Tuesday, February 25, 2014

అశోక చక్రవర్తి--1993



















సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి 
గానం::S.P.బాలు , S.జానకి
తారాగణం::బాలకృష్ణ,భానుప్రియ. 

పల్లవి::

ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము 
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి..తమనే వలచి..పిలిచే..వేళ

ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎదలా ఎదుటే నిలిచి..వలపై..ఇలపై..నిలిచే..వేళ
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనము

చరణం::1

నీ రాధనేరా..ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే..వేసి ఈల
నీకెందుకా దేవి పూజ..నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల..ఈ దేవతే కాలుజారి
అందుకో..మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా..చాలికా
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము

చరణం::2

నీ కొంగు జారి..శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే..నా లేత ప్రాణలు తీసే
నిన్నంటుకున్నాక రేయి..కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే..మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా..కిమ్మనకా..పొమ్మనక
ఆపరా..నా దొర..తొందరా
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు..ఒక్కరికే వందనం
ఒడినే గుడిగా మలచి..తమనే వలచి..పిలిచే..వేళ
ఎందరో మహానుభావులు..సుందరికే బంధనము

తారక రాముడు--1997



సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలసుబ్రహ్మణ్యం,K.S.చిత్ర
Film Directed By::R.V.Uday Kumar 
తారాగణం::సౌధర్య,శ్రీకాంత్

పల్లవి::

కోపం వస్తే మండుటెండ 
మనసు మాత్రం వెండికొండ 
కోపం వస్తే మండుటెండ 
మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

నాకు తెలుసా..మంచి చెడ్డ 
నువ్వు చెబితే..నేర్చుకుంట
నిన్ను నమ్మినాను..అంతా దయా

నీ అల్లర్లు అందం..నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే..నీ నేస్తమే మంచి గంధం

కోపం వస్తే...మండుటెండ 
మనసు మాత్రం...వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

చరణం::1

చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట

మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా

అవునో కాదో తెలియదు కానీ
నువ్వు చెబుతుంటే అవునంటా

మరి అంతలోనె బుంగమూతి సంగతేంటటా

నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట

నిన్ను నమ్మినాను అంతా నీదయా

చరణం::2

నిండుకుండ కాదు కనుక తొణుకుతుందదీ
అంత వింత అందులోన ఏమిటున్నదీ

నాలో తెలివికీ దీన్లో నీటికీ
పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నదీ

అమృతం లాంటీ హృదయం నీది
అంత కన్న వేరే వరమేది

అది తెలిసి కూడ కసురుకుంటే నేరమెవరిదీ

కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా నీదయా

నీ అల్లర్లు అందం..నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం