలిటి..పులివై బెబ్బులివై
బొబ్బిలిపులివై..బొబ్బిలిపులివై సాగిపో..
సంభవం నీకే సంభవం...సంభవం నీకే సంభవం

రక్తానికి రక్తం సిద్దాంతం
ప్రాణానికి ప్రాణం సమాధానం
గుండెకు గుండె మార్పిడి
స్వార్ధానికి స్వార్ధమే దోపిడీ
అసత్యానికి నాలుక కోసెయ్
అధర్మానికి చేతులు నరికెయ్
అన్యాయానికి అక్రమానికి..కాళ్ళు చేతులు తీసి
కన్నెపిల్లలను పిల్ల తల్లులను తార్చే
దిగజార్చే తెగమార్చే తార్పుడు గాళ్ళను
రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి
మసి పూసేసే కను మూసేసే దేశద్రోహులను
చీల్చాలి చెండాడాలి..చీల్చి చీల్చి చెండాడాలి

బొబ్బిలి పులి--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::దాసరి
గానం::S.P.బాలు, P.సుశీల


పల్లవి::

తెల్లచీరలో ఎన్ని సిగ్గులో..
మల్లెపూలలో ఎన్ని పిలుపులో..
పిలుపు పిలుపు లో ఎన్ని వలపులో..
వలపు తలపు లో ఎన్ని మలుపులోఓఓ..

తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా
తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా

సూరీడొచ్చీ రమ్మంటాడే చందమామా
సూరీడొచ్చీ రమ్మంటాడే చందమామా
చూసిందల్లా ఇమ్మంటాడే చందమామా

తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా

చరణం::1

పువ్వు పువ్వు లో ఎన్ని రేఖలో..రేఖ రేఖ లో ఎన్ని రూపులో
పువ్వు పువ్వు లో ఎన్ని రేఖలో..రేఖ రేఖ లో ఎన్ని రూపులో
రూపు రూపు లో ఎన్ని చూపులో..చూపు చూపు లో ఎన్ని ఆశలో
ఆశె నువ్వైతే నువ్వే నేనౌతా..నేనే నువ్వవుతా

తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా
తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా

చరణం::2

సంజె సంజెకూ ఎన్ని రంగులో..రంగు రంగు లో ఎన్ని కాంతులో
సంజె సంజెకూ ఎన్ని రంగులో..రంగు రంగు లో ఎన్ని కాంతులో
సృష్టి సృష్టి కీ ఎన్ని మార్పులో..నిన్న రేపు కీ ఎన్ని చేర్పులో
నిన్నే నువ్వైతే...నేడే నేనౌతా..నేనే నువ్వవుతా

తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా
సూరీడొచ్చీ రమ్మంటాడే చందమామా
చూసిందల్లా ఇమ్మంటాడే..హా..చందమామా
తెల్లా తెల్లని చీరలోనా చందమామా
పట్ట పగలు వచ్చినావే చందమామా

బొబ్బిలి పులి--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.P.బాలు, P.సుశీల


పల్లవి::

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాదే పిల్లో
నీ గుండె చెదిరిపోతాదే పిల్లో.నీ గుండె చెదిరిపోతాదే పిల్లో

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

చరణం::1

వలపులో అలజడి వాటేసి నేనూపుకుంట
తొలకరి తొలిరుచి కాటేసి నే చూసుకుంట
కలయిక కల దిక కాదంటు కవ్వించుకుంట
మనుగడ ముడివడ లగ్గాలు పెట్టించుకుంట

జోరు మీద ఉన్నవాణ్ణి జోలపాటకాగనోణ్ణి
జోడు ఉన్న కోడెగాణ్ణి నీకు తగ్గ నీటుగాణ్ణి
కోరికుంటే చూసుకో సోకులాడి కొంటె దూకులాడి
నన్ను ముద్దులాడి

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాదే పిల్లో
నీ గుండె చెదిరిపోతాదే పిల్లో.నీ గుండె చెదిరిపోతాదే పిల్లో

చరణం::2

అలిగినా తొలగినా అందాలు నేనందుకుంటా
కులుకులు తళుకులు చూపుల్లో ఆరేసుకుంటా
పరువపు ఉరవడి పాటల్లో పండించుకుంటా
పరుగిడి చెలి ఒడి సందేళ నే చేరుకుంటా
ఏరులాంటి చిన్నదాన్ని ఎవరులేక ఉన్నదాన్ని
ఎల్లువైన పడుచుదాన్ని పెళ్ళిగాని పిల్లదాన్ని
ఓపికుంటే ఆదుకో ఒడ్డులాగ
పూలచెండులాగ పక్కదిండు లాగా

ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

హో..ఎడ్డెమంటే తెడ్డెమంటె
నడ్డి ఇరిగిపోతాది గుట్టు బయటపడతాది పిల్లగో
నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో..నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో

బొబ్బిలి పులి--1982



సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


అది ఒకటో నంబరు బస్సు
దాని యవ్వారం నాకు తెలుసు
అది ఒకటో నంబరు బస్సు
దాని యవ్వారం నాకు తెలుసు
దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు
దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు
రైటంటే చాల్లు రయ్యి రయ్యిన రైకలపుడి హాల్టు
అది బస్సు కాదు మిస్సు
అబ్బ చూడు దాని కస్సు బస్సు

ఇది ఒకటో నంబరు మిస్సు
దీని వయ్యారం నైసు నైసు
ఇది ఒకటో నంబరు మిస్సు
దీని వయ్యారం నైసు నైసు
దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు
దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు
స్టార్ట్ అయితే చాలు సందేవేళకి
కౌగిళ్ళపల్లిలో హాల్టు
అది బస్సు కాదు మిస్సు
అబ్బ మిస్సు కాదు మిస్సు కిస్సు
అది బస్సు కాదు మిస్సు
అబ్బ మిస్సు కాదు మిస్సు కిస్సు

చరణం::1

చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ
చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యరాలన్నీ
ఆహా..చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ
చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యరాలన్నీ

పో ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసి
నో నో నో నో అన్నా ఆ మూడు ముళ్ళేసి

అరే..పో ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసి
నో నో నో నో అన్నా ఆ మూడు ముళ్ళేసి

దాంది జాస్మిన్ను వైట్ అరెరే నాకు తగ్గ హైటు
హైటు కట్టి పెట్టు పైట కొంగు పట్టు
అవుతుందిలే ఆల్ రైటు..రైట్..రైట్..

అది బస్సు కాదు మిస్సు
అబ్బ చూడు దాని కస్సు బస్సు

ఆయ్...అది బస్సు కాదు మిస్సు
అబ్బ చూడు దాని కస్సు బస్సు

ఇది ఒకటో నంబరు మిస్సు
దీని వయ్యారం నైసు నైసు
దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు
స్టార్ట్ అయితే చాలు సందేవేళకి
కౌగిళ్ళపల్లిలో హాల్టు..హోర్రే..హోల్డన్

చరణం::2

దిద్దుకో అందమందుకో తై టక్కరి కిలాడీ
ఎందరో ఏమారినా అల బిత్తరి కిలేడి
హే హే హే..దిద్దుకో అందమందుకో తై టక్కరి కిలాడీ
ఎందరో ఏమారినా అల బిత్తరి కిలేడి

వా వారేవా దాని వన్నెల్లో కన్నేసి
జ జలజ అని పేరెట్టి పిలిచేసి
ఆహా..వా వారేవా దాని వన్నెల్లో కన్నేసి
జ జలజ అని పేరెట్టి పిలిచేసి

అరె కొట్టి చూడు సైటు
దాని కొంప కాడ బీటు
నీ ప్రేమ టిక్కెట్టు కాదంటే ఇక్కట్టు
చేరుకోర పెళ్లి రూటు..అర్రెర్రెర్రె..హ్హాహ్హా..

అది బస్సు కాదు మిస్సు
అబ్బ చూడు దాని కస్సు బస్సు
మ్మ్హూ..అది బస్సు కాదు మిస్సు
అబ్బ చూడు దాని కస్సు బస్సు

ఇది ఒకటో నంబరు మిస్సు
దీని వయ్యారం నైసు నైసు
దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు
హ్హహ్హా..దీని వయ్యారం నైసు నైసు
దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు
దీని వయ్యారం నైసు నైసు
దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు
ఆ..స్టార్ట్ అయితే చాలు సందేవేళకి
కౌగిళ్ళపల్లిలో హాల్టు..హోర్రే..హోల్డన్...