Friday, September 09, 2011

రాధాకళ్యాణం--1981

 సంగీతం::K.V.మహదేవన్ 

రచన::సినారె

గానం::P.సుశీల,S.P.బాలు

తారాగణం::చంద్రమోహన్,రాధిక,శరత్‌బాబు,రావికొందలరావు,రాధాకుమారి,రాజేశ్వరి,రాళ్ళపల్లి 


పల్లవి:: 


పల్గాట్ మాధవన్..పాటంటే ధనాధన్

మదరాసి మాధవన్..మాటంటే ఝణాఝన్

నా..ఆఆ..చాన్స్ దొరికితే కానా..ఆ

మ మ మ మ మ మహాదేవన్..


చిటికేయవే చినదానా..చిందేయవే తందాన

చిటికేయవే చినదానా..చిందేయవే తందాన

నీ చిటికెల చినుకుల..చిత్తుగ తడిసి

పూటకొక్క పాటకట్టి..పాటతోనే కోటకట్టి..

కోటలోన నిన్ను పెట్టి..

చిటికేయవే చినదానా..చిందేయవే తందాన 


చరణం::1


పనిపమ రిమ పనిపమ రిపనిపమ మపమరి రిమరిసరి పమపా.. 

మెత్తగా పదమెత్తగా..కుసుమించిన అందెల గుండెలు

ఝల్ అనగా..ఆ ఆ ఆ


మపమరి సరి మపమరి..నిసరిస మరిపమ నిపమరి రిసని నిసపా..ఆ ఆ ఆ

ఆడగా నడుమాడగా..జడవంపులలో మను డెత్తిన విల్లనగా..ఆ ఆ ఆ

సుస్వర భాస్వర సురుచిర లయ చరిగా..ఆ ఆ ఆ

సనిపమరిసనిపనీ..

ఆ..చిటికేయవే చినదానా..చిందేయవే తందాన 


చరణం::2


కొప్పులోని జాజిపూలు..ఘుమఘుమలే మా సరిగమలన్నాయీ..ఈ ఈ ఈ 

గుండేలోని పొంగులేవో..గుసగుసలే మా పల్లవి లన్నాయి  

కొప్పులోని జాజిపూలు..ఘుమఘుమలే మా సరిగమలన్నాయీ..ఈ ఈ ఈ 

గుండేలోని పొంగులేవో..గుసగుసలే మా పల్లవి లన్నాయి

తకధిమి అంటు ఆడే అడుగులు..తామే చరణాలన్నాయి

ఎదలో తీయని కదలికలేమో..మృదంగ నాదాలన్నాయి

ఓరి మాధవా..ఆఆ..ఓరి మాధవా నా అణువణువు

కేరళగీతాలున్నాయి..కేరళగీతాలున్నాయి..కేరళగీతాలున్నాయి..

లలలాలలా లల్లాల..లలలాలలాలల్లాల   

లలలాలలా లల్లాల..మ్మి మ్మి మ్మిమ్మ మ్మ మ్మ    

 

raadhaakaLyaaNaM--1981

Music::K.V.mahadaevan^ 

Lyrics::sinaare

Singer's::S.P.Baalu,P.Suseela.

taaraagaNam::chandramOhan,raadhika,Sarat^baabu,raavikondalaraavu,raadhaakumaari,raajESwari,raaLLapalli 


::::::::::::::::::::::::::::::::::::: 


palgaaT maadhavan..paaTanTE dhanaadhan

madaraasi maadhavan..maaTanTE jhaNaajhan

naa..aaaaaa..chaans dorikitE kaanaa..aa

ma ma ma ma ma mahaadEvan..


chiTikEyavE chinadaanaa..chindEyavE tandaana

chiTikEyavE chinadaanaa..chindEyavE tandaana

nee chiTikela chinukula..chittuga taDisi

pooTakokka paaTakaTTi..paaTatOnE kOTakaTTi..

kOTalOna ninnu peTTi..

chiTikEyavE chinadaanaa..chindEyavE tandaana 


::::::::1


panipama rima panipama ripanipama mapamari rimarisari pamapaa.. 

mettagaa padamettagaa..kusuminchina andela gunDelu

jhal anagaa..aa aa aa


mapamari sari mapamari..nisarisa maripama nipamari risani nisapaa..aa aa aa

ADagaa naDumaaDagaa..jaDavampulalO manu Dettina villanagaa..aa aa aa

suswara bhaaswara suruchira laya charigaa..aa aa aa

sanipamarisanipanii..

aa..chiTikEyavE chinadaanaa..chindEyavE tandaana 


::::::::::2


koppulOni jaajipoolu..ghumaghumalE maa sarigamalannaayii..ii ii ii 

gunDElOni pongulEvO..gusagusalE maa pallavi lannaayi  

koppulOni jaajipoolu..ghumaghumalE maa sarigamalannaayii..ii ii ii 

gunDElOni pongulEvO..gusagusalE maa pallavi lannaayi

takadhimi anTu ADE aDugulu..taamE charaNaalannaayi

edalO teeyani kadalikalEmO..mRdanga naadaalannaayi

Ori maadhavaa..aaaaaa..Ori maadhavaa naa aNuvaNuvu

kEraLageetaalunnaayi..kEraLageetaalunnaayi..kEraLageetaalunnaayi..

lalalaalalaa lallaala..lalalaalalaalallaala   

lalalaalalaa lallaala..mmi mmi mmimma mma mma     

నిప్పులాంటిమనిషి--1974
సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::D.C.నారాయన రెడ్డి
గానం::S.P.బాలు

Film Directed By::S.D.Laal
తారాగణం::నందమూరి తారక రామారావు,లత,కైకాల సత్యనారాయణ,
ప్రభాకరరెడ్డి,
దేవిక,రాజబాబు,రేలంగి.
Year::25th October 1974

:::::::::::::::::::::::::


సాకీ::-


అల్లాయే దిగి వచ్చి
అల్లాయే దిగి వచ్చి
ఆయ్ మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దూ...
పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను
ఒక్క నేస్తం కావాలంటాను

స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
స్నేహమే హోయ్...
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
హోయ్..స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

:::1


గుండెనే పలికించితే..గుండెనే పలికించితే
కోటి పాటలు పలుకుతాయ్..
మమతనే పండించితే..మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ..బాధలను ప్రేమించు భాయీ
లేదు అంతకు మించి హాయి
హోయ్..స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

::::2


కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఆ..కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటో ఈ బాధ..ఏమిటో ఈ బాధ
నాకైనా చెప్పు భాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
హోయ్..నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
చుక్కలను కోసుకుని తెమ్మంటావా
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా..దింపమంటావా
ఆ చంద్రుణ్ణి..హ్హా..తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
దోస్తీకి నజరానా
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
ఒక నవ్వేచాలు వద్దులే వరహాలు నవ్వరా..
నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
హాయ్..నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు రంజాను పండుగా

స్నేహమే హోయ్...
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం