Wednesday, December 25, 2013

రాజాధిరాజు--1980




సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::P.సుశీల

పల్లవి::

రాజ్యము బలము మహిమ నీవే నీవే
జవము జీవము జీవనమీవే నీవే
రాజ్యము బలము మహిమ నీవే నీవే
జవము జీవము జీవనమీవే నీవే
మరియ తనయ మధుర హృదయ
మరియ తనయ మధుర హృదయ
కరుణామయా! కరుణామయా

చరణం::1

అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే
మనిషి కన్నుమిన్ను కానబోడే మో
కడుపుకు చాలినంత కబళమీయకుంటే
మనిషి నీతినియమం పాటించడేమో
మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి ప్రేమ తృప్తినిచ్చి
మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి ప్రేమ తృప్తినిచ్చి

గుండె గుండె నీ గుడి దీపాలై
అడుగు అడుగు నీ ఆలయమయ్యే
రాజ్యమీవయ్యా..నీ రాజ్యమీవయ్యా



చరణం::2

అర్హత లేనివారికి అధికారం ఇస్తే
దయ ధర్మం దారి తప్పునేమో
దారి తప్పినవారిని చేరదీయకుంటే
తిరిగి తిరిగి తిరగబడతారేమో
తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి
తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి

తనువు తనువు నిరీక్షణశాలై
అణువు అణువు నీ రక్షణశాలయ్యే
బలమీవయ్యా..ఆత్మబలమీవయ్యా



చరణం::3

శిలువపైన నీ రక్తం చిందిననాడే
శమదమాలు శోధించెనుగాదా
నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి
శోకం మరణం మరణించెను గాదా
చావు పుటుక నీ శ్వాసలని
దయాదండన పరీక్షలని
చావు పుటుక నీ శ్వాసలని
దయాదండన పరీక్షలని

ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని
సత్యం మార్గం సర్వం నీవని
మహిమ తెలుపవయ్యా
నీ మహిమ తెలుపవయ్యా