Monday, January 03, 2011

భువనేశ్వరి--1979



సంగీతం::సత్యం
రచన::సినారె 
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

ఏమని పిలవాలి..ఆహా..హాహాహా 
నిన్నేమని పిలవాలి..ఆహా..హాహాహా
నవ మల్లికవో..కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో
ఏమని పిలవాని..ఆ..ఆ

చరణం::1

నీ చిరునవ్వులు సోకిన చాలు
సూర్యుడు వెన్నెల కాయునులే
నీ నును పైటను తాకిన చాలు
గాలికి గిలిగింత కలుగునులే
నీ పాదాలు మోపిన చాలు..శిలలైనా విరబూయునే

ఏమని పిలవాలి..ఆహా..హాహాహా 
నిన్నేమని పిలవాలి..ఆహా..హాహాహా
నవ మల్లికవో..కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో
ఏమని పిలవాని..ఆ..ఆ

చరణం::2

నీ కనుపాపల నీలిమలోనా ఆకాశాలే  దాగెనులే..అహా..హాహా
నీ మెలివంపుల నిగ్గులలోన తొలకరి మెరుపులే తూగెనులే..ఆ..హాహా
నీ జతలోనా..నీ శృతిలోనా..మన బ్రతుకే పయనించాలిలే

ఏమని పిలవాలి..ఆహా..హాహాహా  
నిన్నేమని పిలవాలి..ఆహా..హాహాహా
నవ మల్లికవో..కవి గీతికవో
నను వలచే ప్రియ రాధికవో
ఏమని పిలవాలి..ఆ..ఆ