Saturday, May 24, 2008

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,K.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

దాక్కో దాక్కో దాక్కో దాక్కో
లాక్కో లాక్కో లాక్కో లాక్కో 
దాక్కో దాక్కో దాక్కో దాక్కో
లాక్కో లాక్కో లాక్కో లాక్కో 
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో 
దాక్కోని దాక్కోని నన్ను లాక్కో
దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరికి లాక్కో
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో
దాక్కోని దాక్కోని నన్ను లాక్కో
దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరికి లాక్కో
లాక్కో లాక్కో లాక్కో లాక్కో

చరణం::1

దాచుకున్న వరకే సొగసు విలువ
దోచుకున్న నాడే మనసు విలువ
దోపిడి దొంగవు నీవై పోయి
దోపిడి దొంగవు నీవై పోయి
దొంగను దోపిడి చేసేయ్‌ చేసేయ్‌   
దాక్కో దాక్కో దాక్కో దాక్కో
లాక్కో లాక్కో లాక్కో లాక్కో 

చరణం::2

పొదలో వున్నవి రెండు పువ్వులు
పొంచి పొంచి వున్నవి రెండే తుమ్మెదలు
పొదలో వున్నవి రెండు పువ్వులు
పొంచి పొంచి వున్నవి రెండే తుమ్మెదలు
ఏ తుమ్మెద ఏ పువ్వుదో తెలియదు
ఏ తుమ్మెద ఏ పువ్వుదో తెలియదు
తోటమాలి చెపితే కుదరదు కుదరదు         
దాక్కో దాక్కో దాక్కో దాక్కో
లాక్కో లాక్కో లాక్కో లాక్కో 
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో 
దాక్కోని దాక్కోని నన్ను లాక్కో
దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరికి లాక్కో

చరణం::3

పడుచుదనంలోనే వున్నది పరుగు
వలపు పొంగులోనే వున్నది వురుకు
పడుచుదనంలోనే వున్నది పరుగు
వలపు పొంగులోనే వున్నది వురుకు
పగ్గాలన్నవి లేనే లేవు
పగ్గాలన్నవి లేనే లేవు
హద్దుల కెన్నడు ఆగవు ఆగవు   
దాక్కో దాక్కో దాక్కో దాక్కో
లాక్కో లాక్కో లాక్కో లాక్కో 
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో
కౌగిల్లో దాక్కో కళ్ళల్లొ దాక్కో 
దాక్కోని దాక్కోని నన్ను లాక్కో
దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరికి లాక్కో

మాయదారి మల్లిగాడు--1973


















సంగీతం::K.Vమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల


తలకి నీల్లోసుకొని
కురులారబోసుకొని
నిలుసుంటే నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది

తలకి నీల్లోసుకొని
తడియార బెట్టుకొని నిలుసుంటే
నివు నిలుసుంటే నా మనసు నిలవనంటది
ఎంత రమ్మన్న నిన్నొదలి రానంటది

పొద్దుపోని సూరీడూ
పోంచి పోంచి సూసుంటే
పొద్దుపోని సూరీడూ
ముద్దుమొగం మీద నీటి
ముత్తాలు మెరుస్తుంటే
సుగసులకే బానిసను పిల్లోయ్
నీ సొగసులకే బానిసను పిల్లోయ్

తడిసి తడిసి నీళ్ళల్లో
నీ బిరుసెక్కిన కండరాలు
తడిసి తడిసి నీళ్ళల్లో
నీ బిరుసెక్కిన కండరాలు
నీరెండ ఎలుగులో
నిగా నిగా మంటుంటే
మగసిరికి బానిసను మావా
నీ మగసిరికి బానిసను మావా

తలకి నీల్లోసుకొని
కురులారబోసుకొని
నిలుసుంటే
నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది

ఆరీ ఆరని కోకా
అరగొరగ సుత్తుకొంటే
ఆరీ ఆరని కోకా
అరగొరగ సుత్తుకొంటే
దాగీ దాగని అందం
దా దా అంటుంటే
దాహమేస్తున్నది పిల్లోయ్
సెడ్డ దాహమేస్తున్నాది పిల్లోయ్

సూస్తున్న నీ కళ్ళూ
సురకత్తులవుతుంటే
సూస్తున్న నీ కళ్ళూ
సురకత్తులవుతుంటే
ఓపలేక నావొళ్ళు
వంకరలు పోతుంటే
ఏడుపొస్తున్నాది మావా
సెడ్డ ఏడుపొస్తున్నాది మావా

తలకి నీల్లోసుకొని
తడియార బెట్టుకొని నిలుసుంటే
నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంటది
సల్లగాలి ఆ పక్క సలి సలిగ సోకుతుంటే
పిల్లగాలి ఈ పక్క ఎచ్చెచ్చగ ఏపుతుంటే
నడిమద్దే నలిగాను పిల్లోయ్
ఈ పక్క ఆ పక్క యిరకాటం నీకుంటే
నా కెదటేమో కుర్రతనం ఎనకేమో కన్నెతనం
ఎటు తోస్తే ఏమౌనో మావో..
హోయ్..హోయ్..హోయ్..హాయ్

తలకి నీల్లోసుకొని
కురులారబోసుకొని
నిలుసుంటే నీవు
నిలుసుంటే నామనసు
నిలవనంటది
ఎంతరమ్మన్న నిన్నొదలి
రానంటది రానంట
ది

మాయదారి మల్లిగాడు--1973



















సంగీతం::K.V.మహాదేవన్
రచన::కోసరాజు రాఘవ చౌదరి
గానం::S.P.బాలు,P.సుశీల

వస్తా
వెళ్ళోస్తా
మల్లెప్పుడొస్తావ్
రేపుసందేలకొస్తా


చూస్తా
ఎదురుచూస్తా
చూస్తా ఎదురు చూస్తా
జాగుచేస్తే సగం చస్తా
రాకపోతే అసలు చస్తా
ఆ..వస్తా
వెళ్ళోస్తా
మల్లెప్పుడొస్తావ్
రేపుసందేలకొస్తా
రేపు సందేళకొస్తా
రేపు సందేలకొస్తా


వచ్చా...అ జజజజ
హు..వచ్చావులేమహా
నీకేం..ఎవరైన చూస్తారని
ఎంత హడలి చఛా
ఆ..ఎవరైన చూసారా
సూడకుంటారా సుప్పనాతోళ్ళు
పిట్టచూసి పిట్టతోటి
గుట్టుసెప్పింది
మబ్బుచూసి సందమామను
మాటురమ్మంది..ఆహా...
గాలిచూసి ఈలవేసి
గోలచేసింది
కాలి మక్కు మనసు ముందుకు
లాగి లాగి జాగైంది
హా...హా...హా...


వస్తా...వెళ్ళొస్తా...
మళ్ళేప్పుడొస్తా
రేపుసందేళకొస్తా
రేపు సందేళకొస్తా
రేపు సందేళకొస్తా


మావా...ఓ..మావా
ఏమ్మా కోపమా...
లే..సంబరం
వచ్చానుగా
వచ్చావులేమ్మ...
చల్లారె ఈలకి...
వచ్చావులేమ్మ
చల్లారె ఎలకి
ఏంచేయను!!
గడపదాటి కలికినన్ను
కామయ్య కాచాడూ..
నక్కి నక్కి వస్తుంటే..
నరసయ్య తగిలాడు
ఏడిసాడు...
రాములోడి గుడికాడ
రంగయ్య సకిలించాడు
నా గుండె దడ దడ
సూడకుండా కోపగిస్తావు
నీవు కోపగిస్తావు
వస్తా...
ఎహె...సూణ్ణే..మనకేంటే భయం..
అందరినీ ఓకంట సూసే దేవుడున్నాడూ
ఆడిముందు రేపేనీకు తాళి గడతాను
మేము ఆలుమగలం పోండిరా అని
అరచి చెపుతాను
ఒప్పినోళ్ళు మెచ్చనీ ఒప్పనోళ్ళు సచ్చనీ

వస్తా..ఎల్లోస్తా..
ఆహా..మల్లెప్పుడొస్తావ్..
నిపెళ్ళప్పుడొస్తా..
మనపెళ్ళప్పుడొస్తా
మ్మ్..హూహు హు ఊహూ...