Tuesday, January 09, 2007

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్--1976















సంగీతం::పెండ్యల నాగేశ్వరరావ్ 
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల 
దర్శకత్వం::బాపు 
తారాగణం::కృష్ణ,జయప్రద,పద్మనాభం,జగ్గయ్య,G.వరలక్ష్మి,రమాప్రభ,కాంతారావు,
అల్లు రామలింగయ్య

పల్లవి::

ఏమని పిలువనురా..నిను నే ఏవిధి కొలువనురా
ఏమని పిలువనురా..నిను నే ఏవిధి కొలువనురా
అండ పిండ బ్రహ్మాండమంతటా..నిండియున్న ఓ స్వామీ
నిను నే ఎక్కడ వెదుకుదురా..ఆఆ..ఏవిధి కొలువనురా
అంగ రంగ సర్వాంగమంతటా..నిండియున్న..ఆఆఆ 
ఏమని...పిలువనురా

చరణం::1

రంగు రంగుల పువ్వులలో..నీ రమ్యరూపమే చూసేరు
ఆఆఆ..రంగు రంగుల పువ్వులలో..నీ రమ్యరూపమే చూశాను
పున్నమి జాబిలి వెన్నెలలో..నీ ఉనికిని తెలియగజాలేరు 
ఆఆఆ..పున్నమి జాబిలి వెన్నెలలో..నీ ఉనికిని  కనుగొన గలిగాను
ఆఆఆ..గల గల పారే సెలయేరులలో..ఊఊ..ఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆఆ 
గల గల పారే సెలయేరుల..నీ గానమునే..వినగలిగాను
కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో..కొలువై యున్నావట స్వామీ
ఏ గతి చూతునురా..ఆఆఆఆఆ..ఏవిధి కొలువనురా 

చరణం::2

అంతేలేని ఆకసమే..నీ ఆలయమని పూజించేరు
అందాలొలికే అరవిందాలే..నీ చిరునవ్వని ఎంచాను
నీవే లేనీ తావేలేదని..నిమిష నిమిషము తలచేరు
నాలో నిన్నే చూసిన నేను..ఎక్కడ వెదుకుదురా స్వామీ..ఈఈఈఈ
ఏవిధి కొలువనురా..ఆఆఅ..ఏమని పిలువనురా..ఆ