సంగీతం::సత్యం రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::చిరంజీవి,సుమలత,గొల్లపూడిమారుతిరావు,K.సత్యనారాయణ. పల్లవి:: నీ రూపు మారింది గోపాలుడా లేని నాజూకు పెరిగింది నా రాముడా పూలఉయ్యాల ఊపాలా..ఆ ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా హా..ఆ బాలుడా..గోపాలుడా హ్హా..హ్హా..హ్హా ఈ రాధ కన్నేస్తే గోపాలుడే మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే చరణం::1 మెరిసే..నీ కళ్ళలోనా గండు మీనై నేనీది రానా..ఆ..ఆ వలపే..నీ గుండెలోనా మురళి పిలుపై నే ఊగిపోనా మెరిసే నీ కళ్ళలోనా..ఆ గండు మీనై నేనీది రానా..ఆ..ఆ ఓ..ఓ..వలపే నీ గుండె లోనా మురళి పిలుపై..నే ఊగిపోనా నీ కమ్మని పెదవి పిల్లనగ్రోవి కావాలంటనా అది ఊదుతుంటే ఒళ్ళే మరచి ఊగుతుంటాను ఆహ..నీ రూపు మారింది గోపాలుడా లేని నాజూకు పెరిగింది నా రాముడా వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే చరణం::2 ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా నదిలా ఉప్పొంగిపోతే..నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ ఎదురుగ నీవుండిపోతే..జీవనదిలా ఉప్పొంగిపోనా ఆ..ఆ..నదిలా ఉప్పొంగిపోతే నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ హద్దులు దాటి..మబ్బులు మీటి..ఆడుకుందామా ముద్దులతోనే..మిద్దెలు కట్టి ముచ్చటగుందామా ఆహ..నీ రూపు మారింది గోపాలుడా లేని నాజూకు పెరిగింది నా రాముడా పూలఉయ్యాల ఊపాలా..ఆ ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా హా..ఆ బాలుడా..గోపాలుడా హ్హా..హ్హా..హ్హా ఈ రాధ కన్నేస్తే గోపాలుడే మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే
సంగీతం::చక్రవర్తి రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::P.సుశీల తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,సుజాత,జగ్గయ్య,జయసుధ,జయప్రద,ప్రభాకర్‌రెడ్డి పల్లవి:: ఏడంతస్తుల..మేడ ఇది వడ్డించిన..విస్తరిది ఏడంతస్తుల..మేడ ఇది వడ్డించిన..విస్తరిది ఏమీ లేక..ఉన్నదొక్కటే నాకు మీరు..మీకు నేను నాకు మీరు..మీకు నేనూ చరణం::1 పడుచుతనపు ఉడుకును కలిపి గంజి నీళ్ళు..తాగిస్తుంటే కుర్ర వలపు..వర్రతనంతో మిరపకాయ..తినిపిస్తుంటే పడుచుతనపు ఉడుకును కలిపి గంజి నీళ్ళు..తాగిస్తుంటే కుర్ర వలపు..వర్రతనంతో మిరపకాయ..తినిపిస్తుంటే చాప కన్న..చదరే మేలని చతికిలపడి..అతుకుతు ఉంటే ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే ఏయ్..నిదరనే నిదరపొమ్మంటుంటే..ఏ ఏ ఏ వెన్నెల మల్లెల..మంచమిది ఎన్నో జన్మల..లంచమిది మూడు పొద్దులు ముద్దు ముచ్చటే నాకు మీరు..మీకు నేను నాకు మీరు..మీకు నేనూ ఏడంతస్తుల..మేడ ఇది వడ్డించిన..విస్తరిది చరణం::2 పాయసాన..గరిటై తిరిగే పాడు బ్రతులులెందుకు మనకు పాలలోన..నీరై కరిగే బంధమొకటి చాలును కడకు పాయసాన..గరిటై తిరిగే పాడు బ్రతులులెందుకు మనకు పాలలోన..నీరై కరిగే బంధమొకటి చాలును కడకు చావు కన్నా..బ్రతుకే మేలని తెలిసి కలిసి..మసులుతు ఉంటే ప్రేమకన్న పెన్నిధి..లేదని తెలుసుకో.. ఏయ్..తెలుసుకో మనసు నీదంటుంటే..ఏ ఏ ఏ ఎండ వానల..ఇల్లు ఇది ఎండని..పూపొదరిల్లు ఇది రేయి పగలు..ఆలు మగలే నాకు మీరు..మీకు నేను నాకు మీరు..మీకు నేనూ ఏడంతస్తుల..మేడ ఇది వడ్డించిన..విస్తరిది ఏమీ లేక..ఉన్నదొక్కటే నాకు మీరు..మీకు నేను నాకు మీరు..మీకు నేనూ