Saturday, July 16, 2011

అమరశిల్పి జక్కన్న--1954



సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల


ఓ..హో..ఓ..ఓ..హో..హో..ఓ..ఓ..
ఒ..హో..హో..హో..ఓఓ..ఓఓ..ఓఓ..ఓఓ..

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ..
ఈ నల్లని రాళ్ళలో.....

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
ఈ నల్లని రాలలో.....

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఏ...
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనె..ఎ..ఎ..ఎ..ఎ..ఎ..
ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు
ఈ నల్లని రాలలో.....

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును

ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ..
ఈ నల్లని రాళ్ళలో.....

అమరశిల్పి జక్కన్న--1954::తిలంగ్::రాగం



సంగీతం::సాలూరి
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,P.సుశీల

తిలంగ్::రాగం 

నిలువుమా నిలువుమా

నిలువుమా నిలువుమా నీలవేణి
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణి..

అడుగడున ఆడే లే నడుము సొంపులా
అడుగడున ఆడే లే నడుము సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపుల
తడబడే అడుగుల నటనల మురిపింపుల
సడిసేయక ఊరించే..ఏ..ఏ..ఏ..
సడిసేయక ఊరించే..వయ్యారపు వొంపుల
ఓ..హో..ఓ..ఆ ఆ ఆ ఆ ఆ
కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణి..ఆ..ఆ..ఆ
నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా..ఆ..నిలువుమా..ఆ..నీలవేణి

అద్దములో...ఓ...ఓ...
అద్దములో..నీ చెలువు తిలకింపకు ప్రేయసీ
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి
అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి
నా ఊర్వశి రా వే రావేయని పిలువనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నా ఊర్వశి రా వే రావేయని పిలువనా
ఆ సుందరి నెఱనీకు నీగోటికి సమమౌనా
రాచెలీ నినుమదీ దాచుకోనీ
రాచెలీ..ఆ..నినుమదీ..ఆ..దాచుకోనీ
నీ కనుల నీలినీడ..ఆ..నా..ఆ..మనసూ..ఆ..నిదురపోనీ
నిలువుమా..ఆ..నిలువుమా..ఆ..నీలవేణి