Saturday, July 23, 2011

మహర్షి--1987::మధువంతి:: రాగం




సంగీతం::ఇళయరాజా
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం::S.P.బా
లు ,S.జానకి
రాగం:::మధువంతి


ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తన నాననాన తన నాననాన..తన నాననాన తన నాననాన

సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

హహా ఆ అహహహహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేణువ...వీణియ ఏవిటీ...రాగము
వేణువ...వీణియ ఏవిటీ...రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా..ప్రేమ మహిమా..నాదు హృదయం
భానోదయాన...చంద్రోదయాలు...
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

ఆ ఆ తారత్తార తారరం తారత్తార తారరం
రంగులే..రంగులు అంబరా...నంతట
రంగులే రంగులు అంబరానంతట
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేది...నాలోన లేదు
ఆవేగమేది నాలోన లేదు
ప్రేమమయమూ...ఆ ఆ
ప్రేమమయమూ..నాదు హృదయం..
భనోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భానోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

మహర్షి--1987




సంగీతం::ఇళయరాజా
రచన::ఆత్రేయ,ఆచార్య
గానం::SP.బా
లు ,S.జానకి


కోనలో సన్నజాజి మల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హోయ్ శ్రీకారమై హోయ్
కస్తూరి తాంబూలమీవే

కోరుకో సన్నజాజి మల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో ప్రేమ కవితలల్లి కవితలల్లి
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

మేని సోయగాలు ప్రేమ బంధనాలు
మౌన స్వాగతాలు రాగరంజితాలు
సరసములో సమరములు
సరసులకు సహజములు
ప్రాభవాలలోన నవ శోభనాల జాణ
రాగదే రాగమై రాధవై

కోరుకో సన్నజాజి మల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సొకులన్ని సొకులన్ని
పాడుకో ప్రేమ కవితలల్లి కవితలల్లి
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి
రాగలనే హోయ్ బోయీలతో హోయ్
మేఘాల మేనాలో రానా
కోనలో సన్నజాజి మల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హోయ్ శ్రీకారమై హోయ్
కస్తూరి తాంబూలమీవే

కోయిలమ్మ రాగం కొండవాగు వేగం
పారిజాత సారం ఏకమైన రూపం
అధరముపై...అరుణిమలు
మధురిమకై...మధనములు
నందనాలలోన రసమందిరాలలోన
హాయిగా..సాగగా..చేరగా..
కోనలో సన్నజాజి మల్లి జాజిమల్లి
మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి
వేణిలో కన్నె నాగమల్లి నాగమల్లి
తీరులో అనురాగవల్లి రాగవల్లి
కావ్యాలకే హోయ్ శ్రీకారమై హోయ్
కస్తూరి తాంబూలమీవే

కోరుకో సన్నజాజి మల్లి జాజిమల్లి
ఏలుకో కన్నె సోకులన్ని సోకులన్ని
పాడుకో ప్రేమ కవితలల్లి కవితలల్లి
వేసుకో పాలబుగ్గపైన రంగవల్లి

స్వాతి కిరణం--1992 :: రాగం: అమౄతవర్షిణి



సంగీతం::KV.మహాదేవన్
రచన::సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం::
వాణీ జయరాం

రాగం:::అమౄతవర్షిణి
(కర్నాటక హిందుస్తాని)

ఆనతినీయరా! హరా!
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా, హరా!
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,

!!ఆనతినీయరా! హరా!

నీ ఆన లేనిదే, రచింపజాలునా

వేదాల వాణితో విరించి విశ్వ నాటకం?
నీ సైగ కానిదే, జగాన సాగునా

ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం?
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై,
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై,
కదులునుగా సదా సదాశివ!

!!ఆనతినీయరా! హరా!

ని ని స ని ప నీ ప మ గ స గ
!!ఆనతి నీయరా!!


అచలనాధ అర్చింతునురా!

!!ఆనతినీయరా!!

పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని
ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా!!
మంగళ దాయక దీవెనలిడర!
సాష్ఠాంగముగ దండము సేతురా!

!!ఆనతినీయరా!!

సానిప గమపానిపమ
గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా

!!ఆనతినీయరా!!

శంకరా! శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని,
విసపు నాగులను చంకనెత్తుకొని,
నిలకడనెరుగని గంగనేలి,

ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి

నీ కింకరుణిక సేవించుకొందురా!

!!ఆనతినీయరా!!

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్షా! ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ క్రుపా-వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక,
పరీక్ష సేయక, రక్ష రక్ష యను ప్రార్ధన వినరా!

!!ఆనతినీయరా! హరా!
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా, హరా!

ఖైదీ no 786--1988


సంగీతం:రాజ్ కోటి
రచన:భువన చంద్ర
గానం:S.P.బాలు,S.జానకి


అ:గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
ఆ:నిన్ను నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
అ:ఆడుకోవాలి గువ్వలాగా
ఆ:పాడుకొంటాను నీ జంట గోరింకనై

అ:జోడుకోసం గోడదూకే మైదిలి తెలుసుకో అమ్మాయిగారు
ఆ:అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
అ:ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఆ:ఓర్పులూ..నిట్టూర్పులూ ..అంతా నీధ్యానం
అ:కోరుకొన్నానని ఆటపట్టించకు
ఆ:చేరుకొన్నానని నన్ను దోచేయకు చుట్టుకొంటాను సుడిగాలిలా
అతడు:గువ్వా
ఆ:ఆ...
అతడు:గోరింకతో
ఆ:ఆ...
అ:అడిందిలే బొమ్మలాట
ఆ:హేయ్...నిన్నూ
అ:హా...
ఆ:నాగుండేలో
అ:హా...
ఆ:మ్రోగిందిలే వీణపాట

ఆ:కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చేసంగీతం
అ:సందెకాడ అందెగత్తె గుండెలో వుందిలే ఎంతో సంతోషం
ఆ:పూవులో మకరందమూ వుందే నీకొసం
అ:తీర్చుకో ఆదాహమూ వలపే జలపాతం
ఆ:కొంచం ఆగాలిలే కోర్కెతీరెందుకు
అ:దూరముంటానులే దగ్గరైయెందుకు
ఆ:దాచిపెడతాను నాసర్వమూ...
అ:గువ్వా..
ఆ:హాయ్
అ:గోరింకతో
ఆ:హాయ్
అ:ఆడిందిలే బొమ్మలాట
ఆ:హాయ్ నిన్నూ
అ:హ..
ఆ:నాగుండెలో
అ:హ..
ఆ:మ్రోగిందిలే వీణపాట
ఇద్దరు:ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకొంటాను నీజంట గోరింకనై....

నాలుగు స్తంభాలాట ---1982




సంగీతం::రాజన్-నాగేంద్ర
సాహిత్యం::వేటూరి
గానం
::SP.బాలసుబ్రమణ్యం, P.సుశీల

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచి పోబోకుమా..మమత నీవే సుమా

!! చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ !!

ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి వుంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే..వెల్లువౌతానులే

హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచి పోబోకుమా.. విరహమైపోకుమా

తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే..ఆ తీరాలు చేరాలిలే

మౌనమై వెలిసి గానమై పిలిచి
కలలతో అలిసి ఎగనమై ఎగసి
ఈ ప్రేమ..నా ప్రేమ..తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా..ప్రేమ మనమే సుమా

!! చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా..మమత నీవే సుమా
!!

ఛాలెంజ్ --- 1984



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరిసుందరరామమూర్తి 
గానం::S.P.బాలు,S.జానకి
సినిమా దర్శకత్వం::A. కోదండరామిరెడ్డి
సినిమా నిర్మాణం::K.S.రామారావు
కథ::యండమూరి వీరేంద్రనాధ్
తారాగణం::చిరంజీవి,సుహాసిని,విజయశాంతి,రావుగోపాలరావు,గొల్లపూడి మారుతీరావు,రాజేంద్ర ప్రసాద్,సాయికుమార్,కృష్ణ చైతన్య,ప్రసన్న కుమార్,సిల్క్ స్మిత.

పల్లవి::

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..మ్మ్ హు 
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా..అహ అహ ఆ
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..ఆ..ఓ
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా

చరణం::1

తప్పంటూ చేయక పోతే తగలాటము
నిప్పంటి వయసులతోనా చెలగాటము
ఐతే మరి ఎందుకు చెప్పు మోమాటము
ఆడదాని మోమాటమే ఆరాటము
వానాకాలం..మ్మ్..ముసిరేస్తుంటే
వాటేసుకునే..ఏఏఏ..హక్కేఉంది
ఇదివానో గాలో పొంగో వరదో
రారా మలిపొద్దులు పుచ్చక..సుద్దులతో ఈ వేళా..ఆ
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా..మ్మ్ హుహు
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..లలలలలా

చరణం::2

ఏదిక్కూ లేని చోటే ఏకాంతము
నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రమూ
ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము
సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము
కవ్వింతల్లో కసిగా ఉంటే..ఏఏఏ
కౌగిలి కన్నా దారేముంది
అది రైటో కాదో నైటో పగలో
రావే చెలి ఆకలి తీర్చకు .చూపులతో ఈ వేళా..ఆ

భామా..ఆ..ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..ఏహే ఏహే ఏహే ఏహే
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా..పరప్పాపాపా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..ఆ..ఓ..
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..పరప్పాపాపా
మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా

Challenge--1984
Music::Ilayaraajaa
Lyrics::Vetoorisundararaamamoorti
Singer's::S.P.Baalu,S.Jaanaki
Film Directed By::A.Kodanda raami reddy
Film Producer By::K.S.Raamaaraavu
Film Story::Endamoori Veerendranaath 
Cast::Chiranjeevi,Suhaasini,Vijayasaanti,Raavugopaalaraavu,Gollapoodi maaruteeraavu,Raajendra Prasaad,Saayikumaar,Krshna Chaitanya,Prasanna kumaar,Silksmita.

:::::::::

bhaamaa ee tippalu tappavu eppaTikainaa..mm hu 
maavaa nee pappulu uDakavu aapara gOlaa..aha aha aa
vaddanTE vayasochchi vaddannaa manasichchi
niddarakE selavichchEy ee vELaa..aa..O
bhaamaa ee tippalu tappavu eppaTikainaa

::::1

tappanToo chEyaka pOtE tagalaaTamu
nippanTi vayasulatOnaa chelagaaTamu
aitE mari enduku cheppu mOmaaTamu
aaDadaani mOmaaTamE aaraaTamu
vaanaakaalam..mm..musirEstunTE
vaaTEsukunE..EEE..hakkEundi
idivaanO gaalO pongO varadO
raaraa malipoddulu puchchaka..suddulatO ee vELaa..aa
maavaa nee pappulu uDakavu aapara gOlaa..mm huhu
bhaamaa ee tippalu tappavu eppaTikainaa..lalalalalaa

::::2

Edikkoo lEni chOTE Ekaantamu
naa dikkoo mokkoo nuvvE saayantramoo
ippaTlO vaddoo manaku vEdaantamu
sigganToo buggivvaDamE siddaantamu
kavvintallO kasigaa unTE..EEE
kaugili kannaa daarEmundi
adi raiTO kaadO naiTO pagalO
raavE cheli aakali teerchaku .choopulatO ee vELaa..aa

bhaamaa..aa..ee tippalu tappavu eppaTikainaa..EhE EhE EhE EhE
maavaa nee pappulu uDakavu aapara gOlaa..parappaapaapaa
vaddanTE vayasochchi vaddannaa manasichchi
niddarakE selavichchEy ee vELaa..aa..O..
bhaamaa ee tippalu tappavu eppaTikainaa..parappaapaapaa

maavaa nee pappulu uDakavu aapara gOla

మహర్షి--1987




సంగీతం::ఇళయరాజా
రచన::వెన్నెలకంటి
గానం::S.P.బాలు

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం..హ..
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యనూ
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యనూ
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా

అదరనీ బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహర్షి

వేడితే లేడి వొడి చేరుతుందా వేట సాగాలి కాదా
వోడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతమూ సొంతమూ పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండనూ
భీరువల్లే పారిపోను రేయి వొళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా

మహర్షి--1987




సంగీతం::ఇళయరాజా
రచన::వెన్నెలకంటి
గానం::S.P.బాలు,S.జానకి

మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది
మౌన వీణ గానమిది
గానమిదీ నీ ధ్యానమిదీ
ధ్యానములో నా ప్రాణమిదీ
ప్రాణమైన మూగ గుండె రాగమిది

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేల

అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగల తీగల్లొ వీణానాదం కోరింది ప్రణయవేదం
వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారతీరం అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది
కూడనిదీ జత కూడనిదీ
చూడనిదీ మది పాడనిదీ
చెప్పరాని చ్హిక్కుముడి వీడనిదీ

మాట రాని మౌనమిది..మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మ చాటు అందమిది