Wednesday, March 09, 2011

రాముడే దేవుడు--1973


సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ 
గానం::S.జానకి 
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ  

పల్లవి::

రేపు రమ్మన్నారాదు..ఈ రంగేళీ
నేడు పొమ్మన్నాపోదు..ఈ సింగారీ  
ఏక్ రాత్ కీ రాణీ..నేనురా
ఏక్ దిన్ కా రాజా..నువ్వురా
పక్కకు వస్తే మక్కువ తీరా 
పండుగ చేస్తా రా..రా..రా      
రేపు రమ్మన్నారాదు..ఈ రంగేళీ
నేడు పొమ్మన్నాపోదు..ఈ సింగారీ  

చరణం::1

గడసరి చూపులు..కవ్వించి 
నిన్ను...వూరింతూ 
తొలకరి వూహలు..నవ్వించి 
నిన్ను...వూగింతూ
సొగసరి కైపులు..మైకాన 
నిన్ను...తేలింతూ
మగసిరి...చూపవోయి
మగసిరి...చూపవోయి
నీదే నీదే...ఈ రోజా      
రేపు రమ్మన్నారాదు..ఈ రంగేళీ
నేడు పొమ్మన్నాపోదు..ఈ సింగారీ  
ఏక్ దిన్ కా రాజా...నేనులే
ఏక్ రాత్ కీ రాణీ...నువ్వులే
పక్కకు వస్తే...మక్కువతీరా 
పండుగ చేస్తావా...వా..వహ్వా
రేపు రమ్మన్నారాదు..ఈ రంగేళీ
నేడు పొమ్మన్నాపోదు..ఈ సింగారీ  

చరణం::2

మల్లెలు...ఎందుకు 
నామేని..సొంపులున్నాయీ
మధువులు...ఎందుకు 
నా తేనె..పెదవులున్నాయీ
వెన్నెల...ఎందుకు 
నా..వన్నెచిన్నెలున్నాయీ
విందులు...ఎందుకు
విందులు...ఎందుకు
కనువిందై..నేనేవున్నారా       
రేపు రమ్మన్నారాదు..ఈ రంగేళీ
నేడు పొమ్మన్నాపోదు..ఈ సింగారీ  
ఏక్ రాత్ కీ రాణీ..నేనురా
ఏక్ దిన్ కా రాజా..నువ్వురా
పక్కకు వస్తే...మక్కువతీరా 
పండుగ చేస్తా..రా..రా..రా      
రేపు రమ్మన్నారాదు..ఈ రంగేళీ
నేడు పొమ్మన్నాపోదు..ఈ సింగారీ