సంగీతం::C.రామ చంద్ర
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల,మొహమద్ రఫి
సిపాయీ సిపాయీ..
సిపాయీ సిపాయీ..
నీకై ఎంత ఎంత వేచి వేచి వున్నానో
ఈ వాలుకనుల నడుగు అడుగు చెపుతాయీ
సిపాయీ..ఓ..సిపాయీ
హసీనా హసీనా
హసీనా హసీనా
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూల మనసునడుగు అడుగు ఇకనైనా
హసీనా..ఓ..హసీనా
జడలోని మల్లెలు జారితే
నీ ఒడిలో ఉన్నాననుకొన్నా..
చిరుగాలిలో కురులూగితే
చిరుగాలిలో కురులూగితే
నీ చేయి సోకెనని అనుకొన్నా..
ఆ...మల్లెలలో కదలాడినవి
నా కలవరింపులే..
ఆ గాలిలో చెలరేగినవి
ఆ గాలిలో చెలరేగినవి
నా నిట్టూరుపులే...
హసీనా..ఓ..హసీనా
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో
ఈ వాలు కనుల నడుగు అడుగు చెపుతాయీ
సిపాయీ..ఓ..సిపాయీ
గడియిసుకలో గీసిన గీతలు
అలతాకితే మాసిపోతాయీ..
ఎదలోన వ్రాసిన లేఖలు
ఎదలోన వ్రాసిన లేఖలు
బ్రతుకంతా ఉండిపోతాయీ..
ఆ...లేఖలలో ఉదయించినవి
నా భాగ్యరేఖలే..ఏ...
మన ఊపిరిలో పులకించినవి
మన ఊపిరిలో పులకించినవి
వలపు వాకలే.....
సిపాయీ సిపాయీ..
సిపాయీ సిపాయీ..
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూల మనసునడుగు అడుగు చెపుతాయీ
హసీనా..ఓ..హసీనా
సిపాయీ..ఓ..సిపాయీ
హసీనా..ఓ..హసీనా