Sunday, March 23, 2008

పాతాళబైరవి--1951::ఆభేరి::రాగం



ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::ఘంటసాల
సాహిత్యం::పింగళి
గానం::P.లీల,ఘంటసాల


ఆభేరి:::రాగం

పల్లవి::


కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయ మదిలో నా మదిలో

చరణం::1


కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

చరణం::2


నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో