Saturday, July 21, 2007

ఆలీబాబా 40 దొంగలు--1970



శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం::B. విఠలాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల,P.సుశీల 
తారాగణం:::N.T.రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ

పల్లవి::

లా..ల..లల..లా..లలాలాలా
ఆకతాయి..ఒట్టి ఆకతాయి  
హ..హా..హా
రావోయి రావోయి రాలుగాయి
రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్

చరణం::1

నీ కోసమే రేయి ఆగింది
నిను చూసి తనువేమో రేగింది
మదిలోని సెగలోన మరిగింతునోయి
మదిలోని సెగలోన మరిగింతునోయి
దిక్కుల తీరే చుక్కల లోకం చూపించేనోయీ..ఈ
రావోయి రావోయి రాలుగాయి..ఈ

చరణం::2

కొండల్లో తిరిగేటి సింహాము
వేసింది కుందేటి వేషము
ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి
ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి
మంచి తరుణం ఇది
మించి పోవునని మాటు వేసినోయీ..ఈ
రావోయి రావోయి రాలుగాయి..ఈ

చరణం::3

కొల్లగొట్టి కోటలెన్నో కట్టారు
కత్తుల బోనులో కాలు పెట్టారు
పులినోట తల దూర్చి పోలేరులే
పులినోట తల దూర్చి పోలేరులే
ఎత్తులు జిత్తులు ఎన్నైనా గమ్మత్తుగ చిత్తవులే..ఏ
రావోయి రావోయి రాలుగాయి..ఈ

చరణం::4

మక్కువయేలేని మగువ పక్కలోన బల్లెము
కంగారైతే కలిసొచ్చే కాలమే కాదురోయ్
దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు
దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు
ఇంటిలోన సర్కారేమో భలే ఇరుకున పడ్డారూ..ఊ

రావోయి రావోయి రాలుగాయి
రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్
రావోయి..రావోయి..రావోయి

జమిందారు గారి అమ్మాయి--1975


సంగీతం::G.K.వేంకటేష్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,L.R.ఈశ్వరీ 
తారాగణం::శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు 

పల్లవి::

This is life..This is youth  
ఇది జీవితం..ఇది యౌవ్వనం
స్నేహాలు మోహాలు..విరితేనే చిలికించగా
రాగాల భోగాల హృదయాలు పులకించుటే ప్రేమ
This is life..ఇది జీవితం
This is youth..ఇది యౌవ్వనం

చరణం::1

చలిరేయి నెలరాజు నులి వెచ్చనా
నడిమంట దినరాజు కడు చల్లనా
చలిరేయి నెలరాజు నులి వెచ్చనా
నడిమంట దినరాజు కడు చల్లనా
వలపులోనా రేయిపగలు వాసంత శోభ
This is life..ఇది జీవితం
This is youth..ఇది యౌవ్వనం

చరణం::2

ప్రణయాలు పన్నీటి అలలౌనులే
కలలన్ని కర్పూర శిలలౌనులే
ప్రణయాలు పన్నీటి అలలౌనులే
కలలన్ని కర్పూర శిలలౌనులే
ఆదమరచే లేతవలపే అనంద సీమ
This is life..ఇది జీవితం
This is youth..ఇది యౌవ్వనం
స్నేహాలు మోహాలు విరితేనే చిలికించగా
రాగాల భోగాల హృదయాలు పులకించుటే ప్రేమ
This is life..ఇది జీవితం
This is youth..ఇది యౌవ్వనం

జమిందారు గారి అమ్మాయి--1975


సంగీతం::G.K.వేంకటేష్
రచన::ఆరుద్ర
గానం::నవకాంత్,గిరిజ
తారాగణం::శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు 

పల్లవి::

ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో 
ఒకే లాగ కాంతులు నిండాలీ
ఒకే లాగ కాంతులు నిండాలీ

చరణం::1

ఓ యి౦ట చిరుదివ్వె నిలబెడితె
పదివేల దీపాలు వెలిగేనూ
పదివేల దీపాలు వెలిగేనూ
పోరుగింట పుణ్యాలూ ఇరుగింటి సౌఖ్యాలూ
పోరుగింట పుణ్యాలూ ఇరుగింటి సౌఖ్యాలూ
కలబోసి జనులంత బతకాలీ
కలబోసి జనులంత బతకాలీ        
ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో 
ఒకే లాగ కాంతులు నిండాలీ
ఒకే లాగ కాంతులు నిండాలీ

చరణం::2

దివినుండి వెలుతురు దినదినము వస్తుందీ
దివినుండి వెలుతురు దినదినము వస్తుందీ 
అది భువి నుండి ఈ రేయి పొంగిందీ
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ
రంగు రంగుల కాంతి రమ్యమైన కాంతీ
రంగు రంగుల కాంతి రమ్యమైన కాంతీ
కలకాలం కన్నులో నిలపాలీ
కలకాలం కన్నులో నిలపాలీ    
ఇంటింట దీపాలు వెలగాలీ
మన ఊరంత చీకట్లు తొలగాలీ
కలవారి లోగిట్లో నిరుపేద ముంగిట్లో 
ఒకే లాగ కాంతులు నిండాలీ
ఒకే లాగ కాంతులు నిండాలీ a