Thursday, September 02, 2010

అమరజీవి--1983





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

Film Directed By::Jandyaala
తారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,పండరిబాయి,సుమలత,శరత్‌బాబు,నరసింహరాజు,శ్రీలక్ష్మీ,నాగేష్  

:::::::::::::::::

ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ...


ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ..

::::1


వేదాలకైన..మూలమది
నాదాలలోన..భావమది
దైవాలకైన..ఊయ్యలది
కాలాలకన్న..వేదమది
కన్నీళ్ళు మింగి..బ్రతికేది
అదిలేనినాడు..బ్రతుకేది
నీకై..జీవించి
నిన్నే..దీవించి
నీకై..మరణించు
జన్మజన్మల..ఋణమీ ప్రేమ

ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ..

::::2


లయమైన సృష్టి..కల్పములో
చివురించు లేత..పల్లవిది
గతమైనగాని..రేపటిది
అమ్మలుగన్న..అమ్మ ఇది
పూలెన్ని..రాలిపోతున్నా
పులకించు..ఆత్మగంధమిది
నిన్నే..ఆశించి
నిన్నే..సేవించి
కలలె..అర్పించు
బ్రతుకు చాలని..బంధం ప్రేమ

ఓదార్పుకన్న..చల్లనిది
నిట్టూర్పుకన్న..వెచ్చనిది
గగనాలకన్న..మౌనమిది
అర్చనగా..ద ద ద ని
అర్పనగా..ని ద ని స
దీవెనగా..లాలనగా
వెలిగే ప్రేమ..

అమరజీవి--1983





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు

Film Directed By::Jandyaalaతారాగణం::అక్కినేనినాగేశ్వరరావు,జయప్రద,పండరిబాయి,సుమలత,శరత్‌బాబు,నరసింహరాజు,శ్రీలక్ష్మీ,నాగేష్  

:::::::::::::::::::::

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి

గున్నమావి పందిళ్ళలోనా..ఆ..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ..

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ..

పొగడ పూలైనా..పొగడే అందాలే..మురిసే మలిసంజెవేళలో
మల్లీ మందారం..పిల్లకి సింగారం..చేసే మధుమాసవేళలో
నా రాగమే నీ ఆరాధనై..చిరంజీవిగా..ఆ..దీవించనా
Happy Birthday to you !

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ..|

లలలలా లలలలా ఆ ఆ ఆ ఆ ఆ
లలలలా లలలలా ఆ ఆ ఆ ఆ ఆ
రెల్లు చేలల్లో..రేయీ వేళల్లో..కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు..బొట్టై ఏనాడు..మురిసే ముత్తైదు శోభతో
నీ సౌభాగ్యమే..నా సంగీతమై..ఈ జన్మకీ జీవించనా
Happy Birthday to you!

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ..

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ..