Tuesday, May 12, 2009

చండీప్రియ ~~ 1980

సంగీతం::ఆదినారాయణ రావ్,సత్యం
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల,SP.బాలు,SP.శైలజ

ఓ..ప్రియా..ప్రియా..
చండీప్రియా..ప్రియా..
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా
నడిచే..చంద్రలేఖ....

ఓ..ప్రియా..ప్రియా..
చండీప్రియా..ప్రియా..
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే..ఈ చంద్రలేఖ....

మనసులో..ప్రతి మలుపులో..నిను మలచుకొన్నానులే
కలలలో..మధువనులలో..నీ పిలుపు విన్నానులే..
మనసులో..ప్రతి మలుపులో..నిను మలచుకొన్నానులే
కలలలో..మధువనులలో..నీ పిలుపు విన్నానులే..
ఆ ఆ..చెలియరూపాన...చేరుకొన్నావ..
పలికే..రాగరేఖా..
కలా..నిజం..నిజం..మ్మ్....
ఓ..ప్రియా..ప్రియా..
చండీప్రియా..ప్రియా..
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే..ఈ చంద్రలేఖ....

ఎవ్వతే..నీ వెవ్వతే..వొలికించుతావు వగలూ..
ఏమిటే..కథ..ఏమిటే..కురిపించుతావు సెగలూ..
ఆశలు..జీవితాశలు..నే చెదివినెవికాదా
చండినీ..అపరచండినీ..నను కదిపితే ప్రమాదం
ఆ ఆ..నీవు నా కైపు..చాలు నావైపు..అయ్యో..ఏమి రాత
అటా..ఇటు..ఎటూ..ఇటూ..
ఓ..ప్రియా..ప్రియా..
చండీప్రియా..ప్రియా..
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా
నడిచే..చంద్రలేఖ....
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే..ఈ చంద్రలేఖ....

లంకేశ్వరుడు--1989

సంగీతం::రాజ్‌కోటి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::మనో,S.జానకి

జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతం

ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..జరిగిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...

వొంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
వొంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీరు కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీరు వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ

మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలఏరల్లే ఉరకాలీ యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలఏరల్లే ఉరకాలీ యవ్వనాలూ
కొమ్మల్లో పూలన్ని పానుపుగా మన ముందుంచె పూలగాలీ
పూవుల్లో దాగున్న అందాలనీ మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి

జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ..