సంగీతం::శంకర్-జైకిషాన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,శారద
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత
పల్లవి::
కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు
హాయ్ సందిట్లో బందీవై చూడు
సయ్యాటలాడి...చూడు
హోయ్..కళ్ళలో కళ్ళు పెట్టి చూశా
గుండెల్లో గుండె కలిపి..చూశా
సందిట్లో బంధీనై..పోతా
సందిట్లో..బంధీనై పోతా
సయ్యాట...వేళ కాదు
చరణం::1
కానుకా ఇవ్వనా..వద్దులే దాచుకో
కోరికా చెప్పనా..అహ..తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు..వుండవా హద్దులు
కాదులే కలిసిపో..అహ..నవ్వరా నలుగురు
కావాలి కొంత చాటు..హోయ్
కళ్ళలో కళ్ళు పెట్టి..చూడు
గుండెల్లో గుండె కలిపి..చూడు
సందిట్లో బందీవై..చూడు
హాయ్..సందిట్లో బందీవై చూడు
సయ్యాటలాడి..చూడు
హోయ్..కళ్ళలో కళ్ళు పెట్టి..చూశా
గుండెల్లో గుండి కలిపి..చూశా
సందిట్లో బంధీనై..పోతా
సందిట్లో బంధీనై..పోతా
సయ్యాట వేళ..కాదు
చరణం::2
నువ్వు నా జీవితం..నువ్వు నా ఊపిరి
నువ్విలా లేనిచో..ఏండలో చీకటి
పాలలో తేనెలా..ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో..ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు
హోయ్..కళ్ళలో కళ్ళు పెట్టి..చూశా
గుండెల్లో గుండి కలిపి..చూశా
సందిట్లో బంధీనై..పోతా
సందిట్లో బంధీనై..పోతా
సయ్యాట వేళ..కాదు
కళ్ళలో కళ్ళు పెట్టి..చూడు
గుండెల్లో గుండె కలిపి..చూడు
సందిట్లో బందీవై..చూడు
హొయ్..సందిట్లో బందీవై చూడు
సయ్యాటలాడి..చూడు
లలల్ల్ల..లాల్లల్లాల్లా..లలలా